డిసెంబర్‌లో హ్యుందాయ్ ఆఫర్ల సునామీ..కార్లపై రూ.లక్ష వరకు బెనిఫిట్స్..క్రెటా, వెన్యూ సేల్స్ అదుర్స్
భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ డిసెంబర్ నెల కోసం ప్రత్యేకంగా డిసెంబర్ డిలైట్ అనే భారీ ఆఫర్ల ప్రచారాన్ని ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా హ్యుందాయ్ కార్ల కొనుగోలుపై వినియోగదారులు ఏకంగా రూ.1,00,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ఇయర్ ఎండ్ వేడుకలను మరింత ఉత్సాహంగా, లాభదాయకంగా మార్చడానికి కంపెనీ అందిస్తున్న బంపర్ ఆఫర్.
ఏడాదిని ఘనంగా ముగించాలనుకునే వినియోగదారులకు ఈ డిసెంబర్‌లో హ్యుందాయ్ కారు కొనుగోలు ఒక అర్థవంతమైన నిర్ణయంగా మారుతుందని కంపెనీ చెబుతోంది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు ఆర్థికంగా లబ్ధి పొంది కొత్త సంవత్సరంలో కొత్త కారుతో ప్రయాణం ప్రారంభించేందుకు ప్రేరేపించడం హ్యుందాయ్ లక్ష్యం.

హ్యుందాయ్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. "డిసెంబర్ అనేది వేడుకల సమయం మా డిసెంబర్ డిలైట్ ప్రచారం ద్వారా మా వినియోగదారులకు అసాధారణమైన ఇయర్ ఎండ్ ఆనందాన్ని అందించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. ఈ చొరవ మా కార్ల కొనుగోలును మరింత లాభదాయకంగా మారుస్తుంది" అని అన్నారు.
ఈ ప్రచారంలో భాగంగా హ్యుందాయ్ సంస్థ పలు ప్రత్యేక ప్రయోజనాలను ప్రవేశపెట్టింది. ఇందులో ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక తగ్గింపులు ఉన్నాయి. దీనితో పాటు సెలక్ట్ చేసిన కార్లపై మంచి తగ్గింపులు, డీలర్‌షిప్‌లలో కొత్త సర్వీస్ ప్రోగ్రామ్స్ కూడా అందిస్తున్నారు.

హ్యుందాయ్ కంపెనీ నవంబర్ నెలలో విక్రయాలలో అద్భుతమైన లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం 66,840 కార్లను వినియోగదారులకు డెలివరీ చేసింది. సెప్టెంబర్ 22న జీఎస్‌టీ నిబంధనలు మారిన తర్వాత కార్ల ధరలు తగ్గడం, ముఖ్యంగా క్రెటా, వెన్యూ ఎస్‌యూవీలను వినియోగదారులు భారీ సంఖ్యలో కొనుగోలు చేయడం ఈ విజయానికి ప్రధాన కారణం. ఈ ఎస్‌యూవీలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్ కంపెనీకి బలమైన లాభాన్ని ఇచ్చింది.
తాజాగా నవంబర్ 4న భారత మార్కెట్‌లో విడుదలైన కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీకి డిమాండ్ ఊహించని విధంగా పెరిగింది. విడుదలైన కేవలం ఒక నెలలోనే, ఈ ఎస్‌యూవీ 32,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను సొంతం చేసుకుంది. ఈ వెన్యూ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.89 లక్షలు ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.15.48 లక్షల వరకు ఉంది.

కొత్త హ్యుందాయ్ వెన్యూ మూడు రకాల ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది.. అవి 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే మోడళ్లకు అనుగుణంగా 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ మ్యాన్యువల్, 7-స్పీడ్ (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ - DCT) గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
సేఫ్టీ విషయంలో వెన్యూ చాలా ముందంజలో ఉంది. ఇందులో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ఏడీఏఎస్ (ADAS - అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో 12.3 అంగుళాల డ్యూయల్ స్క్రీన్‌లు (ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్ డిస్‌ప్లే), 8-స్పీకర్ బోస్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్ వంటి విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








