తక్కువ ధరకే అందరూ ఎదురుచూసిన కారు వచ్చేసింది.. టాటా-మారుతికి గట్టి షాక్!
హ్యుందాయ్ వెన్యూ పేరు విన్నప్పుడు ఆటోమొబైల్ ప్రేమికులకు గుర్తొచ్చేది.. స్టైల్, సౌకర్యం, నమ్మకం. ఈ పేరును మరింత బలోపేతం చేస్తూ, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త హ్యుందాయ్ వెన్యూను భారత మార్కెట్లో ఘనంగా లాంచ్ చేసింది. కొత్త వెన్యూ పాత మోడల్‌తో పోలిస్తే గణనీయమైన మార్పులు, కొత్త ఫీచర్లు, మెరుగైన పనితీరు, ఆధునిక టెక్నాలజీలతో ముందుకు వచ్చింది. ఇదే సమయంలో, కంపెనీ వెన్యూ N లైన్ వేరియంట్‌ను కూడా ఆవిష్కరించింది, ఇది మరింత పవర్‌ఫుల్, స్పోర్టీ అనుభవాన్ని కోరుకునే యువ డ్రైవర్‌లను ఆకర్షించేలా రూపొందించబడింది. హ్యుందాయ్ వెన్యూ భారత మార్కెట్లో రూ. 7.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల అయింది.
2019లో మొదటిసారిగా లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటివరకు వెన్యూ సుమారు 7 లక్షల కుటుంబాలకు చేరి హ్యుందాయ్‌కు ఒక బలమైన సక్సెస్ స్టోరీగా నిలిచింది. ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ ద్వారా కంపెనీ మరింత మార్కెట్ షేర్ దక్కించుకునేందుకు సిద్ధమైంది. హ్యుందాయ్ తన కొత్త వెన్యూ 2025 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తూ, మొదటగా 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌ల ధరలను ప్రకటించింది.

ఈ సారి కంపెనీ వెన్యూ ధరలను వినియోగదారుల అందుబాటులో ఉండేలా ఆకర్షణీయంగా నిర్ణయించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెన్యూ 1.2 పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌లు HX2, HX4, HX5 అనే మూడు వేరియంట్‌లుగా ఉన్నాయి. బేస్ వేరియంట్ అయిన HX2 ధరను హ్యుందాయ్ రూ. 7,89,900 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఇది బడ్జెట్ విభాగంలో SUV కొనాలనుకునే వారికి మంచి ఆప్షన్‌గా మారింది.
అదే సమయంలో, మిడ్ వేరియంట్ అయిన HX4 ధరను రూ. 8,79,900గా నిర్ణయించారు. ఇది కొన్ని అదనపు ఫీచర్లు, సౌకర్యాలను కలిగి ఉండటంతో కుటుంబ వినియోగదారులకు మరింత అనుకూలంగా ఉంటుంది. ప్రీమియమ్ మాన్యువల్ వేరియంట్‌గా వచ్చిన HX5 ధర రూ. 9,14,900, ఇది తన సెగ్మెంట్‌లో లగ్జరీ ఫీచర్లను అందించే మోడల్‌గా నిలుస్తుంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ వచ్చేసరికి ఎక్కువగా కాస్త ఎక్కువగా ఉంటాయి.

కొత్త హ్యుందాయ్ వెన్యూ 2025 మోడల్ ఇంటీరియర్ డిజైన్‌లో కంపెనీ పూర్తి మార్పులు తీసుకువచ్చింది. ఇది కేవలం SUV కాదు, ఒక ప్రీమియమ్ లగ్జరీ క్యాబిన్ అనిపించేంత క్లాసీగా తీర్చిదిద్దారు. స్టైలిష్‌గా, విశాలంగా, ఆధునిక టచ్‌లతో కొత్త వెన్యూ ఇంటీరియర్ డిజైన్ ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. క్యాబిన్‌లోకి అడుగుపెట్టగానే, రెండు 12.3-అంగుళాల వంపుతిరిగిన పనోరమిక్ డిస్ప్లేలు కళ్లను ఆకట్టుకుంటాయి.
ఇవి డ్రైవర్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లను చూపిస్తాయి. వెనుక సీటింగ్ ప్రాంతంలో విండో సన్‌షేడ్ సౌకర్యం కల్పించబడింది, ఇది ప్రయాణంలో సౌకర్యాన్ని మరింత పెంచుతుంది. ఇంటీరియర్‌లో VENUE బ్రాండింగ్‌తో డ్యూయల్-టోన్ లెదర్ సీట్లు ప్రీమియమ్ ఫీలింగ్ ఇస్తాయి. మధ్యలో ఉండే కాఫీ టేబుల్ స్టైల్ సెంటర్ కన్సోల్ యాంబియంట్ లైటింగ్‌తో కలిపి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

కంపెనీ ప్రీమియమ్ లెదర్ ఆర్మ్‌రెస్ట్, D-కట్ స్టీరింగ్ వీల్, మరియు ఎలక్ట్రిక్ 4-వే డ్రైవర్ సీటు వంటి సౌకర్యాలను కూడా అందించింది. వెనుక సీట్లలో 2-స్టెప్ రిక్లైనింగ్ ఫీచర్, రియర్ AC వెంట్స్ ఉన్నాయి, ఇవి వెనుక సీటు ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కలిగిస్తాయి. భద్రత విషయానికి వస్తే, అన్ని వేరియంట్‌లలో 65కి పైగా అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. వాటిలో 33 భద్రతా ఫీచర్లు ప్రామాణికంగా అందించబడ్డాయి.
కొత్త హ్యుందాయ్ వెన్యూ 1.2 లీటర్ MPi పెట్రోల్, 1.0 లీటర్ టర్బో GDi పెట్రోల్, 1.5 లీటర్ CRDi డీజిల్‌లో లభిస్తుంది. 1.2 లీటర్ ఇంజిన్ రోజువారీ డ్రైవింగ్‌కు మృదువైన పనితీరును ఇస్తే, 1.0 టర్బో GDi ఎక్కువ శక్తి కోరుకునే వారికి అనుకూలం. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT(ISGతో) ఆప్షన్‌లతో లభిస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ శక్తి, మైలేజ్ రెండింటినీ సమతుల్యం చేస్తుంది.


Click it and Unblock the Notifications








