ధర రూ.6 లక్షలు.. ఈ మైక్రో SUVలను పోటీ పడి కొంటున్న జనాలు.. టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కి భారీ డిమాండ్

భారతదేశంలో ప్రస్తుతం మైక్రో ఎస్‌యూవీ(SUV)లకు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. ఈ సెగ్మెంట్‌లో దేశీయ దిగ్గజ కంపెనీలు టాటా మోటార్స్(tata motors)కు చెందిన ప్రసిద్ధ మోడల్ పంచ్(Punch), దక్షిణ బ్రాండ్‌ హ్యుందాయ్ (Hyundai)కు చెందిన ఎక్స్‌టర్ (Exter) మోడళ్లుగా అత్యుత్తమైన కార్లుగా అవతరించాయి. ఇటీవల కాలంలో విడుదల అవుతున్న సేల్స్ గణంకాలను గమనించినట్లయితే ఈ రెండు suvలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. భారతీయ వినియోగదారుల నుంచి వీటికి భారీ ఆదరణ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందరిని ఆకర్షించే డిజైన్, మెరుగైన ఇంజిన్ పెర్ఫామెన్స్, ప్రీమియం ఫీచర్లు, ఫ్యూయల్ ఎఫిషియన్సీ అన్నింటినీ కలిపి అందించే బెస్ట్ చాయిస్‌గా ఈ మైక్రో SUVలు నిలుస్తున్నాయి. అందుకే ఈ సెగ్మెంట్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లుగా నిలుస్తున్నాయి.

సిటీ ట్రాఫిక్‌తో పాటు రఫ్ రోడ్స్, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సులభంగా డ్రైవింగ్‌కు అనువుగా ఉండటం వీటి ప్రత్యేకత. సేల్స్ డేటా చూసినట్లయితే అక్టోబర్ 2021లో దేశీయ మార్కెట్లో విడుదలైన టాటా పంచ్ ఆ ఏడాదిలో మొత్తం 22,571 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. తరువాతి ఏడాది 2022లో ఏకంగా ఈ ఎస్‌యూవీ సేల్స్ 1,29,895 యూనిట్లుగా నమోదు అయి, మార్కెట్లో ప్రసిద్ధ మోడల్‌గా అవతరించింది.

Hyundai Exter And Tata Punch Micro Suv

ఈ ఆకర్షణీయమైన SUV డిజైన్, 5-స్టార్ NCAP సేఫ్టీ రేటింగ్‌తో కేవలం కొన్ని నెలల్లోనే బెస్ట్-సెల్లింగ్ మోడల్గా మారిపోయింది. 2023లో ఈ కారును 1,50,182 మంది కొనుగోలు చేయడం విశేషం. ఇక గత ఏడాది అంటే 2024లో టాటా పంచ్ ఇతర కార్లకు బలమైన పోటీగా నిలుస్తూ, దాదాపు 2,02,031 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది బోల్డ్ డిజైన్‌తో ట్రెండీ యూత్ అలాగే ఫ్యామిలీలను ఆకర్షిస్తోంది.

అందుకే భారతదేశంలో 'టాటా పంచ్' SUV గత ఏడాది అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డులకెక్కింది. ఇక మరో మోడల్ హ్యుందాయ్ ఎక్స్‌టర్ విషయానికి వస్తే, ఇది 2023 జులైలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. అమ్మకానికి వచ్చిన ఆ ఏడాదిలోనే 47,013 యూనిట్ల సేల్స్‌ను సాధించింది. ఆ తరువాతి ఏడాది 2024లో చూసినట్లయితే ఈ కారు 84,368 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం విశేషం.

Tata Punch Micro Suv

టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ SUV‌లకు డిమాండ్ పెరగడానికి కారణం, ఇవి భారతీయ మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో ధరలో లభించడం. టాటా పంచ్ ఐసీఈ ఇంజిన్ రెగ్యులర్ మోడల్ ధర రూ. 6.20 నుండి రూ. 10.32 లక్షల వరకు ఉంది. ఎక్స్ షోరూమ్ ధర. అలాగే పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్ ధర వచ్చేసి రూ.9.99 నుండి రూ. 14.44 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.

ఇవి చాలా శక్తివంతమైన పనితీరును కనబరుస్తాయి. టాటా పంచ్ విషయానికి వస్తే, 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్, CNG‌, ఈవీలో లభిస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సెటప్‌తో లభిస్తుంది. పెట్రోల్ ఆప్షన్ 18.8 నుండి 19-20 కిలోమీటర్ల మైలేజ్‌ను, Cng కిలో ఇంధనానికి 26.99 కిమీలు, అదే ఈవీ వెర్షన్ 25 kWh బ్యాటరీ ప్యాక్‌తో 315,35 kWh‌తో 421 కి.మీల రేంజ్ అందిస్తుంది.

Hyundai Exter Micro Suv

ఇక హ్యుందాయ్ ఎక్స్‌టర్ గురించి చూసినట్లయితే, 1.2-లీటర్ 4-సిలిండర్ ఇంజిన్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు దాదాపు 19.2 నుండి 19.4 కి.మీ. మైలేజీని ఇస్తుంది. అదే cng వేరియంట్ కిలో ఇంధనానికి 27.1 కి.మీలు ఇస్తుంది.

Take a Poll

More from DriveSpark

Article Published On: Monday, March 24, 2025, 16:14 [IST]
English summary
Hyundai exter and tata punch micro suv cars now a days demand is increasing more details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+