దేశంలో జనాలు ఎక్కువగా కొంటున్న బడ్జెట్ కారు.. ధర భారీగా తగ్గడంతో షోరూమ్‌లో రద్దీ పెరిగింది
హ్యుందాయ్ క్రెటా SUV మార్కెట్లో నమ్మకమైన, అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌గా నిలిచింది. దీని ఆధునిక డిజైన్, అద్భుతమైన ఫీచర్లు, పోటీ ధర వినియోగదారులను ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ కారు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం, అత్యాధునిక టెక్నాలజీ, భద్రతా ఫీచర్లతో పాటు ప్రతి సెగ్మెంట్‌లో ఆకర్షణీయంగా నిలుస్తుంది. ఈ కారుకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. దానికి నిదర్శనంగా గత నెల సేల్స్ నిలుస్తున్నాయి. తాజాగా వెల్లడైన గణంకాల ప్రకారం, ఈ 2025 సెప్టెంబర్ నెలలో క్రెటా SUV అమ్మకాలు విశేషంగా పెరిగాయి. సుమారు 18,861 యూనిట్లు వినియోగదారుల కోసం డెలివరీ చేయబడ్డాయి. ఆసక్తికరంగా, ఈ ఏడాది జూన్ నుండి ఆగస్టు వరకు 48,608 యూనిట్లు క్రెటా అమ్ముడయ్యాయి, ఇది మోడల్ పై వినియోగదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
అమ్మకాలు పెరగడానికి ముఖ్య కారణంగా ఇటీవల అమలులోకి వచ్చిన GST సవరించిన పన్ను రేట్లు ఉండవచ్చు. ఈ పన్ను తగ్గింపుతో వినియోగదారులకు ఖర్చు తక్కువగా అనిపించడంతో, క్రెటా SUV తక్షణమే మరింత మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి నెలకొంది. దీని ధరను కంపెనీ భారీగా రూ.72,000 వరకు తగ్గించింది. ఇది వాహనం కొనుగోలులో తక్కువ పెట్టుబడితోనే వినియోగదారులను ఆకర్షించింది.

అదనంగా, దసరా, దీపావళి పండుగల సీజన్ కూడా అమ్మకాలను ప్రేరేపించడంలో కీలకంగా ఉంది. పండుగ సమయంలో వినియోగదారులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ముందే ప్లాన్ చేస్తారు, అలాగే ఆఫర్లు, తక్కువ ధరలు, సేల్స్ ప్రొమోషన్లు ఈ డిమాండ్‌ను మరింత పెంచాయి. దీంతో పండుగల ఉత్సాహం, వినియోగదారుల విశ్వాసంతో కలిసి మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న SUVగా మళ్లీ సాంకేతిక, ఆర్థిక, స్టైల్ పరంగా తన స్థానం సుస్థిరం చేసుకుంది.
హ్యుందాయ్ క్రెటా SUV తన శక్తివంతమైన పనితీరు, ఫీచర్లు, విభిన్న వేరియంట్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ SUV సరసమైన ధరలో లభిస్తుంది, ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.72 లక్షల నుండి రూ. 20.49 లక్షల వరకు ఉంది. దీని వేరియంట్లలో E, EX, S , S(O) మోడళ్లు ఉన్నాయి, వీటన్నీ వేరే వేరే ఫీచర్లు, స్టైలింగ్ ను కలిగి ఉన్నాయి. ఈ కారు 5 సీటర్ల సౌకర్యాన్ని అందిస్తుంది.

పవర్‌ట్రైన్ పరంగా, క్రెటాలో1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లు లభిస్తున్నాయి. ఇవి స్పీడ్, మైలేజ్‌ను సమతుల్యంగా అందిస్తాయి. మైలేజీ పరంగా, ఈ SUV 17 నుండి 21 kmpl వరకు అందిస్తుంది. పనితీరు పరంగా ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. గరిష్టంగా 195 kmph వేగాన్ని అందుకోగలదు. 8.9 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని చేరుతుంది.
హ్యుందాయ్ క్రెటా SUV లో వినియోగదారులను ఆకర్షించే డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి, ఇవి కేవలం సౌకర్యం కోసం మాత్రమే కాకుండా, భద్రతకు కూడా దోహదపడతాయి. 10.25-అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లే వ్యవస్థ (ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్) ద్వారా డ్రైవర్, ప్రయాణీకులు ఇన్ఫర్మేషన్‌ను సులభంగా పొందగలరు. లాంగ్ డ్రైవ్‌లో సన్‌రూఫ్ అనుభవం SUVకి ప్రీమియం టచ్ ను ఇస్తుంది, అలాగే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఎక్కువ సౌకర్యాన్ని అందిస్తాయి.

భద్రత పరంగా, క్రెటా SUV లో 6 ఎయిర్‌బ్యాగులు, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. వీటివల్ల డ్రైవ్ మరింత సురక్షితంగా మారుతుంది. క్రెటా EV వెర్షన్ విషయానికి వస్తే, ధర రూ. 18.02 లక్షల నుండి రూ. 24.55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 473 నుండి 510 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications








