Hyundai Creta Ev: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కారు రానే వచ్చింది.. ఆటో ఎక్స్‌పోలో లాంచ్ అయిన క్రెటా ఈవీ
దిగ్గజ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) ఇండియా తాజాగా ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ క్రెటా ఈవీ (Creta Ev). దీన్ని కంపెనీ ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో ప్రదర్శించింది. హ్యందాయ్ ice క్రెటా మోడల్‌కు ఇండియాలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కంపెనీ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేసి ఈవీ సెగ్మెంట్‌లో తన వాటాను మరింత పెంచుకోనుంది. ప్రస్తుతం కొత్తగా కారు కొనుగోలు చేసే వినియోగదారులు, ఈవీ కార్లపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ను గమనించిన చాలా వాహన తయారీ దారులు ఈ సెగ్మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తమ పాత మోడళ్ల కార్లను కొత్తగా ఈవీ వేరియంట్‌లుగా మారుస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నారు.
ఇప్పుడు హ్యుందాయ్ కంపెనీ కూడా ఇదే బాటలో పయనిస్తూ, క్రెటా ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. భారత మండపంలో అత్యంత ఘనంగా జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో కంపెనీ ఉన్నతాధికారులు ఈ కారును లాంచ్ చేశారు. దీని ధర రూ.17.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది ప్రారంభ ధర మాత్రమే. వేరియంట్‌ను బట్టి ధర పెరుగుతుంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది.

మొదట 42KWh బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, స్మార్ట్(O), ప్రీమియం అనే నాలుగు వేరియంట్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. 51.4kWh రెండో బ్యాటరీ ప్యాక్‌తో ప్యాక్ Smart(O), Excellence అనే వేరియంట్లలో లభిస్తుంది. టాప్ వేరియంట్ ధర వచ్చేసి రూ.రూ.23.49 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వరకు ఉంటుంది. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ అట్రాక్టివ్‌గా ఉంటుంది. బయటి డిజైన్ క్రెటా ice వేరియంట్ మాదిరిగా కనిపిస్తుంది.
42KWh బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు సింగిల్ ఛార్జ్‌తో 390 కిమీల దూరం వరకు ప్రయాణిస్తుంది. అదే పెద్దది MIDC సైకిల్‌లో 473 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుందని హ్యుందాయ్ పేర్కొంది. బయటి డిజైన్ మాత్రమే కాకుండా లోపల కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. క్యాబిన్‌లో డ్యూయల్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్‌లు,ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ , వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వంటివి ఉన్నాయి.
కారులో ఎంటర్‌టైన్మెంట్ కోసం 8-స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ , USB A, C పోర్ట్‌లు, 12V ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు మూడు మ్యాట్ కలర్స్‌తో పాటు 10 కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంటీరియర్‌లో కొన్ని సదుపాయాలు దాని పాత మెడల్ వలె ఉంటాయి.
కారులో ప్రయాణికుల భద్రత కోసం కంపెనీ పలు సేఫ్టీ ఫీచర్లను అందించింది. లెవల్ 2 ADAS,ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC),టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS),చైల్డ్ సీట్ యాంకర్ (ISOFIX), హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. చిన్న బ్యాటరీ 133bhp పవర్‌ను, పెద్ద బ్యాటరీ 169bh పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం మా డ్రైవ్‌స్పార్క్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








