స్టైలిష్ లుక్, అదిరిపోయే మైలేజ్..ఇంత తక్కువ ధరలో ఇంత మంచి ఎస్యూవీ..అయినా కొనని జనం
భారత మార్కెట్‌లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీల్లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) ఒకటి. ముఖ్యంగా టాటా పంచ్ (Tata Punch) కారుతో ఇది గట్టి పోటీ ఇస్తోంది. అతి తక్కువ ధరలోనే ప్రారంభమై, కిలోకు 27 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇవ్వడం ఈ కారు స్పెషాలిటీ. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫ్యామిలీ కారు, అది కూడా ఎస్‌యూవీ లుక్‌తో కావాలనుకునే వారికి ఈ ఎక్స్‌టర్ ఒక మంచి ఆప్షన్. ఈ కారు ధరలు, ఫీచర్లు, అమ్మకాల వివరాలు ఇక్కడ చూద్దాం.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే, ఈ ఏడాది అక్టోబర్‌లో అమ్మకాలు కొద్దిగా తగ్గాయి. గత 2024 అక్టోబర్‌లో 7,127 కార్లు అమ్ముడైతే ఈ 2025 అక్టోబర్‌లో 6,294 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే సుమారు 12 శాతం అమ్మకాలు తగ్గాయి.

జీఎస్టీ తగ్గింపులు, దీపావళి పండుగ సీజన్ వంటి ముఖ్య కారణాల వల్ల సాధారణంగా కార్ల అమ్మకాలు పెరుగుతాయి. కానీ ఎక్స్‌టర్‌కు మాత్రం ఈసారి తగ్గుదల కనిపించింది. అయితే ఎక్స్‌టర్ ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ కాబట్టి, అతి త్వరలోనే మళ్లీ ఈ అమ్మకాలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు ధరలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. భారత మార్కెట్‌లో ఈ కారు బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 5.68 లక్షల నుంచే ప్రారంభమవుతోంది. ఇక టాప్ వేరియంట్ ధర కూడా రూ.9.61 లక్షల వరకు మాత్రమే ఉంది. ఈ ధరలు హ్యుందాయ్ ఎక్స్-షోరూమ్ ధరలు.ఒక ఎస్‌యూవీ కారు ఇంత తక్కువ ధరలో లభించడం నిజంగా గొప్ప విషయం.

ఎక్స్‌టర్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని మైలేజ్. దీని సీఎన్జీ వేరియంట్లు ఒక కిలోకు ఏకంగా 27.10 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి. అంటే, రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది పెట్రోల్ ఖర్చును బాగా తగ్గిస్తుంది. ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ కావడంతో పాటు, ఎక్స్‌టర్ చాలా అధునాతన ఫీచర్లను కూడా కలిగి ఉంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారులో ధరను మించిన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా సేఫ్టీ విషయంలో ఈ కారు చాలా ముందుంది. ఈ కారులోని అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఇవ్వడం దీని స్పెషాలిటీ. స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్యూయల్ కెమెరాతో కూడిన డాష్‌క్యామ్, 20.32 సెం.మీ. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ స్పీడోమీటర్.

క్రూయిజ్ కంట్రోల్ (Cruise Control), టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ టెక్నాలజీలు కూడా ఇందులో ఉన్నాయి.
మార్కెట్‌లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారుకు ప్రధాన పోటీదారు టాటా పంచ్. ఎస్‌యూవీ లుక్, ఫీచర్లు, ధరల విషయంలో ఈ రెండు కార్లు ఒకదానికొకటి గట్టి పోటీ ఇస్తున్నాయి. అందుకే, టాటా పంచ్‌కు బదులుగా తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే మంచి ఎస్‌యూవీ కావాలంటే, హ్యుందాయ్ ఎక్స్‌టర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications








