దేశంలో ఈ కారును జనాలు తెగ కొంటున్నారు.. ఏకంగా షోరూమ్‌ ముందు క్యూ.. దీనికి అంత డిమాండ్ ఎందుకో!

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ ఇండియా (Hyundai)ఇటీవల తన మోడళ్లకు సంబంధించిన అమ్మకాల వివరాలను వెల్లడిస్తుంది. తాజాగా తన ప్రసిద్ధ మోడల్ క్రెటా (Creta) 2025 జనవరిలో సాధించిన సేల్స్ వివరాలను కంపెనీ విడుదల చేసింది. ఇది భారతీయ మార్కెట్లో ప్రసిద్ధ suvగా ఉంది. ఈ కారుకు దేశంలో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. హ్యుందాయ్ గణాంకాల ప్రకారం, జనవరి నెలలో క్రెటా మొత్తం 18,522 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఆటో పరిశ్రమలో విపరీతమైన పోటీ నెలకొంది. ఇలాంటి సమయంలో మిగతా కంపెనీలను దాటుకుని మరి క్రెటా అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించింది. దీని ఆకట్టుకునే డిజైన్, అధునాతన ఫీచర్స్ కారణంగా కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకునే వారు క్రెటా ఎస్‌యూవీని ఎంచుకుంటున్నారు. ఇది దేశంలో లాంచ్ అయినప్పటి నుంచి కూడా కస్టమర్ల నుంచి విపరీతమైన డిమాండ్‌ను పొందుతూనే ఉంది.

దేశీయ SUV మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా అమ్మకాల పరంగా సరికొత్త రికార్డును సృష్టించింది. ఇది 2015లో వచ్చినప్పటి నుంచి కూడా దేశీయ కస్టమర్ల నుంచి మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. చాలా కాలంగా ఆటోమొబైల్ పరిశ్రమలో కంపెనీల మధ్య పోటీ ఎక్కువ ఉంది. అందుకే పోటా పోటీగా దూకుడుతో కొత్త suv లను విడుదల చేస్తూనే ఉన్నాయి. వీటిలో క్రెటా విజయవంతమైన మోడల్‌గా కొనసాగుతుంది.

Hyundai Creta Suv Design

ఈ మొత్తం అమ్మకాల్లో క్రెటా ICE వెర్షన్లతో పాటు, క్రెటా N-లైన్ , ఈ మధ్య కాలంలో విడుదలైన క్రెటా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ కలిపి ఉన్నాయి. గత ఏడాది జరిగిన విక్రయాలతో పోలిస్తే ఇది దాదాపు 40 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. హ్యుందాయ్ క్రెటా ఈవీ కూడా ఇటీవల కాలంలో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా అవతరించింది. ప్రస్తుతం క్రెటా ఈవీని ప్రజలను బాగా ఆదరిస్తున్నారు.

హ్యుందాయ్ క్రెటా ICE వెర్షన్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 11 లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్ రూ. 20.42 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్‌ షోరూమ్ ధరలు. అదే క్రెటా ఎలక్ట్రిక్ కారు గురించి తెలుసుకున్నట్లయితే ఇది బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.17.99 లక్షల నుంచి మొదలై రూ.24.38 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.

Hyundai Creta Suv 18522 Sales

ఆన్ రోడ్ అయితే పన్నులు, ఇన్సూరెన్స్‌ వంటి వాటితో కలిపి మరికాస్త ఎక్కువగా ఉంటుంది. క్రెటా ఈవీ 42 Kwh అలాగే, 51.4 Kwh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. బ్యాటరీనీ పూర్తిగా ఛార్జింగ్ చేసినట్లయితే 390 కి.మీల నుంచి 473 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఈ కారులో ఫీచర్స్ కూడా డజన్ల కొద్ది ఉన్నాయి. ఎక్స్‌టీరియర్‌తో పాటు ఇంటీరియర్ డిజైన్ కూడా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉంది.

కారు లోపల 10.25-అంగుళాల డ్యూయల్ స్క్రీన్ , డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌, ఇంకా ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగులు, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), VSC (వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్), ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టం), హిల్ స్టార్ట్ అసిస్ట్‌ వంటివి ఉన్నాయి.

Hyundai Creta Suv Price

అదే మరో ఇంజిన్ విషయానికి వస్తే, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ , 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఆప్షన్లలో లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి ఈ కారు 17.4 kmpl నుండి 21.8 kmpl మైలేజ్‌ను ఇస్తుందని హ్యుందాయ్ కంపెనీ పేర్కొంది. ఈ వేరియంట్లలో కూడా అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. 10.25-అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లే, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Sunday, February 9, 2025, 9:10 [IST]
English summary
Hyundai creta suv 18522 sales units in 2025 january full details check here
Read more on: #hyundai #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+