అమ్మబాబోయ్.. హ్యుందాయ్ అన్నంత పని చేసింది... ఆ కారు కొనేవారికి షాక్!
ఈ కొత్త సంవత్సరంలో కారును కొనాలనుకునే వారికి కార్ల కంపెనీలు ఝలక్ ఇస్తున్నాయి. కారు కోసం డబ్బులు కూడబెట్టుకుని మంచి కారు కొనుగోలు చేయాలనుకునే జనాల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. రేటుపోటుతో హడలెత్తిస్తున్నాయి. మొన్న సిట్రోయిన్ సంస్థ తమ కారు ధరను పెంచగా.. ఇప్పుడిక దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యూందాయ్ వంతు వచ్చింది. 2025 జనవరిలో తమ బ్రాండ్ నుంచి కొన్ని వాహనాల ధరలు పెంచనున్నట్లు గత డిసెంబరులోనే ఈ సంస్థ ప్రకటించింది. చెప్పినట్లుగానే.. తమ సంస్థ నుంచి ఓ కారు మోడల్ ధరను అమాంతం పెంచేసింది. దీంతో ఫ్యాన్స్‌కు షాక్ తగిలినట్లయింది. అసలు హ్యూందాయ్ సంస్థ కారు ధరను పెంచడానికి దారి తీసిన పరిస్థితులేంటి? ఇప్పుడిక ఈ కార్ల ధరలు ఎలా ఉండబోతున్నాయి? వంటి వివరాలు ఇప్పుడు చూసేద్దాం.
తమ మోడల్‌ను బట్టి పెరిగిన వాహనాల ధరలు వేర్వేరుగా ఉంటాయని హ్యూందాయ్ సంస్థ ప్రకటించింది. అనేక కారణాల రీత్యా.. హ్యూందాయ్ సంస్థ ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. అందులో కారు తయారీకి అవసరమయ్యే మెటీరియల్స్, కాంపోనెంట్స్ వంటి ఇన్‌పుట్ కాస్ట్ పెరగడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతేగాకుండా రూపాయి విలువ పతనమై దిగుమతి ఖర్చు పెరగి తయారీ ఖర్చు పెరగడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది.

కారు తయారు కావాలంటే అందులో కచ్చితంగా కొన్ని మెటీరియల్స్ ఉండాల్సిందే. అందులో వాడే స్టీల్, అల్యూమినియం సహా ఇతర ముడిపదార్థాల ధరలు అధికంగా మారుతున్న నేపథ్యంలో హ్యూందాయ్ మాత్రమే గాకుండా అనేక ఇతర కంపెనీలు కూడా ఇదే నెల నుంచి తమ వాహనాల ధరలను పెంచేస్తున్నాయి. ఇక హ్యూందాయ్ సంస్థ నుంచి ఈసారి తమ క్రెటా ఎస్‌యూవీకి సంబంధించి స్పోర్టీయర్ వెర్షన్ అయిన క్రెటా ఎన్ లైన్ ధరను పెంచింది.
హ్యూందాయ్ క్రెటా ఎన్ లైన్ N8, N10 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు వేరియంట్ల ధరలను హ్యూందాయ్ సంస్థ రూ.11,000 వరకు పెంచింది. ఈ పెరిగన ధరతో ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.16.93 లక్షలకు చేరింది. ఇందులో టాప్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.20.56 లక్షలకు చేరింది. ఈ ధరలు ఎక్స్- షోరూమ్ వద్ద కావడం గమనార్హం.

హ్యూందాయ్ క్రెటా ఎన్ లైన్.. మోనోటోన్, డ్యూయల్ - టోన్ రంగుల్లో లభిస్తుంది. ఇందులో Atlas White, Abyss Black, Titan Grey Matte, Thunder Blue with Abyss Black Roof, Atlas White with Abyss Black Roof, Shadow Grey with Abyss Black Roof రంగుల్లో ఇది ఉంటుంది. రివైజ్డ్ ఫ్రంట్, రియర్ బంపర్స్ ఇందులో ఉంటాయి.
ఎన్ లైన్ బ్యాడ్జింగ్‌తో ఉండే ట్వీక్‌డ్ గ్రిల్, చుట్టూరా రెడ్ యాసెంట్స్, రియర్ స్పాయిలర్, 18 అంగుళాల అలాయ్ వీల్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ వంటి సదుపాయాలు ఇందులో ఉంటాయి. ఈ కారు ఇంటీరియర్ క్యాబిన్ ఫీచర్లు మొత్తం నలుపు రంగులో ఉంటాయి. స్పోర్టీయర్ స్టీరింగ్ వీల్, గేర్ సెలెక్టర్స్ వంటివి ఇందులో ఉంటాయి. ఇందులో 10.25 అంగుళాల డ్యూయల్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ కలదు.

దీంతో పాటు ఇన్స్టుమెంట్ క్లస్టర్, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, యాంబియెంట్ లైటింగ్, డ్యూయల్- జోన్ క్లైమేట్ కంట్రోల్, బోస్ సోర్స్ మ్యూజిక్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, ప్యాడిల్ షిఫ్టర్లు, డ్యూయల్ డ్యాష్ కెమెరా, పవర్ వెంటిలేటెడ్ డ్రైవర్ సీట్, 360 డిగ్రీ సరౌండెడ్ కెమెరా, పనోరమిక్ సన్ రూఫ్, Level 2 ADAS సూట్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో ఉంటాయి.
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. క్రెటా ఎన్ లైన్ ఎస్‌యూవీ.. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 158bhp పవర్, 253 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేయగలరు. ఇందులోని T-GDi unit 6- స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7- స్పీడ్ డ్యూయల్- క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్(DCT)తో అనుసంధానించి ఉంటుంది.
హ్యాందాయ్ సంస్థ ప్రకారం.. ఈ కారు 8.9 సెకన్లలోనే 0-100 kmph వెగాన్ని అందుకుంటుంది. మైలేజ్ విషయంలోనూ క్రెటా ఎన్ లైన్ ఎస్ యూవీ మెరుగైనదే అని చెప్పవచ్చు. ఈ కారు మ్యాన్యువల్ వెర్షన్ 18 kmpl, ఆటోమేటిక్ వెర్షన్ 18.2 kmpl మైలేజీ అందించగలదని ARAI సర్టిఫై చేసింది.


Click it and Unblock the Notifications








