సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు కొంటున్న రూ.11 లక్షల కారు.. ప్రతినెలా సేల్స్‌లో దూసుకుపోతుంది

హ్యుందాయ్ క్రెటా భారత SUV మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకుంది. ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా అందుబాటులో ఉన్న ఈ కారు, టెక్నాలజీ, డిజైన్, పనితీరు విషయంలో వినియోగదారుల ఆశలకంటే మించి నిలుస్తోంది. పోటీ ధరకు లభిస్తూ, వినియోగదారుల కలల కారుగా పేరు తెచ్చుకుంది. ప్రతినెలా ఈ మోడల్ బలంగా విక్రయాలు సాధించడం, దీని ఆదరణకు నిదర్శనం. తాజాగా హ్యుందాయ్ తన క్రెటా మోడల్ అమ్మకాల వివరాలను విడుదల చేసింది. 2025 మే నెలలో హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం 43,861 కార్లను విక్రయించింది. అందులో ఒక్క క్రెటా SUVనే 14,860 యూనిట్ల వరకు విక్రయించడం గమనార్హం. గత సంవత్సరం ఇదే నెలలో ఈ SUV 14,662 యూనిట్లను అమ్మింది. ఇది ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే దాదాపు 1 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఇది గడచిన నాలుగు నెలల్లోనూ అద్భుతంగా రాణించింది. 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఒక్కొక్క నెలలో క్రెటా సాధించిన అమ్మకాల గణంకాలను చూసినట్లయితే ప్రజల్లో ఈ కారుకు వాస్తవంగా డిమాండ్ ఎంత ఉందో అర్థమవుతుంది. నెలల వారీగా చూసినట్లయితే జనవరిలో 18,522 యూనిట్లు, ఫిబ్రవరిలో 16,317 యూనిట్లు, మార్చిలో 18,059 యూనిట్లు, ఏప్రిల్‌లో 17,016 యూనిట్ల అమ్మకాలను క్రెటా suv నమోదు చేసింది.

Hyundai Creta Suv May Sales

గణాంకాలు చూస్తే, హ్యుందాయ్ క్రెటా ఎలా ఒక గేమ్ ఛేంజర్‌గా నిలిచిందో స్పష్టంగా తెలుస్తోంది. మోడరన్ ఫీచర్లు, అధునాతన డిజైన్,సమర్థవంతమైన ఇంజిన్ ఆప్షన్లతో ఇది SUV ప్రేమికులను ఆకర్షిస్తోంది. ఇది SUV మార్కెట్‌లో తన స్థానం నిలబెట్టుకున్న శక్తివంతమైన మోడల్. అమ్మకాల గణాంకాలను పరిశీలించినపుడు, ఈ కారుకు భారత వినియోగదారుల మద్దతు ఎంతగానో ఉందని స్పష్టమవుతుంది. 2025 జనవరి నుంచి మే వరకు ప్రతినెలా సగటున 15,000 యూనిట్లు అమ్ముడవుతుంది.

ఈ సంఖ్యలను చూస్తే, ఇది ఎంతగానో డిమాండ్‌లో ఉందన్న దానికి ఉదాహరణ. 'క్రెటా'ను ప్రజలు ఇష్టపడే ప్రధాన కారణాల్లో మొదటిది.. డిజైన్. దీనికి ఉన్న మస్క్యులర్ స్టాన్స్, స్ప్లిట్ హెడ్‌లాంప్స్, డార్క్ క్రోమ్ గ్రిల్ వంటి ఎలిమెంట్లు, దీనిని రోడ్డు మీద ప్రత్యేకంగా నిలబెడతాయి. శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు, సేఫ్టీ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీ ఇవన్నీ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉంటూ, దీన్ని వరుసగా టాప్ సెల్లింగ్ SUVలలో నిలిపాయి.

Creta Suv May Sales 14860 Units Recorded In May

క్రెటా Suv ధర విషయానికి వస్తే,ఇది రూ.11 లక్షల ఎక్స్ షోరూమ్ ధర నుంచి టాప్ ఎండ్ వేరియంట్ రూ.20 లక్షల వరకు ఉంటుంది. మధ్య తరగతి నుంచి పై తరగతి వరకు అందరికీ సరిపోయే కారుగా నిలుస్తోంది. దీనిలో 5 సీటింగ్ ఆప్షన్ ఉంటుంది. ఐదు మంది ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. ఫ్యామిలీ ట్రిప్స్‌కు ఎక్కువ లగేజీ తీసుకెళ్లడానికి 433 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.

క్రెటా పెట్రోల్ వేరియంట్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది, శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. డీజిల్ వేరియంట్‌లో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది, ఇది ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ వేరియంట్లు 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్, CVT, 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉన్నాయి. మైలేజీ పరంగా, ఈ వేరియంట్లు 17 నుండి 22 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి, ఇది చాలా బైక్‌లతో పోలిస్తే సమానంగా ఉంటుంది.

Hyundai Creta Suv May Sales 14860 Units Recorded In May 2025

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా చూసినట్లయితే ఇది రూ.18 లక్షల నుండి రూ. 24 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. 42 kWh బ్యాటరీ ప్యాక్‌తో, ఇది పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు సుమారు 390 కిలోమీటర్లు ప్రయాణించగలదు, 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో సుమారు 473 కిలోమీటర్లు ప్రయాణించగలదు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 10, 2025, 17:20 [IST]
English summary
Hyundai creta suv may sales 14860 units recorded in may 2025 details
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+