రూ.5.98 లక్షలకే లభిస్తున్న హ్యుందాయ్ కారు జోష్ తగ్గింది.. ఎందుకో తెలుసా..?
భారతీయ వాహన పరిశ్రమలో ప్రముఖ వాహన తయారీగా ఉన్నటువంటి హ్యుందాయ్ (HYUNDAI) కార్లకు దేశంలో మంచి డిమాండ్ ఉంటుంది. కంపెనీ దేశంలో చాలా రకాల మోడళ్లను సేల్ చేస్తుంది. వీటిలో చాలా వరకు ప్రసిద్ధి చెందినవే ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా హ్యుందాయ్ అన్ని వర్గాల వారికి అందుబాటులో ధరల్లోనే తన కార్లను విడుదల చేస్తుంది. చాలా కాలంగా వాహనాల అమ్మకాల విషయంలో తన గణంకాలను మెరుగుపరుకుంటూనే ఉంది. 2024 లో కూడా ఇతర కంపెనీలతో పోటీ పడుతూ సేల్స్ విషయంలో వాటికి గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం హ్యుందాయ్ తన కార్ల అమ్మకాల డేటాను వరుసగా విడుదల చేస్తుంది. ఇదే క్రమంలో తాజాగా కంపెనీ తన హ్యాచ్‌బ్యాక్ మోడల్ గ్రాండ్ ఐ10 నియోస్ (Grand i10 Neos) కారుకు సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. ఇండియా మార్కెట్లో ఈ కారు ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటిగా ఉంది.
హ్యుందాయ్ 2024 డిసెంబర్ నెలలో తన గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ కారు తక్కువ అమ్మకాలను నమోదు చేసింది. ఈ నెలలో దీనిని 4,489 మంది కొనుగోలు చేశారు. ఇది గత ఏడాది అంటే 2023 డిసెంబర్ నెలలో 5,247 యూనిట్ల సేల్స్‌ను సాధించింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే గ్రాండ్ ఐ10 నియోస్ అమ్మకాల్లో ఏకంగా 14 శాతం తక్కువ విక్రయాలను నమోదు చేయడం గమనార్హం.

సాధారణంగా ఈ కారుకు మంచి ఆదరణ ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఇలా సేల్స్ తగ్గిపోవడం గమనార్హం. అయితే అమ్మకాలు క్షీణించడంపై హ్యుందాయ్ అధికారులు కూడా చర్యలు ప్రారంభించారు. ఈ తగ్గుదల పాక్షికంగానే ఉంటుందని త్వరలో ఇది తిరిగి పుంజుకుని సేల్స్‌లో 2023 డిసెంబర్ కంటే ఎక్కువ సేల్స్ సాధిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో గ్రాండ్ ఐ10 నియోస్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5.98 లక్షలుగా ఉంది. అయితే ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. దీనిలో టాప్ వేరియంట్‌ను కావాలనుకునే వారు మరింత ఎక్కువ చెల్లించాల్సి ఉంది. దీని ధర రూ.8.62 లక్షలు. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఉంది.

ఇది అన్ని వర్గాల వారు కొనగలిగే విధంగా బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వారు బేస్ వేరియంట్‌ను ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మరిన్ని అదనపు ఫీచర్స్, సదుపాయాలు కావాలనుకునే వారు మాత్రం టాప్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. ఇటీవల కాలంలో చాలా మంది వినియోగదారులు రూ.10 లక్షలలోపు బడ్జెట్ కార్లను ఎక్కువగా కొంటున్నారు. ఈ క్రమంలో గ్రాండ్ ఐ10 నియోస్ అలాంటి వారికి సెట్ అవుద్ది.
ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో ఉంది. పవర్ అవుట్‌పుట్ విషయానికి వస్తే, 83 PS పవర్, 114 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ AMT, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. అదే CNG వేరియంట్‌ను చూసినట్లయితే 69 PS పవర్, 95 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్‌తో పోల్చినట్లయితే ఇది తక్కువ.

ఈ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను మాత్రమే కలిగి ఉంటుంది. ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ అందించలేదు. కారు లోపల ఫీచర్స్ చాలా ఉన్నాయి. వైర్‌లెస్ సెల్ ఫోన్ ఛార్జర్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్, సేఫ్టీ కోసం 6 స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








