కొత్త వేరియంట్లలో హ్యుందాయ్‌ ఐ10 నియోస్‌, వెర్నా, వెన్యూ కార్లు విడుదల.. ఇవి చాలా స్పెషల్‌ గురూ!

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన లైనప్‌లోని వెర్నా, వెన్యూ, గ్రాండ్ ఐ10 నియోస్‌ కార్లను కొత్త వేరియంట్లలో విడుదల చేసింది. ఈ మూడు హ్యుందాయ్‌ కార్లు ఇప్పటికే అందుబాటులో ఉన్న కొన్ని వెర్షన్లను అప్‌గ్రేడ్ చేసి తీసుకువచ్చింది. ఎంట్రీ లెవల్ కారు గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌లోని స్పోర్ట్స్ (ఓ) వేరియంట్‌ ఇప్పుడు కొత్త 1.2 లీటర్ల కప్పా పెట్రోల్‌ ఇంజిన్‌ మాన్యువల్‌తో పాటు AMT గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. దీని మాన్యువల్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధర రూ.7,72,300 కాగా, AMT వేరియంట్ ధర రూ.8,29,100 ఎక్స్‌షోరూమ్‌గా ఉంది.

ఈ గ్రాండ్ ఐ 10 నియోస్ కొత్త స్పోర్ట్స్ (ఓ) వేరియంట్‌లో ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ ప్లే 8-అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కలదు. దీంతో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సెటప్, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్‌ స్మార్ట్ కీ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. R15 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, క్రోమ్‌ ఫినిష్‌తో వచ్చే ఎక్స్‌టీరియర్ డోర్ హ్యాండిల్స్ కలవు.

Hyundai Grand i10 Nios New Variants

ఈ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ వేరియంట్‌ని మాన్యువల్, AMT వెర్షన్లతో పాటు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌తో అప్‌గ్రేడ్‌ ద్వారా చేసింది. ఈ గ్రాండ్ ఐ10 కార్పొరేట్ (మాన్యువల్) ధర రూ.7,09,100 కాగా, AMT వెర్షన్‌ ధర రూ.7,72,300 లుగా ఉంది.

హ్యుందాయ్ వెన్యూ: ఇందులోని SX ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ కప్పా 1.2 లీటర్ MPi పెట్రోల్‌తో వస్తుంది. దీని MT ధర రూ .10,79,300 ఎక్స్‌షోరూమ్‌గా ఉంది. ఇందులో స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ స్మార్ట్ కీ వంటి ఫీచర్లతో వస్తుంది.

Hyundai Venue New Variants

హ్యుందాయ్ వెన్యూ లైనప్‌లోని ఇతర వేరియంట్లను కూడా అప్‌గ్రేడ్ చేసింది. కప్పా 1.2 లీటర్ల MPi పెట్రోల్ S MT, S ప్లస్ MT వేరియంట్లు సైతం ఈ ఇంజిన్‌తో వస్తాయి. వీటిలో రియర్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్ వంటివి ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ.9,28,000, రూ.9,53,000 ఎక్స్‌షోరూమ్‌గా ఉన్నాయి.

ఇక వెన్యూలోని ఎస్ (ఓ) MT వేరియంట్ ఇప్పుడు కప్పా 1.2 లీటర్‌ MPi పెట్రోల్ ఇంజిన్‌తో పాటు స్మార్ట్ కీ ద్వారా పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్‌ ఆప్షన్‌ కలదు. ఇక నైట్ ఎడిషన్‌లో వైర్‌లెస్‌ ఛార్జర్‌ కలదు. ఈ వెన్యూ ఎస్(ఓ) MT ధర రూ.9,99,900 కాగా, నైట్ ఎడిషన్ ధర రూ.10,34,500 గా ఉంది.

Hyundai Verna New Variants

వెన్యూ ఎస్(ఓ)+ అడ్వెంచర్ MT వేరియంట్ కప్పా 1.2 లీటర్ల MPi పెట్రోల్‌తో పాటు స్మార్ట్ కీ ద్వారా పుష్ బటన్ స్టార్ట్/స్టాప్‌తో వస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జర్‌ని సైతం జోడించారు. దీని ధర రూ.10,36,700 ఎక్స్‌షోరూమ్‌గా ఉంది.

ఇక వెర్నాను రెండు కొత్త వేరియంట్లలో అప్‌గ్రేడ్‌ చేశారు. ఇందులోని S(O) వేరియంట్‌ 1.5 లీటర్ల టర్బో GDi పెట్రోల్ DCT, S IVT వేరియంట్‌ 1.5 MPi పెట్రోల్‌తో వస్తాయి. S IVT వేరియంట్‌లో iVT గేర్‌బాక్స్‌ ప్యాడిల్‌ షిఫ్టర్‌తో వస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ని పొందింది. వీటి ధరలు రూ .12,37,400 రూ. 15,26,900 మధ్య ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 8, 2025, 18:36 [IST]
English summary
Hyundai grand i10 nios venue and verna new variants price and features
Read more on: #hyundai #new variants #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+