ఒక కారును ఇంతగా నమ్ముతారా? ఒక్కసారి కొనగానే జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది.. 10 ఏళ్లలో 12 లక్షలు!
భారతదేశపు SUV మార్కెట్‌లో ఒక తిరుగులేని ప్రయాణాన్ని ప్రారంభించి, హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) ఇప్పుడు విజయవంతంగా 10 ఏళ్లు పూర్తిచేసుకుంది. 2015 జూలై 21న మొదటిసారి పరిచయం చేసిన ఈ కారు, అప్పటినుంచిSUV ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఇది కేవలం ఒక వాహనం కాదు, మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో నమ్మకానికి, స్టైలిష్ డిజైన్‌కి ప్రతీకగా మారింది. ప్రమాదాలను తట్టుకునే బలమైన బాడీ, డ్రైవింగ్‌లో సౌకర్యం, స్టైలిష్ లుక్, టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఇవన్నీ కలగలిపిన ఓ పర్ఫెక్ట్ ప్యాకేజీగా క్రెటా నిలిచింది. ఇది మార్కెట్‌లోకి వచ్చాక SUVలు కుటుంబ వాహనాలుగా ఎంతగానో ప్రాచుర్యం పొందిన దానికి ఇదే ప్రధాన కారణం. గ్రామీణం నుంచి నగరాలు వరకూ, తొలిసారి కారు కొనేవారు నుంచి కారును అప్‌గ్రేడ్ చేసేవారివరకు, క్రెటా అందరికీ ఇష్టమైన మోడల్‌గా మారింది.
ఇక 10 ఏళ్ల కాలంలో దాదాపు 12 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది హ్యుందాయ్‌కు కాదు, మొత్తం ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఒక గర్వకారణం. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా ప్రతి జనరేషన్‌లోనూ క్రెటా తనను తాను నూతనంగా పరిచయం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇది కేవలం ఒక SUV కాదు, ఒక ట్రస్ట్ బ్రాండ్. సాధారణంగా 10 ఏళ్లకంటే ఎక్కువకాలం ఒక మోడల్ అదే క్రేజ్‌తో కొనబడడం చాలా అరుదు.

కానీ క్రెటా మాత్రం ఆ చరిత్రను తిరగరాసింది. ఇది ఇంకా ఇండస్ట్రీకి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది. క్రెటా.. నమ్మకానికి మరో పేరుగా ఉంది. 2020లో హ్యుందాయ్ తన క్రెటాను రెండవ తరం రూపంలో కొత్త డిజైన్, ఫీచర్లతో భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ తరహా డిజైన్ మార్పులతో పాటు, ఇంటీరియర్, ఇంజిన్ ఆప్షన్లు, సేఫ్టీ ఫీచర్లలోనూ అభివృద్ధి తీసుకువచ్చారు. వినియోగదారులకు నూతన అనుభూతిని అందించేందుకు ఆ అప్‌డేట్ కీలకంగా నిలిచింది.
అదే తరుణంలో మూడవ తరం హ్యుందాయ్ క్రెటా 2024లో విడుదలైంది. ఇది మరింత అధునాతనమైన ఫీచర్లు, సరికొత్త డిజైన్, మెరుగైన టెక్నాలజీతో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. అయితే మారిన డిజైన్ అయినా, మారిన ఫీచర్లు అయినా.. వినియోగదారుల ఆదరణ మాత్రం ఎప్పటికీ ఒకేలా కొనసాగుతోంది. దానికి నిదర్శనం జూన్ 2025లో ఈ SUV దేశంలో అగ్రస్థానంలో నిలవడం. మొత్తం 15,786 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇవి మార్కెట్లో దీని డిమాండ్‌ను తెలియజేస్తున్నాయి.

హ్యుందాయ్ క్రెటా భారతీయ SUV మార్కెట్‌ను శాసిస్తున్న మోడళ్లలో ఒకటి. ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా రెండు ప్రధాన వేరియంట్‌ల్లో ICE, ఈవీలో అందుబాటులో ఉంది. ఇది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. మైలేజీ పరంగా ఇది 17 కి.మీ. నుండి 21.8 కి.మీల వరకు అందిస్తుంది, ధరలు రూ. 11.11 లక్షల నుండి మొదలవుతుంది
అదే టాప్ వేరియంట్ వచ్చేసి రూ. 20.50 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇది ఎలక్ట్రిక్ వేరియంట్‌లో కూడా లభిస్తుంది. ఇది 42 kWh, 51.4 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తోంది. ఫుల్ ఛార్జ్‌లో 390 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీని ధరలు రూ. 17.99 లక్షల నుండి రూ. 24.38 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. 5 సీట్ల ఈ SUV, దూర ప్రయాణాల్లోనూ రోజూ ఉపయోగించుకోవడానికీ సమర్ధంగా ఉంటుంది.

మొత్తంగా చెప్పాలంటే, హ్యుందాయ్ క్రెటా ఎంచుకోవడమంటే స్టైల్, పనితీరు, డ్యూబిలిటీకి ఓ మిక్స్. భద్రతా పరంగా దీనికి 6 ఎయిర్‌బ్యాగులు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉన్నాయి. ఫీచర్స్ పరంగా 10.25-అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ AC, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్ వంటి అనేక ఫీచర్లు దీనిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








