కనీవిని ఎరుగని రీతిలో ఎస్‌యూవీ సేల్స్... ఒక్క నెలలో ఏకంగా 18,522 మంది కొన్నారు!
భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో దిగ్గజ వాహన తయారీ సంస్థ హ్యూందాయ్.. అందరికీ సుపరిచితమైన బ్రాండ్. తమ వాహనాలతో భారత కస్టమర్లకు ఎంతో చేరువైందీ సంస్థ. ఈ సంస్థ నుంచి వచ్చిన క్రెటా ఎస్‌యూవీ అయితే చాలా మందికి ఫేవరేట్ కారుగా పేరు సంపాదించింది. వినియోగదారులను ఆకట్టుకుంటూ ఈ కంపెనీకి మంచి లాభాల్ని తెచ్చిపెడుతోంది. 2025 జనవరి నెల అమ్మకాల్లో ఈ క్రెటా కారు కొత్త రికార్డులు సృష్టించింది. ఈ ఒక్కనెలలోనే దీన్ని 18,522 మంది కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కార్ల అమ్మకాలు ఇప్పటివరకు ఎలా కొనసాగాయో చూసేద్దాం.
హ్యూందాయ్ సంస్థ 2015లో ఈ క్రెటా కారును లాంఛ్ చేసినప్పటి నుంచి ఈ కారు దేశీయంగాను, అంతర్జాతీయంగాను మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దీంట్లో న్యూ జనరేషన్ మోడల్‌ను కరోనా కొనసాగుతున్న 2020లో లాంఛ్ చేశారు. అయినప్పటికీ ఇది వినియోగదారులను బాగానే ఆకర్షించింది. వివిధ ప్రత్యర్థి సంస్థల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ.. క్రెటా కారుతో హ్యూందాయ్ సంస్థ తన సత్తా చాటుతోంది.

జనవరి నెలలో ఏకంగా 18,522 యూనిట్ల అమ్మకాలు జరగడం కొత్త రికార్డుగా చెప్పవచ్చు. ఎందుకంటే భారత్‌లో ఇది లాంఛ్ అయినప్పటి నుంచి ఈ స్థాయి అమ్మకాలు ఇంతవరకు జరగలేదు. జనవరి నెలలో ఎక్కువ సేల్స్ జరిగిన ఎస్‌యూవీగా క్రెటా కారు పేరు సంపాదించింది.
ఈ లెక్కల ప్రకారం.. భారత్ వ్యాప్తంగా గత నెలలో గంటకు సగటున 88 క్రెటా కార్లను విక్రయించినట్లు తెలుస్తోంది. ఇక 2024 జనవరి నెల అమ్మకాలను పరిశీలిస్తే ఇది 1,000 యూనిట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ గణనీయమైన మార్పు.. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీపై పెరుగుతున్న డిమాండ్‌ను చూపిస్తోంది.

ఈ హ్యూందాయ్ క్రెటా కారు.. 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ మ్యాన్యువల్లీ- యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.5- లీటర్ డీజిల్ ఇంజిన్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఆప్షన్లు వినియోగదారులు విభిన్న ప్రాధాన్యతలను అందిస్తాయి. అలాగే 2025 ఆటో ఎక్స్‌పోలో ఈ క్రెటాకు సంబంధించి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా ఆవిష్కరించి అందరి చూపు తనవైపునకు తిప్పుకుందీ హ్యూందాయ్ సంస్థ.
2020 నుంచి ఈ క్రెటా మోడల్‌లో అప్డేట్లను ప్రవేశపెడుతుండడంతో వినియోగదారులను ఇది బాగా ఆకర్షిస్తోంది. అందుకే కొద్ది సంవత్సరాలుగా దీని విక్రయాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ 2025 సంవత్సరంలోనూ ఈ క్రెటా సేల్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. "జనవరి నెలలో 18,522 యూనిట్లను విక్రయించిన నేపథ్యంలో.. ఒకే నెలలో 20,000 యూనిట్ల కార్లు అమ్మగలమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేద"ని హ్యూందాయ్ సంస్థ అంటోంది.

ఈ వ్యాఖ్యలు ఈ పాపులర్ మోడల్ అమ్మకాల విషయంలో హ్యూందాయ్ సంస్థ ఆశాభావాన్ని చాటుతున్నాయి. దేశంలో పర్యావరణ అనుకూల వాహనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ క్రెటా మోడల్‌లో ఎలక్ట్రిక్ వేరియంట్ ను ప్రవేశపెట్టడం వల్ల హ్యూందాయ్ సంస్థకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ట్రెండ్‌కు తగ్గట్టుగా తమ వాహనాల సేల్స్ పెంచుకుంటూ ప్రత్యర్థి సంస్థలకు పోటీనిచ్చేలా ఈ సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








