28 కిమీ మైలేజీ ఇచ్చే హ్యుందాయ్ అప్‌డేటెడ్ కారు విడుదల.. దీని ధర రూ. 7.48 లక్షలు మాత్రమే!
కార్లలో ఎన్ని రకాల మోడల్స్ వచ్చినా సెడాన్ కార్లకు ఉన్న క్రేజే వేరు. చాలామందికి ఇది ఫేవరెట్ కారుగా ఉంటుంది. ఇప్పుడు ఈ సెడాన్ల స్థానాన్ని ఎస్‌యూవీలు క్రమక్రమంగా ఆక్రమించినప్పటికీ.. వీటిని కొనే వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ సెడాన్లలో లార్జ్ సెడాన్ల కంటే కాంపాక్ట్ సెడాన్ కార్లను డిమాండ్ ఎక్కువగా ఉంది. మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా టాటా టిగోర్ వంటివి.. లార్జ్ సెడాన్ కార్లకు ఉదాహరణలు. ఇందులో హ్యుందాయ్ ఆరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది భారీ బూట్ స్పేస్‌తో ఉండి కంఫర్టబుల్ రైడ్ అందిస్తుంది. ఇప్పుడు ఇందులో కొత్త వేరియంట్ లాంచ్ అయింది. ఈ హ్యుందాయ్ ఆరా కారుకు మారుతి డిజైర్ హోండా అమేజ్ కార్లు పోటీగా ఉన్నాయి.
అయితే వాటిని తలదన్నేలా ఇప్పుడు హ్యుందాయ్ సంస్థ ఇందులో మరో కొత్త వేరియంట్ తో మార్కెట్లోకి వచ్చేసింది. సౌకర్యం, సౌలభ్యం, సురక్షితం కాంబినేషన్‌తో ఉన్న ఈ ఆరా కారుకు ఈ కొత్త వేరియంట్ ద్వారా సేల్స్ మరిన్ని పెరుగుతాయని హ్యుందాయ్ సంస్థ ఆశిస్తోంది. ఈ కాంపాక్ట్ సెడాన్ లైనప్‌లో 'కార్పొరేట్ వేరియంట్'ని హ్యుందాయ్ సంస్థ దీన్ని విడుదల చేసింది. in-cabin ఎక్స్పీరియన్స్‌ను మరింత మెరుగుదల చేసేలా దీన్ని డిజైన్ ఉంటుంది.

ఈ మోడల్ CNG, పెట్రోల్ వెర్షన్లలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూం ధర రూ.7.48 లక్షల నుంచి రూ. 8.47 లక్షల మధ్య ఉంటుంది. వినియోగదారులు ఈ హ్యుందాయ్ ఆరా కార్పొరేట్ వేరియంట్ మోడల్‌ను ప్రీ-బుక్ చేసుకోవాలి అంటే.. దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ షోరూంలోకి వెళ్లాల్సి ఉంటుంది. కొంత టోకెన్ అమౌంట్‌ను చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.
ఈ కార్పొరేట్ వేరియంట్‌లో ఆటోమేటిక్ AC, రియర్ వెంట్స్, ఆర్మ్ రెస్ట్ కప్ హోల్డర్స్, మల్టీ ఫంక్షన్ హాల్ స్టీరింగ్ వీల్, సైడ్ మిర్రర్స్, ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఈ కారులో 6.5 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉంటుంది. ఇది వైర్‌లెస్ కార్ కనెక్ట్ టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇక ఈ వేరియెంట్లోని ఎక్ట్‌టీరియర్ విషయానికి వస్తే.. ఈ కారు బేసిక్ లుక్ కొత్త వేరియంట్‌లోనూ కొనసాగుతోంది.

ఇందులో LED DRLs, 15-అంగుళాల స్టైలిష్ స్టీల్ వీల్స్, బాడీ- కలర్డ్ డోర్ హ్యాండిల్స్, రియర్ స్పాయిలర్ ఉంటాయి. ఈ కొత్త వేరియంట్ S, SX trims లో వస్తుంది. దీంట్లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పెట్రోల్‌తో నడిచినప్పుడు ఈ ఇంజిన్ 82 bhp పవర్, 114nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-speed మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో అనుసంధానించి ఉంటుంది.
దీంట్లోని CNG మోడల్‌తో ఈ పర్ఫామెన్స్ తగ్గుతుంది. కానీ, దీని ద్వారా మంచి మైలేజీ లభిస్తుంది. CNG వేరియంట్‌తో నడిచినప్పుడు ఈ హ్యుందాయ్ ఆరా.. 68 bhp పవర్, 95 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో వస్తుంది. హ్యుందాయ్ నుంచి XT, Grand i10 nios తర్వాత డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో వచ్చిన మూడో కారు ఇదే.

సింగిల్ సిలిండర్ వెర్షన్‌తో ఈ కారు 28 kmpl మైలేజీ అందిస్తుంది. సేఫ్టీ విషయంలోనూ ఈ కారు బాగానే ఉందని చెప్పొచ్చు. ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, 3-పాయింట్ సీట్ బెల్ట్స్ అన్ని సీట్లకు ఉంటాయి. ABS, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ఇమ్మొబిలైజర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, స్పీడ్ అలర్ట్ సిస్టం, రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి.


Click it and Unblock the Notifications








