6 నెలల్లో 4,000 మంది ఈ కారును కొన్నారు! ఒక్క ఛార్జ్‌తో ఏకంగా 473 కి.మీల వరకు దూసుకెళ్లచ్చు!

దక్షిణ కొరియా బ్రాండ్ హ్యుందాయ్ (Hyundai)కి చెందిన క్రెటా ఎలక్ట్రిక్ (Creta Electric) వెర్షన్ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుంచి అందరి అభిమానాలను పొందుతుంది. జనవరి 17న మార్కెట్‌లో అడుగుపెట్టిన ఈ ఎలక్ట్రిక్ SUV పట్ల వినియోగదారుల్లో ఉన్న అంచనాలను కొంతవరకూ నెరవేర్చినట్టే కన్పిస్తోంది. తన మొదటి ఆరు నెలల కాలంలో క్రెటా ఈవీ 4000 యూనిట్ల అమ్మకాలతో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. హ్యుందాయ్ బ్రాండ్‌కు భారత మార్కెట్లో ఉన్న స్థానం, క్రెటా పేరుతో వచ్చిన విశ్వాసం కారణంగా ఈ ఎలక్ట్రిక్ కారుపై మొదటినుండే పెద్ద హైప్ క్రియేట్ అయింది. అయితే ఇతర మోడళ్లతో పోల్చినట్లయితే విడుదలైన ఆరు నెలల్లో కేవలం 4000 యూనిట్ల విక్రయమే జరగడం కొంత నిరాశకు గురిచేసే అంశం.

ఎందుకంటే ప్రధాన పోటీదారులైన టాటా నెక్సాన్ EV, MG కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVలు నెలవారీగా 3,000-4,000 యూనిట్లను అమ్ముతున్నాయి. ఈ గణాంకాలు చూస్తే, క్రెటా EV విక్రయాల నిష్పత్తి హ్యుందాయ్ వంటి పెద్ద కంపెనీకి తగినంతగా లేదనే అభిప్రాయం వస్తుంది. కానీ ఇక్కడ మరొక అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి, ఇది కంపెనీ మొదటి మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUV ప్రయత్నం, ఇంకా మార్కెట్లో తన స్థానాన్ని ఏర్పరచుకునే దశలో ఉంది.

Hyundai Creta Electric Suv Sales Crossed 4000 Units In India

ఫ్యూచర్‌లో దీనికి డిమాండ్ మరింత పెరిగి అమ్మకాలు ఇతర ప్రధాన ప్రత్యర్థులను సైతం దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా EV పట్ల ప్రారంభం నుంచే వినియోగదారుల్లో ఆసక్తి ఉండగా, చివరికి అమ్మకాల పరంగా అది ఆశించిన స్థాయికి చేరలేకపోయింది. దీని వెనుక ప్రధాన కారణాల్లో ఒకటి ధర. ఈ ఎలక్ట్రిక్ SUVకి హ్యుందాయ్ సంస్థ నిర్ణయించిన ధర రూ.17.99 లక్షల నుండి రూ.24.37 లక్షల మధ్యగా ఉంది.

ఇది స్పష్టంగా మధ్యతరగతి వినియోగదారులకు కొంచెం అధికంగానే భావించవచ్చు. వీటిని దాని ప్రత్యర్థులతో పోల్చితే తేడా మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, MG విండ్సర్ EV రూ. 9.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉండగా, టాటా నెక్సాన్ EV కూడా రూ. 12.5 లక్షల వద్ద ప్రారంభమవుతోంది. ఈ రెండు మోడళ్లు వినియోగదారులకు ధర పరంగా దగ్గరగా ఉంటూ, అత్యధిక అమ్మకాలను నమోదు చేస్తున్నాయి.

Creta Electric Suv Sales Crossed 4000 Units

ఇంత తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందిస్తున్నప్పుడు, హ్యుందాయ్ క్రెటా EV లాంటి ప్రీమియం SUV కొంచెం క్లాస్-అధికమైన మార్కెట్‌కి మాత్రమే పరిమితమవుతుంది. దీని ఫలితంగా, ఇది పెద్ద మాస్ మార్కెట్‌ను ఆకర్షించలేకపోయింది. నిజానికి, ఈ ధర వద్ద వినియోగదారులు మరింత స్థాయిలో ఫీచర్లు, విభిన్న బ్రాండ్ ఆప్షన్లు వెతుకుతారు, లేదా కొంతమంది ఎలక్ట్రిక్ కార్లకంటే హై ఎండ్ ICE వాహనాల వైపే మొగ్గు చూపవచ్చు.

దీంతో, హ్యుందాయ్ క్రెటా EV మార్కెట్‌లోకి ప్రవేశించినప్పుడు ప్రజల్లో భారీ అంచనాలు ఉండినా, వాటిని అమ్మకాలుగా మార్చుకోవడంలో అధిక ధర ఒక పెద్ద అవరోధంగా నిలిచింది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే ఇది 42 kWh, 51.4 kWh బ్యాటరీ ఆప్షన్లతో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయబడినప్పుడు వరుసగా సుమారు 390 కి.మీ నుండి గరిష్టంగా 473 కి.మీ వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదు.

Hyundai Creta Electric Suv

కేవలం బేసిక్ రేంజ్‌నే కాదు, ఫీచర్ల పరంగానూ ఈ కారు అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో ఉన్న స్మార్ట్ పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి సౌకర్యాలు దీన్ని ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఇతర కార్లతో పోలిస్తే ముందు వరుసలో ఉంచుతాయి. అంతేకాక, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8 ప్రీమియం సౌండ్ స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్ వంటివి కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, June 9, 2025, 17:20 [IST]
English summary
Hyundai creta electric suv sales crossed 4000 units in india since its launch
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+