మహీంద్రా బీఈ 6 Vs హ్యూందాయ్ క్రెటా ఈవీ.. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్?
దిగ్గజ ఆటో మొబైల్ సంస్థలైన హ్యూందాయ్, మహీంద్రా.. భారతీయ వినియోగదారులకు సుపరిచితమే! ఈ రెండు సంస్థల నుంచి వచ్చిన కార్లలో చాలా మోడల్స్.. వినియోగదారులకు ఫేవరేట్ కార్లుగా పేరు సంపాదించాయి. ఇప్పుడు దేశంలో ఈవీల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ సంస్థలు ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి అడుగు పెట్టాయి. హ్యూందాయ్ సంస్థ తమ బెస్ట్- సెల్లింగ్ ఎస్‌యూవీ అయిన క్రెటాను ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన క్రెటా ఈవీని తీసుకువచ్చింది. మహీంద్రా సంస్థ నుంచి అట్రాక్టివ్ లుక్స్‌లో బీఈ 6 పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేసింది. ఈ రెండు కార్లు ఒకదానికికొకటి గట్టి పోటీనిచ్చేలా ఉన్నారు. మరి ఈ ఈవీల మధ్య ఉండే పోలికలేంటి? వీటి బ్యాటరీ, రేంజ్, పర్ఫార్మెన్, ధర ఎలా ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్యాటరీ & రేంజ్: హ్యూందాయ్ సంస్థ క్రెటా ఎలక్ట్రిక్ కారును రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో తీసుకువచ్చింది. ఒకటి 42kWh, మరొకటి 51.4kWh. దీంట్లో 42kWh బ్యాటరీ 390 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. మరోవైపు, 51.4kWh బ్యాటరీ 473 కి.మీ.ల రేంజ్ అందించగలదు. రేంజ్ బ్యాటరీ విషయాలలో ఈ రెండు కార్లు తోపుగా ఉన్నాయి.

ఇక మహీంద్రా విషయానికి వస్తే ఈ బీఈ6 ఎలక్ట్రిక్ కారు కూడా రెండు బ్యాటరీ ఆప్షన్లతో ఉంటుంది. అవి 59kWh, 79kWh. పెద్ద బ్యాటరీలతో ఈ కారు ఉండడం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. దీంట్లో 59kWh బ్యాటరీ 556 కి.మీ.ల రేంజ్ అందించగా... 79kWh బ్యాటరీ అయితే ఏకంగా 682 కి.మీ.ల రేంజ్ అందించగలదు.
పర్ఫామెన్స్: క్రెటా ఈవీ 42kWh బ్యాటరీతో 133 bhp, 51kWh బ్యాటరీతో 169 bhp పవర్ ఉత్పత్తి చేయగలదని హ్యూందాయ్ సంస్థ చెబుతోంది. క్రెటా ఎన్-లైన్ మోడల్ కంటే ఈ ఈవీలో ఉత్తత్తయ్యే 169 bhp అధికం కావడం గమనార్హం. ఈ క్రెటా ఈవీ.. సున్నా నుంచి 100 కి.మీ.ల వేగాన్ని కేవలం 7.9 సెకన్లలో అందుకుంటుంది.

మహీంద్రా బీఈ6 ఎలక్ట్రిక్ కారు.. రియర్- వీల్ డ్రైవ్ కారు. అంటే.. దీంట్లోని ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా అందే పవర్.. రియర్ వీల్స్‌కు పంపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 59kWh బ్యాటరీతో 228 bhp, 79kWh బ్యాటరీతో 277 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది.
ధర: హ్యూందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షో రూమ్ ధర రూ. 18 లక్షల నుంచి మొదలవుతుంది. దీంట్లోని 51.4kWh బ్యాటరీ కారు ధర రూ.23.49 లక్షలుగా ఉంది. మహీంద్రా బీఈ6 కారు ధర రూ.18.90 లక్షల నుంచి రూ.26.90 లక్షల మధ్య ఉంది.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: హ్యూందాయ్ క్రెటా ఈవీ కంటే మహీంద్రా బీఈ6 కారు పెద్దగా, మరింత శక్తిమంతమైన బ్యాటరీ ఆప్షన్లతో ఉంది. అయితే.. ఈ రెండు కార్ల ధరల్లో పెద్దగా వ్యత్యాసం కనపడడం లేదు. అంతేగాకుండా.. ఈ రెండు కార్ల మధ్య నెలకొన్న పోటీలో తన అట్రాక్టివ్ అప్పీయరెన్స్‌తో మహీంద్రా ఈవీ నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








