ఖర్చు తక్కువ, మైలేజ్ ఎక్కువ.. బడ్జెట్ ఫ్రెండ్లీ కారును కస్టమర్లు ఇష్టంగా కొంటున్నారు

దక్షిణకొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) ఇండియాలో కూడా మంచి మార్కెట్‌ను కలిగి ఉంది. తక్కువ ధరతో పాటు, మెరుగైన మైలేజ్ ఇచ్చే కార్లను విడుదల చేయడంలో దేశంలో గుర్తింపు పొందింది. కంపెనీ ఇటీవల వరుసగా తన కార్ల అమ్మకాల వివరాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హ్యుందాయ్‌కు గొప్ప పేరు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ మోడల్ ఎక్స్‌టర్ (Exter) Suvకి సంబంధించిన సేల్స్ వివరాలు వెల్లడించింది. భారతదేశంలో ప్రజాధారణ పొంందిన కార్లతో ఈ ఎస్‌యూవీ కూడా ఒకటి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో లభించడంతో పాటు మైలేజ్ కూడా అద్భుతంగా వస్తుంది. ఈ ఎక్స్‌టర్ కారు జనవరి 2025 నెలలో 6,068 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దీనికి ముందు డిసెంబర్ నెల 2024లో కేవలం 5,270 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.

నెల ప్రాతిపదికన అమ్మకాలు 798 యూనిట్లు ఎక్కువ కావడం గమనార్హం. కొత్త ఏడాది ప్రారంభ నెలలో ఎక్స్‌టర్ Suv సేల్స్ పెరగడంతో కంపెనీ సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.6.21 లక్షలు, అదే టాప్ వేరియంట్ అయితే రూ.10.51 లక్షలు మాత్రమే. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ వచ్చేసరికి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది బడ్జెట్ ధరలో లభించడం విశేషం.

Hyundai Exter Sales Details

సాధారణంగా దేశంలో మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా సొంతంగా కార్లను కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరలోనే మెరుగైన సేఫ్టీ, ఎక్కువ మైలేజ్ అందించే వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ Suv అంచనాలకు తగ్గట్టుగా ఉండటంతో దీని సేల్స్ సానుకూలంగా పెరిగాయి. ఇది పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది.

Cng వేరియంట్ అయితే కిలో ఇంధనానికి 27.1 కిమీల మైలేజ్‌ను అందిస్తుంది. అలాగే పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 19.4 కి.మీలు, ఆటోమెటిక్‌లో 19.2 కి.మీల మైలేజ్ ఇస్తుంది. ఎక్స్‌టర్ మార్కెట్లో వివిధ రకాల కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు లభిస్తుంది. ఎక్స్‌టీరియర్‌లో LED DRLలు, ముందు ఆకట్టుకునే డిజైన్, అల్లాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటీరియర్ కూడా చాలా అందంగా ఉంటుంది. డజన్ల కొద్ది ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.

Hyundai Exter 2025 Sales Report

క్యాబిన్‌లో సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, , 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కార్ టెక్, ఆటో AC, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, డ్యుయల్ కెమెరాలు, సన్‌రూఫ్ ఫీచర్, ప్రయాణికుల సేఫ్టీకి కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC),EBDతో కూడిన ABS,వెనుక పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్-సీట్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు వంటివి ఈ కారులో ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ ప్రధానంగా నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్, రెనాల్ట్ కైగర్‌లకు బలమైన పోటీగా ఉంది. తక్కువ ధరలో లభించడం ఒక కారణం అయితే, మైలేజ్ కూడా అంచనాలకు తగ్గట్టు వస్తుండటంతో ఇది మెరుగైన అమ్మకాలను నమోదు చేస్తుంది.

Hyundai Exter Recorded 6068 Sales

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, February 28, 2025, 12:52 [IST]
English summary
Hyundai exter recorded 6068 sales units in january 2025 more details here
Read more on: #hyundai #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+