రూ.6 లక్షల ధరకే 27.1 కి.మీ మైలేజ్ ఇచ్చే హ్యుందాయ్ కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కస్టమర్లు!
దిగ్గజ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) ఇటీవల వరుసగా తన కార్ల అమ్మకాలను వెల్లడిస్తుంది. ఇంతకుముందు 2024 ఏడాదికి సంబంధించిన సేల్స్ వివరాలను విడుదల చేసిన కంపెనీ తాజాగా 2025 జనవరి నెలకు సంబంధించిన డేటాను వెల్లడించింది. ఈ సేల్స్‌లో తన ప్రసిద్ధ మోడల్ ఎక్స్‌టర్ (Exter) గురించిన అమ్మకాలను చూసినట్లయితే గత నెలలో 6,068 యూనిట్ల ఎక్స్‌టీ ఎస్‌యూవీ విక్రయాలను నమోదు చేసిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది గత ఏడాది అంటే 2024 జనవరి నెలలో 8,229 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే సేల్స్ దాదాపు 26 శాతం తగ్గడం గమనార్హం. ఇదిలా ఉంటే 2024 చివరి నెల డిసెంబర్‌లో మొత్తం 5,270 యూనిట్లు అమ్ముడుపోగా, ఒక నెల రోజుల వ్యవధిలోనే సేల్స్ తిరిగి పుంజుకున్నాయి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఒక ఎస్‌యూవీ (Suv) మోడల్. సాధారణంగా కంపెనీ మొత్తం కార్లలో ఇది మంచి డిమాండ్ ఉన్న SUV. ఏడాది వారీగా అమ్మకాలు తగ్గినప్పటికీ మాత్రం నెలవారీగా చూసినట్లయితే తిరిగి పెరగడం సంతోషించే విషయమే. కొత్త ఏడాది ప్రారంభ నెలలో మెరుగైన అమ్మకాలను సాధించడంతో రానున్న రోజుల్లో ఇది మరిన్ని ఎక్కువ సేల్స్‌ను సాధింస్తుందని హ్యుందాయ్ ఇండియా అధికారులు లెక్కలు వేస్తున్నారు.

భారత మార్కెట్లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఒక ప్రసిద్ధ SUVగా ఉంది. ఇది EX, EX(O), S, S Plus, S(O), SO(O) Plus అనే పలు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ధర విషయానికి వస్తే, బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.20 లక్షల నుంచి మొదలుకుని టాప్ వేరియంట్ ధర దాదాపు రూ.10.50 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.
ఆన్‌రోడ్ అయితే ఏరియాను బట్టి మారుతు మరింత ఎక్కువ ఉంటుంది. ఈ suv లో 5 మంది కలిసి ప్రయాణించవచ్చు. XT SUV వినియోగదారుల కోసం టైటాన్ గ్రే, కాస్మిక్ బ్లూ, రేంజర్ ఖాకీ, ఫైరీ రెడ్, షాడో గ్రే వంటి పలు కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు లభిస్తుంది. ఎక్స్‌టీరియర్ అందంగా ఉండటంతో పాటు లోపల కూడా వినియోగదారులకు కట్టిపడేసేలా థీమ్, అధునాతన ఫీచర్స్ మొదలైనవి ఉన్నాయి.

ఇది శక్తివంతమైన రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, 1.2-లీటర్ CNGని కలిగి ఉంది. పెట్రోల్ ఇంజిన్ 83 PS హార్స్‌పవర్, 114 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే cng ఆప్షన్ 69 హార్స్‌పవర్, 95 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేరియంట్‌ను బట్టి ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జోడించారు.
మైలేజ్ విషయానికి వస్తే, 19.4 నుండి 27.1 kmpl వరకు ఇస్తుంది. కారులో ఫీచర్స్ కూడా డజన్ల కొద్ది ఉన్నాయి. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్, సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగులు, EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటివి ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








