ఆ ఫీచర్ సాయంతో తగ్గిన హ్యుందాయ్, కియా కార్ల దొంగతనాలు.. కస్టమర్స్ ఫుల్ హ్యాపీ

ప్రస్తుతం కార్ల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరిగిపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. అయితే ఎంత టెక్నాలజీతో వచ్చిన కార్ల దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. కంపెనీలు ఎంత టెక్నాలజీ అప్ డేట్ చేసిన దొంగలు కూడా అప్ డేట్ అయి కార్లను చోరీ చేస్తున్నారు.

కానీ ఇటీవల కాలంలో యునైటెడ్ స్టేట్స్‎లో కార్ల దొంగతనాలు గణనీయంగా తగ్గిపోయాయి. ముఖ్యంగా హ్యుందాయ్, కియా మోడల్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి వాహనాల్లో చాలా మార్పులు తీసుకొచ్చాయి. దీంతో కార్లు, వాహనాల దొంగతనాల సంఖ్య 40ఏళ్ల అత్యల్ప స్థాయికి పడిపోయింది. దక్షిణ కొరియా వాహన తయారీదారులు మెరుగైన యాంటీ-థెఫ్ట్ అప్ డేట్లను అమలు చేసిన తర్వాత దొంగతనాల సంఖ్య తగ్గింది. 2024లో వాహన దొంగతనాల సంఖ్య భారీగా తగ్గింది.

Kia Carens

గత కొన్ని సంవత్సరాలుగా హ్యుందాయ్, కియా వాహనాల్లో ఇమ్మొబిలైజర్లు లేకపోవడం వల్ల ఆ బ్రాండ్లకు చెందిన వాహనాలు విపరీతంగా దోపిడీకి గురయ్యాయి. ఇది 2021 నుంచి 2023 వరకు ఈ బ్రాండ్స్ యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధికంగా దొంగిలించబడిన వాహనాల్లో రెండో స్థానంలో నిలిచాయి. అయితే, ఈ కంపెనీలు తమ వాహనాల భద్రతను బలోపేతం చేయడానికి తమ ధోరణిని మార్చుకున్నాయి. దీంతో దొంగతనాల సంఖ్య బాగా తగ్గింది.

నేషనల్ ఇన్సూరెన్స్ క్రైమ్ బ్యూరో (NICB) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గతేడాదితో పోలిస్తే హ్యుందాయ్, కియా మోడల్స్ దొంగతనాలు దాదాపు 37.5శాతం తగ్గాయి. మొత్తంమీద యునైటెడ్ స్టేట్స్‌లో వాహన దొంగతనాలు 16.6శాతం తగ్గాయి. 2024లో 8,50,708 కార్లు దొంగిలించబడినట్లు నివేదిక పేర్కొంది. ఇది 2023లో 1.02 మిలియన్ల వాహనాలతో పోలిస్తే గణనీయంగా తగ్గుదల. ఈ డేటా హ్యుందాయ్, కియా వాహన భద్రతను మెరుగుపరచడానికి సమిష్టి ప్రయత్నాలు చేసేందుకు ఉపయోగపడింది.

Creta

దొంగతనం సమస్యను పరిష్కరించేందుకు హ్యుందాయ్ తన కస్టమర్ల కోసం ఫ్రీ సాఫ్ట్ వేర్ అప్ డేట్స్, ఇగ్నిషన్ సిలిండర్ ప్రొటెక్టర్లు, ఇమ్మొబిలైజర్లు లేని కొన్ని ఎంట్రీ-లెవల్ మోడళ్లతో సహా రీయింబర్స్‌మెంట్ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఈ చర్యలు ఈ వాహనాల భద్రతను గణనీయంగా మెరుగు పరిచాయి.

ప్రస్తుతం వాడుకలో ఉన్న 68శాతం వాహనాలు ఇప్పటికే యాంటీ-థెఫ్ట్ అప్‌డేట్‌ అందుకున్నట్లు కంపెనీలు తెలిపాయి. ఈ ముందు జాగ్రత్త చర్యల ఫలితంగా కస్టమర్ భద్రత, దొంగతనాల నివారణకు హ్యుందాయ్ నిబద్ధతను హైలైట్ చేస్తుంది.

Venue

కార్ల దొంగతనాలు తగ్గుముఖం పట్టేందుకు మెరుగైన సప్లై చైన్ కూడా ఓ ప్రధాన కారణం. దీనివల్ల నేరస్థులు వాహనాలను దొంగిలించడం తక్కువ అవుతుంది. ఆటో విడిభాగాలు, కొత్త వాహనాలు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నప్పుడు కార్లను దొంగిలించడం తక్కువ అవుతుంది.

ఇది వాహన దొంగతనాలు తగ్గుదలకు మరింత దోహదపడుతుంది. ఈ ధోరణి సప్లై చైన్ అంతరాయాలు మరో వైపు కరోనా కాలంలో వాహనాల ధరలు, వాటి విడిభాగాల ధరలు పెరిగాయి. ఇప్పుడు, ఈ ధరలకు కాస్త కళ్లెం పడింది. దీని అర్థం దొంగలు కార్లను దొంగిలించడం ద్వారా పెద్దగా లాభం పొందలేరు.

యునైటెడ్ స్టేట్స్‌లో హ్యుందాయ్, కియా కార్ల దొంగతనాలలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. వీటి తయారీదారులు అమలు చేస్తున్న దొంగతన నిరోధక చర్యలను ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వారి వాహనాల్లోని లోపాలను సరిదిద్దుకుని.. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నారు.

హ్యుందాయ్, కియా తమ కార్ల సేఫ్టీని సక్సెస్ ఫుల్‎గా అప్ డేట్ చేశాయి. ఇది వాటి యజమానులకు చాలా రిలీఫ్ అందించింది. వాహన దొంగతనాలను ఎదుర్కోవడానికి ఆటోమోటివ్ పరిశ్రమ చేస్తున్న ప్రయత్నాలలో ఈ విజయం ఒక ప్రధాన మైలురాయిగా పేర్కొనవచ్చు. వాహన భద్రతా టెక్నాలజీలో నిరంతరం కొత్త ఆవిష్కరణలు కావాలని దొంగతనం పరిస్థితులు చెబుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, March 21, 2025, 9:59 [IST]
English summary
Hyundai and kia introduce advanced anti theft features car thefts drop significantly
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+