వాయిస్‌తో ఓపెనయ్యే సన్‌రూఫ్, 7 సీటర్‌తో రోడ్డుపై స్టైలిష్ రాజసం.. కొత్త కార్పొరేట్ డీజిల్ మోడల్ వచ్చేసింది!
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన ప్రీమియం SUV అయిన అల్కాజార్ లైనప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా, తాజాగా ఓ కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ఈసారి, ప్రత్యేకంగా డీజిల్ పవర్‌ట్రెయిన్ వినియోగదారుల కోసం 'కార్పొరేట్ వేరియంట్' అనే కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది హ్యుందాయ్ అభిమానుల్లో కొత్త ఆసక్తిని కలిగించేలా ఉంది. ఇటీవలి కాలంలో హ్యుందాయ్ విడుదల చేసిన డీజిల్ అల్కాజార్ వేరియంట్‌కు సంబంధించి, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ముఖ్యమైన ఫీచర్లు అందుబాటులో లేకపోవడం వల్ల వినియోగదారుల్లో కొంత అసంతృప్తి ఏర్పడింది. అదే సమయంలో, స్పేర్ వీల్ లేకపోవడమూ మరో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అయితే, వినియోగదారుల నుంచి వచ్చిన ఈ ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకున్న హ్యుందాయ్, ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన కార్పొరేట్ వేరియంట్‌లో ఈ రెండు అంశాలను చేర్చింది. ఈ కొత్త వేరియంట్‌లో వాయిస్-కంట్రోల్డ్ పనోరమిక్ సన్‌రూఫ్ లభించనుంది, ఇది ఫీచర్ పరంగా ఇంకా మెరుగైన అనుభూతిని అందించబోతోంది. పెద్ద సన్‌రూఫ్ కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న డీజిల్ వాహనాభిమానులకు ఇది మంచి వార్త.

ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ ఫీచర్లతో కూడిన వేరియంట్ షోరూమ్‌లకు చేరుకోవడంతో, SUV సెగ్మెంట్‌లో హ్యుందాయ్ పట్టు మరింత బలంగా చూపించనుంది. అల్కాజార్ కార్పొరేట్ వేరియంట్, స్టైల్, పనితీరు పరంగా బలమైన ఎంపికగా నిలవనుంది. ఇది రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది, ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్‌లలో కొనుగోలుకు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ డీజిల్ కార్పొరేట్ (MT) వేరియంట్ ధర రూ. 17.86 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
ఇది ఫ్యూయల్ ఎఫిషియన్సీ, డ్రైవింగ్ కంఫర్ట్ పరంగా బలమైన ప్రదర్శనను చూపుతుంది. ఇక పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే, ప్రెస్టీజ్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఇది 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ప్రవేశపెట్టింది. సమర్థవంతమైన గేర్‌షిఫ్ట్‌లను అందిస్తూ, డ్రైవింగ్ అనుభూతిని మరింత మెరుగుపరుస్తుంది. ఈ వేరియంట్ ధర రూ. 18.63 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ రెండు వేరియంట్ల లాంచ్ తర్వాత కూడా, హ్యుందాయ్ అల్కాజార్‌లో ఇతర భాగాలలో ఎలాంటి మార్పులు చేయలేదు.

క్రెటా ప్లాట్‌ఫాం ఆధారంగా రూపొందించబడిన ఈ మిడ్-సైజ్ SUV, ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ వంటి నాలుగు ప్రధాన వేరియంట్లలో లభిస్తుంది. అంతేకాక, ఇది 6, 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లలో వినియోగదారుల అవసరాలను తీర్చగలిగేలా ఉంటుంది. దీనిలో ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 19.28 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు వస్తుంది. ఈ SUVలో మొదటి ఎంపికగా ఉండేది 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజిన్.
ఇది అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించబడిన ఇంజిన్‌గా, 158 bhp పవర్, 253 Nm టార్క్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ పెట్రోల్ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, మరింత స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని అందించే 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. ఇంకో వైపు, అధిక మైలేజీ కోరుకునే వినియోగదారుల కోసం 1.5-లీటర్ U2 CRDi డీజిల్ ఇంజన్‌ను కూడా హ్యుందాయ్ అందిస్తోంది.

ఇది 114 bhp పవర్‌తో పాటు 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ వేరియంట్ కూడా రెండు ట్రాన్స్‌మిషన్‌లతో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తుంది. హ్యుందాయ్ అల్కాజార్ మాన్యువల్ మోడల్స్ 20.4 kmpl మైలేజీని, డీజిల్ ఆటోమేటిక్ 18.1 kmpl మైలేజీని అందిస్తాయి. దీనిలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ వంటి డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








