ఇది క్రెటా కారు అంటే కంపెనీ వాడు కూడా నమ్మడేమో.. అలా మార్చేశారేంట్రా బాబు

ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో హ్యుందాయ్ కంపెనీ వాహనాలు తప్పనిసరిగా ఉంటాయి. దక్షిణ కొరియాకు చెందిన ఈ కార్ల తయారీ సంస్థకు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. మధ్య తరగతి ప్రజల నుంచి రిచ్ పీపుల్ వరకు అన్ని వర్గాలకు అవసరం అయిన కార్లను ఈ కంపెనీ రిలీజ్ చేస్తుంది.

ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్ సైజ్ ఎస్ యూవీలలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. దీన్ని 2015లో మొదటి సారిగా రిలీజ్ చేశారు. అప్పటి నుంచి సుమారు 1.2మిలియన్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది హ్యుందాయ్ రెండో తరం మోడల్ ఫేస్ లిఫ్టెడ్ వెర్షన్ రిలీజ్ చేసింది. ఇది భారతీయ మార్కెట్లో పాపులర్ suvగా ఉంది. ఈ కారుకు దేశంలో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.

Hyundai Creta Modifications

వాస్తవానికి.. క్రెటా ఇండియాలో దక్షిణ కొరియా కంపెనీ హ్యుందాయ్‌కు మంచి పునాది వేసిన కార్లలో ఒకటి. అందుకే హ్యుందాయ్ క్రెటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంది. చివరిగా అప్ డేట్ చేసిన క్రెటా కారు 2024లో ప్రారంభించింది. ఆ తర్వాత కొత్త క్రెటా ఎలక్ట్రిక్ కారు 2025 ప్రారంభంలో లాంచ్ చేశారు.

Take a Poll

కొత్త క్రెటా కార్లను నిరంతరం పరిచయం చేస్తున్నప్పటికీ తమ క్రెటా కార్లను తమకు నచ్చిన విధంగా మోడిఫై చేసుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. క్రెటా కారును పూర్తిగా బ్లాక్ కలర్లోకి మార్చి క్రెటా కారేనా అనేంతలా మార్పులు చేశారు. ఇది రోడ్డు మీద వెళ్తుంటే బ్లాక్ పాంథర్ లా కనిపిస్తుందని నెటిజన్స్ అంటున్నారు.

Hyundai Creta

కారు పెయింట్ కాకుండా ఈ క్రెటాకు అనేక ఇతర మార్పులు చేశారు. దీని కోసం ఈ క్రెటా కారు చుట్టూ బాడీ ప్యానెల్స్ కొత్తగా మార్చారు. అందుకే ఈ క్రెటా కారు చాలా స్టైలిష్ గా, తళుక్కు మనేలా కనిపిస్తుంది. ఈ మోడిఫైడ్ క్రెటా గురించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియోలో కారు వెనుక భాగంలో పెద్ద డిఫ్యూజర్‌ను ఏర్పాటు చేయడాన్ని మనం చూడవచ్చు.

అదేవిధంగా కారు వెనుక భాగంలో ఉన్న బంపర్ కూడా రీ డిజైన్ చేశారు. వెనుక బంపర్ కింద క్వాడ్ ఎగ్జాస్ట్ పైప్స్ పై అమర్చారు. వీటితో పాటు కారు వెనుక భాగంలో రెండు ఎయిర్ డ్యామ్‌లు.. రెయిన్ ఎఫెక్ట్ LED లైటింగ్ కూడా ఉన్నాయి. వీటితో పాటు వెనుక డిఫ్యూజర్ ప్లేస్ మధ్యలో నీలిరంగు టో హుక్, వెనుక బంపర్ దిగువన కానార్డ్‌లు, వెనుక బంపర్ దిగువన LED టెయిల్‌లైట్స్ కూడా ఉన్నాయి.

Hyundai Creta Car

అదేవిధంగా, క్రెటా హ్యుందాయ్ ఈ కొత్త టెయిల్ లైట్లు మాట్రిక్స్-స్టైల్, జర్మన్ లగ్జరీ కార్ల మాదిరిగానే ఉన్నాయి. ఈ మోడిఫైడ్ క్రెటా వెనుక డెక్‌లిడ్‌పై లిప్ స్పాయిలర్, బ్యాక్ లో పెద్ద స్పాయిలర్‌ను అమర్చారు.

ఈ క్రెటా కారు సైడ్ కు వెళితే ఈ హ్యుందాయ్ క్రెటా కారులో వైడ్ బాడీ కిట్ ఉంది. వెనుక, ముందు ఫెండర్స్ మోల్డ్ చేశారు. ఎక్స్ ట్రా సైడ్ స్కర్టులు ఉన్నాయి. ఈ కారు వైపు మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే అల్లాయ్ వీల్స్. 20-ఇంచుల పరిమాణంలో చాలా పెద్దగా ఉండే ఈ అల్లాయ్ వీల్స్ తక్కువ ప్రొఫైల్ టైర్లను కలిగి ఉంటాయి.

కారు బాడీకి అనుగుణంగా అల్లాయ్ వీల్స్ కూడా పూర్తిగా బ్లాక్ పెయింట్ చేశారు. అదనంగా, ఈ క్రెటా వెనుక వైపున ఉన్న ఎక్సటర్నల్ మిర్రర్ క్యాప్ కూడా బ్లాక్‎గా ఉంటాయి. ఈ మోడిఫైడ్ క్రెటాకు స్పోర్టియర్ లుక్ ఇవ్వడంలో బ్లాక్ ఎక్సటర్నల్ మిర్రర్స్ కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ క్రెటా కారు పెద్ద స్కూప్‌తో కూడిన స్పెషల్ బ్యానెట్ ఉంటుంది. సాధారణంగా.. ఈ రకమైన స్కూప్ స్పోర్ట్స్ కార్లలో కారు ఏరోడైనమిక్స్ కోసం అందిస్తారు. అయితే, క్రెటా వంటి కారులో ఇటువంటి స్కూప్ ఫీచర్ అందించారు. ఇది ఈ కారులో పనిచేస్తుందా లేదా కేవలం ప్రదర్శన కోసం ఉంచిందా అనేది మాత్రం తెలియదు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 19, 2025, 11:20 [IST]
English summary
Hyundai creta gets a black panther transformation with stunning modifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+