క్రెటాలో మరో కొత్త వెర్షన్‌తో ‘వారెవా’ అనిపించిన హ్యాందాయ్.. ఎకో ఫ్రెండ్లీ జర్నీ ఈ కారుతో సొంతం!
హ్యూందాయ్ క్రెటా.. లాంఛ్ అయిన అనతి కాలంలోనే వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఎస్‌యూవీ. ఈ కారు సేల్స్ పెంచుకుంటూ హ్యుందాయ్ సంస్థకు మంచి లాభాల్ని కూడా తెచ్చిపెట్టింది. ఈ ఎస్‌యూవీ.. డీజిల్, పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో ఇప్పటివరకు మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే.. ఈ సంస్థ ఇప్పుడు న్యూదిల్లీ వేదికగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ క్రెటాను లాంఛ్ చేసింది. దాంతోపాటుగా ఈ ఈవెంట్‌లోనే క్రెటా మరో కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. హ్యూందాయ్ క్రెటా ఫ్లెక్ల్ ఫ్యూయల్ మోడల్‌ను తీసుకువచ్చింది. ఈ కొత్త కారు మోడల్‌లో ఉండే విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ హ్యూందాయ్ క్రెటా మోడల్ కారు... 1.0 టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఇది 100 శాతం ఇథనాల్‌తో నడుస్తుంది. ఈ వేరియంట్ ఇప్పటివరకు దక్షిణ అమెరికా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇథనాల్- పవర్ వాహనాలకు డిమాండ్ అక్కడ అధికంగా ఉంటుంది. అయితే.. ఈ క్రెటా ఇథనాల్ మోడల్‌ను భారత్‌లో లాంఛ్ చేసే దిశగా హ్యూందాయ్ సంస్థ అడుగులు వేస్తోంది.

రానున్న రోజుల్లో దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఈ కారులో మరిన్ని అప్గ్రేడ్స్ కూడా ఉన్నాయి. దీంట్లోని GDI ఇంజిన్... 120 bhp పవర్, 172 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దాంతోపాటుగా ఈ ఇంజిన్‌ను పెట్రోల్ బ్లెండ్ ఏమాత్రం లేకుండా E100 ethanol తో నడిచే విధంగా దీన్ని హ్యుందాయ్ సంస్థ రూపొందించింది.
ఈ ఇంజిన్ 6- స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో ఉంటుంది. ఇథనాల్ టెక్నాలజీతో నడిచే వాహనాలను భారత్‌లో లాంఛ్ చేయడంలో ముందు వరుసలో ఉండాలని హ్యూందాయ్ సంస్థ భావిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వాహనాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో.. ఈ క్రెటా కొత్త మోడల్‌ను తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది హ్యుందాయ్. అయితే దీని లాంఛ్ గురించి ఎలాంటి వివరాలను క్రెటా సంస్థ వెల్లడించలేదు.

మరోవైపు.. ఇదే ఆటో ఎక్స్‌పోలో హ్యూందాయ్ సంస్థ తమ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ కారు ధరను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ వేరియంట్ Executive, Smart, Smart (O), Premium అనే వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.17.99 లక్షల నుంచి రూ.23.49 లక్షల మధ్య(ఎక్స్- షోరూమ్) ఉండనుంది.
వేరియంట్లవారీగా ఈ ఈవీ ధరలను పరిశీలిస్తే ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర రూ.17.99 లక్షలుగా ఉంది. ఇక స్మార్ట్ వేరియంట్ ధర రూ.18.99 లక్షలుగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.19.99 లక్షలుగా ఉండనుంది. దీంట్లో స్మార్ట్(ఓ) వేరియంట్.. 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ.21,49,900 గా ఉండనుంది. దీంట్లో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.23,49,900 గా ఉండనుంది.

ఈ ఈవీ 42 kW, 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంది. దీంట్లో చిన్న బ్యాటరీతో వచ్చే కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 390 km రేంజ్ అందిస్తుంది. అదేసమయంలో పెద్ద బ్యాటరీ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 473 కి.మీ.ల దూరం ప్రయాణిస్తుంది. ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌లు కూడా ఫ్రంట్ యాక్సిల్‌పై సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో నడుస్తాయి.
ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం మా డ్రైవ్‌స్పార్క్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








