30 కి.మీల మైలేజ్ ఇచ్చే క్రెటా హైబ్రిడ్ కారు వస్తుందోచ్! దీన్ని కొనాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే!
దిగ్గజ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) దేశంలో ఇటీవల కొత్త మోడళ్లను తీసుకురావడంపై కీలకంగా దృష్టి సారించింది. ఆటోమొబైల్ పరిశ్రమలో విపరీతమైన పోటీ కారణంగా వీలైనంత వేగంగా కొత్త కార్లను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే అదే సమయంలో తన పాత మోడళ్లను ట్రెండ్‌కు అనుగుణంగా కొత్తగా మార్పులు చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి కూడా కృషి చేస్తుంది. ఇప్పటికే కొన్నింటిని పూర్తిగా అప్‌డేట్ చేసి విడుదల చేయగా అవి చాలా వరకు సక్సెస్ అయ్యాయి. అమ్మకాల పరంగా మెరుగ్గా ఉన్నాయి. మిడ్-సైజ్ SUV మార్కెట్లో అగ్రగామి అయిన హ్యుందాయ్ తన క్రెటా కారును కొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేయడానికి సిద్ధం అయింది. ఈ మోడల్‌ను ఇప్పటికే పలు దఫాలుగా అనేక మార్పులకు లోనవగా, ఇప్పుడు దీని మూడవ తరం మోడల్‌ను సైతం తీసుకురావడానికి ప్రణాళికలు చేస్తుంది. క్రెటా కారుకు భారతీయ వినియోగదారుల్లో మంచి ఆదరణ ఉంది.
సేల్స్ పరంగా ఇతర కార్లతో పోలిస్తే మెరుగ్గానే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బలమైన పోటీ వాతావరణంలో ఇది తట్టుకుని నిలబడుతుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 కార్యక్రమంలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారును విడుదల చేయగా, జనవరిలో ఈ కారు అమ్మకాలు సరికొత్త మైలురాయి చేరాయి. క్రెటా ఈవీ ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ ఎక్కువగా ఉంటుంది.

త్వరలో విడుదల కాబోతున్న కొత్త తరం క్రెటాతో అమ్మకాలు మరింత పెరుగుతాయని హ్యుందాయ్ అంచనా వేస్తుంది. మూడవ తరం మోడల్ రానున్న కొన్ని సంవత్సరాలలో ఇండియాలో విడుదల అవుతుందని తెలుస్తోంది. తాజాగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఈ కారును 2027లో ఘనంగా తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త అప్‌డేట్ మోడల్‌కు SX3 అనే కోడ్‌నేమ్ కూడా ఉంది. దీనిని తమిళనాడులోని ప్లాంట్‌లో తయారుచేస్తున్నట్లు సమాచారం.
భారత మార్కెట్లో తన ఉనికిని బలంగా చాటుకోడానికి మూడవ తరం క్రెటాలో అదిరిపోయే ఫీచర్స్‌ను అందించబోతున్నారు. పాత మోడల్‌తో పోలిస్తే ఎక్స్‌టీరియర్‌లో మరిన్ని మార్పులు ఉంటాయి. డిజైన్ పరంగానే కాకుండా కొత్తగా హైబ్రిడ్ ఇంజిన్‌ను తీసుకువస్తున్నారు. కొత్త సాంకేతిక అంశాలను జోడించడం ద్వారా కస్టమర్లు ఈ కారుకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది.

తరువాతి తరం క్రెటాలో ముందు, వెనుక భాగంలో కొత్త మార్పులు ఉంటాయి. ముఖ్యంగా ప్రస్తుత ఇంజన్లకు సంబంధించిన వేరియంట్లను కొనసాగిస్తూనే శక్తివంతమైన హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అప్పటి కాలానికి అనుగుణంగా వినియోగదారులను ఆకట్టుకోవడానికి మరిన్ని కీలకమైన ఫీచర్స్‌ను కూడా ఈ కారులో ఆశించవచ్చు. ముఖ్యంగా మైలేజ్ విషయంపై కూడా కంపెనీ కీలకంగా దృష్టి సారించింది.
తదుపరి క్రెటాలో బలమైన హైబ్రిడ్ టెక్నాలజీని అందిస్తున్నందు వల్ల ఇది దాదాపు 30 kmpl మైలేజీని సైతం అందించే అవకాశాలు కూడా బోలెడు ఉన్నాయి. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో హ్యుందాయ్ అధునాతన సాంకేతికతతో కూడిన కార్లను విడుదల చేయడానికి ఎప్పుడూ కూడా ముందు ఉంటుంది. ఈ మోడల్‌తో పాటు తదుపరి వెన్యూ మోడల్‌ను కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








