ఇంత మంచి కారును జనాలు పట్టించుకోవడం లేదు.. మీ బడ్జెట్‌లో వస్తుంది.. ఫీచర్లు ఫుల్!

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ఒకటి. ప్రారంభం నుంచే స్టైలిష్ లుక్, కాంపాక్ట్ సైజ్, ఫీచర్లతో నిండిన ఇంటీరియర్‌, నమ్మకమైన ఇంజిన్ పనితీరు వంటి అంశాలతో ఈ కారు వినియోగదారుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. కేవలం కుటుంబ అవసరాలకే కాకుండా, రోజువారీ ప్రయాణాలకు, నగర ట్రాఫిక్‌లో సులభంగా నడపగల కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. లుక్‌తో పాటు, ప్రాక్టికల్‌గా ఉపయోగపడే ఫీచర్లను అందించడం కూడా ఈ కారుకు పెద్ద ప్లస్ పాయింట్. గ్రాండ్ i10 నియోస్ భారత మార్కెట్లో ఒక ట్రైడ్ అండ్ టెస్టెడ్ కుటుంబ హ్యాచ్‌బ్యాక్‌గా తన స్థాయి, ప్రజాదరణ రెండింటినీ స్థిరంగా కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఈ కారుకు గత నెలలో తక్కువ డిమాండ్ వచ్చింది.

తాజాగా వచ్చిన అక్టోబర్ 2025 హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ అమ్మకాల గణాంకాలు ఈ కారుకు కొంత వెనుకంజ చూపిస్తున్నాయి. గత ఏడాది ఇదే నెలలో 6,235 యూనిట్లను విక్రయించిన హ్యుందాయ్, ఈ సంవత్సరం అక్టోబర్‌లో మాత్రం 5,426 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. అంటే కేవలం ఒక సంవత్సరంలోనే 809 యూనిట్ల తగ్గుదల కనిపించింది. ఈ తగ్గుదల మొత్తం అమ్మకాలపై సుమారు 13 శాతం నష్టంగా నిలిచింది.

Hyundai Grand I10 Nios October 2025 Sales Drop By 13 Percent

మార్కెట్లో పెరిగిన పోటీ, కొత్తగా లాంచ్ అవుతున్న మోడళ్లు, కొత్త అప్‌డేట్స్ కోసం కస్టమర్లు ఎదురుచూడటం వంటివి అమ్మకాలపై ప్రభావం చూపినట్టుగా కనిపిస్తుంది. ఒకప్పుడు తన సెగ్మెంట్‌లో అత్యంత పాపులర్‌గా నిలిచిన గ్రాండ్ i10 నియోస్, ప్రస్తుతం మాత్రం అమ్మకాల విషయంలో కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. రాబోయే నెలల్లో హ్యుందాయ్ ఏవైనా కొత్త అప్‌డేట్లు తీసుకురాకపోతే, ఈ తగ్గుదల ట్రెండ్ కొనసాగుతుందా లేక తిరిగి పుంజుకుంటుందా అన్నది చూడాలి.

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ధర-ఫీచర్ల పరంగా చూస్తే, తన సెగ్మెంట్‌లో ఇప్పటికీ ఒక మంచి ప్యాకేజ్‌గా కనిపిస్తుంది. భారత మార్కెట్లో ఈ కారు ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర రూ.5.47 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, మరింత ప్రీమియంగా ఫీచర్లతో కూడిన టాప్ వేరియంట్ రూ.7.92 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ధరల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకున్న కొనుగోలుదారులకే కాకుండా, ఫీచర్లపై దృష్టి పెట్టే యువతకు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.

Hyundai Grand I10 Nios October 2025 Sales Drop By 13 Percent

ఈ కారులో ప్రధానంగా చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, వెనుక పార్కింగ్ కెమెరా వంటి ఉపయోగకరమైన ఫీచర్లు రోజువారీ డ్రైవింగ్‌ను సులభతరం చేస్తాయి. అంతేకాదు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC) వంటి అడ్వాన్స్‌డ్ భద్రతా వ్యవస్థలు ఈ కారును మరింత నమ్మకంగా మారుస్తాయి. అదనంగా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించడం పెద్దప్లస్ అనుకోవచ్చు.

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ 1.2-లీటర్ కప్పా 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 83 bhp శక్తిని, 113.8 Nm టార్క్‌ను అందిస్తూ నగర ప్రయాణాలకు, హైవే క్రూజింగ్‌కి సరైన రెస్పాన్స్ ఇస్తుంది. గేర్‌బాక్స్ ఎంపికల్లో 5-స్పీడ్ మాన్యువల్, స్మార్ట్ ఆటో AMT అందుబాటులో ఉండటం వల్ల, వినియోగదారుల అవసరానుసారం డ్రైవింగ్ అనుభూతిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అదే మోడల్‌కి CNG వెర్షన్‌ను ఎంచుకుంటే పనితీరు విలువల్లో కొంత మార్పు కనిపిస్తుంది.

Hyundai Grand I10 Nios October 2025 Sales Drop By 13 Percent

CNG మోడ్‌లో ఈ హ్యాచ్‌బ్యాక్ 69 bhp పవర్, 95.2 Nm టార్క్‌ను అందిస్తుంది. అయితే ఆపరేటింగ్ ఖర్చులు తగ్గాలని ఆశించే వినియోగదారులకు ఇది మంచి ఆప్షన్‌గా మారుతుంది. పెట్రోల్ మాన్యువల్, ఆటోమేటిక్ మోడళ్లలో సుమారు 18 kmpl మైలేజ్ లభించగా, CNG వేరియంట్‌లో ఇది మరింత పెరిగి 27 km/kg ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ పరిధిలో ఇది ఒక బెస్ట్-ఎకానమికల్ ఆప్షన్‌గా నిలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, November 21, 2025, 15:02 [IST]
English summary
Hyundai grand i10 nios october 2025 sales drop by 13 percent
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+