ధర కేవలం రూ.7.98లక్షలే.. కాస్ట్లీ కార్లలో ఉండే ఫీచర్లన్నీ ఈ చిన్న కారులో ఉన్నాయి
ఈ పండుగ సీజన్లో కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకోసం హ్యుందాయ్ (Hyundai) అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ. 7.98 లక్షల ప్రారంభ ధరతో, ఖరీదైన కార్లలో మాత్రమే ఉండే ఫీచర్లతో కొత్తగా ఎక్స్టర్ ప్రో ప్యాక్(Exter Pro-Pack) ను మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ కొత్త వేరియంట్‌లో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి, దాని ధర ఎంత, ఏ రంగుల్లో అందుబాటులో ఉంది అనే వివరాలు తెలుసుకుందాం.
హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రో ప్యాక్ ప్రత్యేకతలు
హ్యుందాయ్ ఎక్స్టర్ ఇప్పటికే మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, కస్టమర్లను మరింత ఆకర్షించడానికి హ్యుందాయ్ ఈ కొత్త 'ప్రో ప్యాక్' వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్‌లో కొన్ని కాస్మెటిక్ మార్పులు, అదనపు ఫీచర్లు, కొత్త రంగులు ఉన్నాయి.

కొత్తగా వచ్చిన టైటాన్ గ్రే మాట్ పెయింట్
ఈ కారులో ఇప్పుడు ప్రత్యేకంగా టైటాన్ గ్రే మాట్ పెయింట్ ఫీనిషింగ్ తో కూడిన వేరియంట్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ పెయింట్ ఫినిష్ కారుకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. అంతేకాకుండా, ఈ కొత్త రంగులో వీల్ ఆర్చ్ క్లాడింగ్స్, సైడ్ సిల్స్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది, కారుకు మస్కులర్ లుక్‌ను ఇస్తుంది.
డ్యాష్‌క్యామ్ ఫీచర్ అన్ని వేరియంట్లలో
ఈ ఎక్స్టర్ కారులో ఇప్పటికే కొన్ని వేరియంట్లలో డ్యాష్‌క్యామ్ ఫీచర్ ఉంది. ఇప్పుడు ఆ ఫీచర్‌ను మరిన్ని వేరియంట్లకు విస్తరించారు. ఈ డ్యాష్‌క్యామ్ ఫీచర్ డ్రైవింగ్ సమయంలో భద్రతను పెంచుతుంది.

రంగులు, ధర వివరాలు
ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ కారు మొత్తం 10కి పైగా రంగుల్లో అందుబాటులో ఉంది. అవి: అట్లాస్ వైట్, ఫెయిరీ రెడ్, రేంజర్ ఖాకీ, స్టారీ నైట్, కాస్మిక్ బ్లూ, అబిస్ బ్లాక్. వీటితో పాటు డ్యూయల్-టోన్ రంగులైన అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్, కాస్మిక్ బ్లూ, అబిస్ బ్లాక్, షాడో గ్రే, అబిస్ బ్లాక్ రంగుల్లో కూడా లభ్యమవుతుంది.
ఈ కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రో ప్యాక్ ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు. ఎక్స్టర్ కారులోని S+ మ్యానువల్ వేరియంట్ పైన ఉన్న అన్ని వేరియంట్లను ప్రో ప్యాక్ కిందకి తీసుకువచ్చారు.

ఇంజిన్ సామర్థ్యం
ఈ కారులో 1.2 లీటర్ల సామర్థ్యం గల 4-సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 82 బీహెచ్‌పీ పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యానువల్, 5-స్పీడ్ ఏఎంటీ (AMT) గేర్‌బాక్స్‌లతో లభ్యమవుతుంది.
పండుగ సీజన్ కోసం హ్యుందాయ్ కొత్త వ్యూహం
పండుగ సీజన్లో కారు అమ్మకాలను పెంచుకోవడానికి కార్ల కంపెనీలు ఇలాంటి ఆఫర్లను, కొత్త అప్‌డేట్‌లను తీసుకొస్తుంటాయి. హ్యుందాయ్ కూడా అదే వ్యూహంతో ఈ కొత్త 'ప్రో ప్యాక్'ను విడుదల చేసింది. దీంతో కారు అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








