ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన హ్యుందాయ్.. 10 ఏళ్ల క్రెటా సంబరంలో కింగ్ ఎడిషన్
హ్యుందాయ్ (Hyundai) ఎప్పటి నుంచో భారతీయుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కార్ల బ్రాండ్. ముఖ్యంగా SUV విభాగంలో తన క్రెటా మోడల్‌తో ఒక చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఆ విజయాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో, క్రెటా 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హ్యూందాయ్ కొత్త ప్రత్యేక ఎడిషన్ మోడళ్లను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక సిరీస్‌లో క్రెటా కింగ్ (CRETA king), కింగ్ లిమిటెడ్ ఎడిషన్ (CRETA King Limited Edition), కింగ్ నైట్ ఎడిషన్ (CRETA King Knight) మోడళ్లను ప్రవేశపెట్టింది. వీటితో పాటు ఇప్పటికే ఉన్న వేరియంట్‌లకు మరింత విలువ చేకూరేలా కొత్త ఫీచర్ అప్‌గ్రేడ్‌లు కూడా చేసింది.
ధర విషయానికి వస్తే, కొత్త ఎడిషన్‌లు రూ. 17.88 లక్షల(ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. కొత్త వెర్షన్లు క్రెటా శ్రేణిలో అగ్రస్థానంలో నిలుస్తూ ప్రీమియం SUV అనుభూతిని అందించనున్నాయి. ఈ ఎడిషన్ మోడళ్లతో పాటు, హ్యూందాయ్ క్రెటా N లైన్ వేరియంట్‌లో కూడా కొత్త అప్‌డేట్‌లు చేసింది. డిజైన్ అప్‌గ్రేడ్‌లు, టెక్నాలజీ ఆధారిత ఫీచర్లు, భద్రతా పరమైన అప్‌డేట్స్ కలిపి క్రెటాను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

హ్యుందాయ్ క్రెటా కింగ్ ఎడిషన్ కేవలం పేరుకే కాదు, ఫీచర్ల పరంగా కూడా ఒక ప్రత్యేకమైన అప్‌గ్రేడ్‌గా నిలుస్తోంది. ఇది వినియోగదారుల విభిన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో 1.5L MPi పెట్రోల్ (మాన్యువల్/IVT), 1.5L U2 CRDi డీజిల్(మాన్యువల్/AT), అలాగే మరింత శక్తివంతమైన 1.5L టర్బో GDi పెట్రోల్ (DCT) వెర్షన్‌లలో లభిస్తుంది. డ్రైవింగ్ స్టైల్ ఏదైనా కావచ్చు, క్రెటా కింగ్ అందరికీ సరిపోయేలా తీర్చిదిద్దబడింది.
డిజైన్ విషయానికి వస్తే, R18 డైమండ్-కట్ అలాయ్ వీల్స్ ఆకర్షణను జోడిస్తాయి. ఇంటీరియర్‌లో డ్రైవర్ సీటుకు పవర్ సీట్ మెమరీ ఫంక్షన్ ఉండటమే కాకుండా, ప్యాసింజర్ సీటును వాక్-ఇన్ పరికరం ద్వారా 8-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్ సౌకర్యం కలిగించారు. అదనంగా, అవసరాలను దృష్టిలో పెట్టుకుని డాష్‌క్యామ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే సపోర్ట్, టచ్ ప్యానెల్ ఆధారంగా పనిచేసే డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.

ప్రయాణికుల సౌకర్యం కోసం సీట్‌బ్యాక్ టేబుల్స్‌లో IT డివైస్ హోల్డర్, రిట్రాక్టబుల్ కప్ హోల్డర్‌లను అందించారు. అలాగే స్టోరేజ్‌తో కూడిన స్లైడింగ్ ఫ్రంట్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్ కూడా ఉంది. ఈ చిన్నచిన్న వివరాలే క్రెటా కింగ్‌ను ఒక ప్రత్యేక SUVగా నిలబెడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా, ఈ వెర్షన్‌కు ప్రత్యేకంగా ఇచ్చిన కింగ్ లోగో దానికి ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇస్తుంది. దీని వల్ల రోడ్డుపై నడిపేటప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తుంది.
క్రెటా కింగ్ లిమిటెడ్ ఎడిషన్ కేవలం 1.5L MPi పెట్రోల్ IVT, 1.5L U2 CRDi డీజిల్ AT ఇంజిన్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. ఈ ఎడిషన్‌లో సాధారణ మోడళ్లకు లేని కొన్ని ప్రత్యేక ఫీచర్లను జోడించారు. సీట్ బెల్ట్ కవర్లు, హెడ్‌రెస్ట్ కుషన్లు, కార్పెట్ మ్యాట్‌లు, కీ కవర్, అదనంగా, డోర్ క్లాడింగ్‌లపై ప్రత్యేకమైన కింగ్ బ్రాండింగ్ ఇవ్వడం ద్వారా, ఇది లిమిటెడ్ ఎడిషన్ అని స్పష్టంగా తెలియజేశారు.

ఇక క్రెటా కింగ్ నైట్ ఎడిషన్ విషయానికి వస్తే, ఇది 1.5L MPi పెట్రోల్ IVT, 1.5L U2 CRDi డీజిల్ AT వెర్షన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ దీని ప్రత్యేకత పూర్తిగా డిజైన్, ఫీచర్లలో ఉంటుంది. మ్యాట్ బ్లాక్ ఫినిష్‌లో ఇచ్చిన R18 అలాయ్ వీల్స్ SUVకి మరింత స్పోర్టీ లుక్ ఇస్తాయి. అంతర్గతంగా, డ్రైవర్ పవర్ సీట్ మెమరీ, ప్యాసింజర్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్ సౌకర్యాలు అందించబడ్డాయి.


Click it and Unblock the Notifications








