ఫ్యాన్స్‌కు ఝలక్ ఇచ్చిన మరో టాప్ కంపెనీ.. ఇక ఆ ఫేమస్ కారు కొనాలంటే కష్టమే!

భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మైక్రో ఎస్యూవీలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. హ్యాచ్‌బ్యాక్ ధరల్లోనే ఈ మైక్రో ఎస్‌యూవీలు అందుబాటులో ఉండడంతో చాలా మంది దీన్ని కొనుగోలు చేస్తున్నారు. దిగ్గజ సంస్థ హ్యూందాయ్ నుంచి వచ్చిన Exter మోడల్.. కస్టమర్లను బాగా ఆకట్టుకుంది. ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీనిచ్చి అనతి కాలంలోనే సేల్స్ పెంచుకుంది. కాంపాక్ట్ అప్పియరెన్స్‌తో తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉండడంతో ఈ మైక్రో ఎస్‌యూవీ వినియోగదారులకు చేరువైంది. ఈ మోడల్.. మార్కెట్లో దూసుకుపోతున్న తరుణంలో హుందాయ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కారు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Exter మోడల్ వినియోగదారులను బాగా ఆకర్షిస్తూ మార్కెట్లో దూసుకుపోతోంది. అయితే ఈ కొత్త సంవత్సరంలో ఈ కారును కొనాలంటే మాత్రం కొంచెం ఎక్కువగానే వెచ్చించాల్సి ఉంటుంది. 2025 జనవరి నుంచి ఈ మోడల్ రేంజ్‌లో ధరలు పెంచుతామని గతంలోనే ఈ సంస్థ ప్రకటించింది. అన్నట్లుగానే ఇప్పుడు ధరలు పెంచింది.

Hyundai exter price increased

టాటా పంచ్‌కు పోటీగా ఉన్న ఈ Exter B-SUV ధర రూ.9,700 మేర పెరిగింది. ఈ పెరిగిన ధర Exter SX 1.2 మ్యాన్యువల్ నైట్ ఎడిషన్ Hi-CNG Duo, SX 1.2 మ్యాన్యువల్ Hi-CNG Duo, S 1.2 మ్యాన్యువల్ Hi-CNG Duo వెర్షన్లకు వర్తిస్తుంది.

అదే సమయంలో SX 1.2 మ్యాన్యువల్ CNG, మొరాకో ఎస్‌యూవీకి సంబంధించి S 1.2 మ్యాన్యువల్ సీఎన్‌జీ వర్షన్లకు అదనంగా రూ.8,200 చెల్లించాలి. ఎక్స్టర్ రేంజ్‌లో సెలెక్ట్ వేరియంట్లైన SX(O) Connect 1.2 AMT and SX(O) Connect 1.2 AMT Night Edition ధరలను హ్యూందాయ్ సంస్థ పెంచలేదు. మిగతా అన్ని వేరియంట్ల ధరలను రూ.7,500 మేర పెంచింది.

Hyundai exter Details

పెరిగిన ఈ ధరలతో హ్యాుందాయ్ ఎక్స్టర్ రేంజ్ ప్రస్తుతం రూ.6.20 లక్షల నుంచి రూ.9.48 లక్షల మధ్య లభిస్తోంది. ఈ మైక్రో ఎస్‌యూవీ 7 వేరియంట్లలో 12 రంగుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సింగిల్ సీఎన్‌జీ సిలిండర్, డ్యూయల్ సీఎన్‌జీ సిలిండర్ వెర్షన్లలో ఇది అందుబాటులో ఉంది.

ఈ ధర పెంపు మినహా.. మరెలాంటి మార్పులను హ్యూందాయ్ సంస్థ చేయలేదు. ఈ సెగ్మెంట్లో అత్యంత ఫీచర్- రిచ్ వెహికిల్ ఎక్స్టర్ అనే చెప్పవచ్చు. ఈ కారు ఆధునాతన ఫీచర్లతో తీసుకువచ్చారు. సన్‌రూఫ్, డ్యాష్‌క్యామ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 8 అంగుళాల ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం వంటి ఫీచర్లు ఉంటాయి.

Hyundai exter price

ఇక దీని స్టాండర్డ్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ESC, హిల్ అసిస్ట్ కంట్రోల్, EBD తో కూడిన ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా, అన్ని సీట్లకు త్రీ- పాయింట్ సీట్ బెల్టులు, సీట్ బెల్ట్ రిమైండర్స్, ISOFIX యాంకరేజెస్ వంటివి ఈ ఎక్స్టర్ కు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అధిక స్పేషియస్ ఇంటీరియర్ ఈ కారులో ఉంటుంది.

5-స్పీడ్ మ్యాన్యూవల్ లేదా AMT గేర్ బాక్స్ ఆప్షన్‌తో ఈ కారు ఉంటుంది. ఈ కారు... 83 bhp పవర్, 114 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీని వినియోగిస్తే.. ఈ కారు 68 bhp పవర్, 95.2 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇక ఈ కారు మైలేజీ విషయానికి వస్తే.. పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్ కు 19.4 kmpl, AMTకి 19.2 kmpl మైలేజీ అందించగలదని హ్యాూందాయ్ సంస్థ చెబుతోంది. అదే సమయంలో సీఎన్‌జీ వెర్షన్‌లో ఈ కారు 27.10 kmpl మైలేజీ అందించగలదని అంటోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 15, 2025, 16:12 [IST]
English summary
Hyundai exter price increased upto rs 7500 all details check here
Read more on: #hyundai #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+