దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారు.. గత నెలలో షోరూమ్ ముందు కస్టమర్ల తాకిడి మాములుగా లేదు!
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) భారత మార్కెట్లో సత్తా చాటుతుంది. తన ప్రసిద్ధ మోడల్ SUV అయిన క్రెటా (Creta) ద్వారా మరోసారి తన దూకుడు ఏమిటో చూపించింది. క్రెటా కారు 2025లో ఈ మోడల్ దేశంలోని అత్యధికంగా అమ్ముడైన SUVగా అవతరించింది. తాజాగా విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం, ఇది జూన్ 2025లో కేవలం ఒక్క నెలలోనే మొత్తం 15,786 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత నెలకొంది.ఇలాంటి సమయంలో ఒక కారు ఇన్ని అమ్మకాలను నమోదు చేయడం అంటే విశేషం అని చెప్పాలి. ఈ నెలలోనే కాకుండా 2025 ఏడాది మొదలు జనవరి నుంచి జూన్ వరకు (H1 కాలం) క్రెటా భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది.
ఇది పరిశ్రమలో దాని డిమాండ్‌ను మరింత స్పష్టంగా చూపిస్తుంది. ఇదే కాక, మార్చి, ఏప్రిల్, జూన్ నెలల్లో మూడు సార్లు అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా గుర్తింపు పొందింది. దీన్నిబట్టి, క్రెటాపై ప్రజలకు ఉన్న నమ్మకం ఏమిటో తెలిసిపోతుంది. కంపెనీ ఈ మైలురాయిని మరింత సంతృప్తితో ఆస్వాదిస్తూ, బ్రాండ్ సత్తాను మళ్లీ నిరూపించినందుకు గర్వంగా పేర్కొంటోంది. విస్తారమైన కస్టమర్ బేస్ చేసిన ఈ విజయాన్ని మరింతగా గుర్తిండిపోయేలా మార్చిందని హ్యుందాయ్ తెలిపింది.

అత్యాధునిక సాంకేతికత, లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు, అద్భుతమైన డిజైన్, అనుకూలమైన సౌకర్యం, ఈ అన్నింటిని కలిగిన క్రెటా, భారతీయ SUV మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ప్రారంభం నుంచి వినియోగదారులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ మోడల్, అన్ని వయసుల వినియోగదారులకు ఒక మంచి ఎంపికగా నిలిచింది. ఇటీవల క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా హ్యుందాయ్ తీసుకొచ్చింది.
ఐసీఈ, ఎలక్ట్రిక్ ఆధారిత క్రెటా ద్వారా హ్యుందాయ్ ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ కావడానికి తీవ్రంగా కృషి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా ధరలు బేస్ వేరియంట్‌కి సుమారు రూ. 11 లక్షల(ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై, టాప్ వేరియంట్‌కి రూ.20 లక్షల వరకు ఉంటాయి. ఎలక్ట్రిక్ వేరియంట్ విషయానికి వస్తే, ప్రారంభ ధర సుమారు రూ.18 లక్షలు, గరిష్ట ధర సుమారు రూ.24 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

హ్యుందాయ్ క్రెటా, శక్తివంతమైన రెండు ఇంజిన్ ఆప్షన్లలో వినియోగదారులకు లభిస్తుంది. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ సహజంగానే మంచి రైడింగ్ అనుభవాన్ని ఇచ్చే విధంగా రూపొందించబడింది. అదే సమయంలో, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ సమర్థవంతమైన పవర్ డెలివరీతో పాటు ఫ్యూయల్ ఖర్చులను తగ్గించుకునేలా ఉపయోగపడుతుంది. ఇంజిన్లను బట్టి ఈ మోడల్ 17 నుండి 22 కిలోమీటర్ల మైలేజీని అందించడం విశేషం.
ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల విషయానికి వస్తే, క్రెటా 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్, సీవీటీ, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) వంటి విభిన్న గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. వీటివల్ల వేరువేరు డ్రైవింగ్ విధానాలు, అవసరాలు కలిగిన వినియోగదారులంతా వారికి నచ్చిన కాంఫిగరేషన్‌ను ఎంచుకునే అవకాశం పొందుతున్నారు. ఎలక్ట్రిక్ వేరియంట్ విషయానికి వస్తే, ఇది మరింత అధునాతనమైన శక్తివంతమైన బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది.

క్రెటా ఈవీ 42 కిలోవాట్, 51 కిలోవాట్ సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఈ క్రెటా ఎలక్ట్రిక్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేసిన తర్వాత 390 నుండి 473 కిలోమీటర్ల దూరం నిరంతరాయంగా ప్రయాణించగలదు. అంతేకాకుండా, ఇది రీజనరేటివ్ బ్రేకింగ్, అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, కంఫర్ట్ ఫీచర్లు వంటి అనేక ఆధునిక సౌకర్యాలతో వినియోగదారులకు కావాల్సిన అన్ని అంశాలను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








