భారతీయుల ఫేవరెట్ మోడల్..12 నెలల్లో 1.94 లక్షల మంది ఇంటికి తీసుకెళ్లారు.. దీనిలో అంత స్పెషల్ ఏముంది?

భారత ఆటోమొబైల్ రంగం ఎంతో వేగంగా వృద్ది చెందుతుంది. తయారీదారులు పోటా పోటీగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూనే ఉన్నారు. కస్టమర్ల నుంచి అన్ని సెగ్మెంట్ కార్లకు డిమాండ్ బలంగా ఉంది. ముఖ్యంగా భారత కార్ల మార్కెట్లో స్పోర్ట్ యుటిలిటీ వాహనాల (Suv)ను జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. భారత కార్ల మార్కెట్లో వీటి వాటా 55 శాతంగా ఉంది. ఒకప్పుడు విలాసవంతమైన, ఖరీదైన వాహనాలుగా గుర్తింపొందిన SUVలు, ఇప్పుడు దేశంలోని సాధారణ వాడుకదారులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. అందుబాటు ధరలో, ఆకట్టుకునే డిజైన్ వంటి అంశాలతో వీటి అమ్మకాలు భారీగానే నమోదవుతున్నాయి. 2024-2025 ఆర్థిక సంవత్సరం గణాంకాలను పరిశీలిస్తే, ఎస్‌యూవీలకు బలమైన డిమాండ్ ఉందని అర్ధం అవుతుంది.

తాజాగా ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ హ్యూందాయ్ (Hyundai) విడుదల చేసిన సేల్స్ నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరానికి అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల జాబితాలో క్రెటా మోడల్ కాంపాక్ట్ SUV విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. క్రెటా భారతీయుల గుండెల్లో ఒక విశేష స్థానం సంపాదించుకుంది. హ్యుందాయ్ క్రెటా మరోసారి భారతీయ కాంపాక్ట్ SUV విభాగాన్ని శాసించింది. దీనికి నిదర్శన గత ఆర్ధిక సంవత్సరంలో సాధించిన అమ్మకాలే.

Hyundai Creta Compact Suv 1 94 Lakh Sales

కాంపాక్ట్ SUV విభాగంలో నంబర్ వన్ మోడల్ అయిన హ్యుందాయ్ క్రెటా ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 మధ్య కాలంలో ఏకంగా 1,94,871 యూనిట్లను విక్రయించి, టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్, టాటా పంచ్ తర్వాత నిలిచి టాప్ బ్రాండ్స్ మధ్య కూడా క్రెటా తన ప్రత్యేకతను నిలబెట్టుకుని మూడవ స్థానంలో నిలవడం గొప్ప విషయం.

అలాగే, మారుతీ సుజుకీ బాలెనో, స్విఫ్ట్, ఎర్టిగా, బ్రెజ్జా వంటి పాపులర్ మోడల్స్ కూడా దీని వెనకే ఉండటం గమనార్హం. ఇది క్రెటా బలాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా ప్రీమియం SUV మార్కెట్లో, గ్రాండ్ విటారా వంటి ప్రత్యక్ష పోటీదారుల మధ్య కూడా క్రెటా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గ్రాండ్ విటారా 1,23,946 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది, ఇది క్రెటా మేలు మార్కెట్ ఫాలోయింగ్‌ను రుజువు చేస్తోంది.

Hyundai Creta Fy2025 Sales

దీనికి పోటీగా ఉన్న కియా సెల్టోస్, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, హోండా ఎలివేట్, సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ వంటి మోడల్స్ కూడా తమదైన మార్క్‌ను చూపించడానికి పోటీలో ఉన్నప్పటికి హ్యుందాయ్ క్రెటా మాత్రం స్థిరంగా తన సింహాసనాన్ని నిలబెట్టుకుంది. క్రెటా కారు ఇన్ని సేల్స్ సాధించడానికి ప్రధాన కారణం దాని శక్తివంతమైన ఇంజిన్, లేటెస్ట్ ఫీచర్స్, బలమైన బాడీ డిజైన్ వంటి అంశాలు దోహదపడ్డాయి.

క్రెటా కారు 2015లో విడుదలైనప్పటి మార్కెట్ లీడర్‌గా కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు తన రూపాన్ని, ఫీచర్లను అప్‌డేట్ చేసుకుంటూ, వినియోగదారుల మనసులు గెలుచుకుంటోంది. తాజాగా, ఈ SUV 10 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించడం గమనార్హం. ఇది భారతీయ మార్కెట్లో క్రెటా సృష్టించిన ప్రభావానికి నిదర్శనం. ఈ కారు E, EX, S, S(O), SX, SX Tech, SX(O) అనే ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Hyundai Creta Compact Suv

ఇది వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మూడు శక్తివంతమైన ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్. ఇది 6-స్పీడ్ మాన్యువల్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (IVT), 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT), 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ అనే 4 గేర్‌బాక్స్ కాంబినేషన్‌లలో లభిస్తుంది. ఫీచర్స్ కూడా డజన్ల కొద్ది ఉన్నాయి.

దీని డిజైన్ విషయానికి వస్తే, SUV ముందు భాగంలో ఉన్న ప్రధాన ఆకర్షణలుగా గ్రిల్, LED హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. సైడ్ నుంచి పెద్ద అల్లాయ్ వీల్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. వెనుక భాగంలో కనెక్ట్ చేయబడిన టెయిల్ లాంప్స్ కూడా క్రెటాను స్టైలిష్‌గా చూపిస్తాయి. క్యాబిన్‌లో చూసినట్లయితే టెక్నాలజీ, కంఫర్ట్, సేఫ్టీ అన్నింటిని కలిగి ఉంది. స్మార్ట్ కనెక్టవిటీ ఫీచర్స్ ప్రయాణిలకు కంఫర్‌ సౌకర్యాన్ని అందించే విధంగా ఉంటాయి.

Hyundai Creta Design And Price

ప్రధానంగా, ఇందులో భారీ డ్యూయల్ టచ్‌స్క్రీన్‌లు ఉండటంతో పాటు, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌, మ్యూజిన్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, లోపల లెదర్ అప్హోల్స్టరీ, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు ఉండడం ఈ కారును క్లాస్‌లో బెస్ట్‌గా నిలబెడతాయి. ప్రయాణికుల సేఫ్టీ పరంగా కూడా కారు అధునాతన ప్రమాణాలను కలిగి ఉంది.

హ్యుందాయ్ క్రెటాలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ వ్యూ మానిటర్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అంశాలు ప్రయాణాన్ని మరింత సేఫ్టీగా మార్చడంలో సహయపడుతాయి. ధర విషయానికొస్తే, ఈ కారు ప్రారంభ బేస్ వేరియంట్ వచ్చేసి రూ.11.11 లక్షల నుంచి ఉంటుంది.

టాప్ వేరియంట్ రూ.20.50 లక్షల వరకు అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఆన్‌‌రోడ్ అయితే దేశంలోని నగరాలను బట్టి మారుతుంది. ఈ ఏడాది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో హ్యుందాయ్ 'క్రెటా ఎలక్ట్రిక్'ను కూడా విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ రూ.17.99 లక్షల నుంచి రూ.23.49 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరలో లభిస్తుంది. 42kWh బ్యాటరీతో 390 కి.మీలు, 51.4kWh ప్యాక్‌తో 473 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, April 4, 2025, 17:35 [IST]
English summary
Hyundai creta compact suv 1 94 lakh sales recorded in fy2025 more details
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+