భారతీయుల హృదయాలను గెలుచుకున్న హ్యుందాయ్ i10..ఏకంగా 3 మిలియన్ అమ్మకాలు

దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ ఇండియాలో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. ఒకప్పుడు కార్ అనగానే హ్యాచ్‌బ్యాక్‌ను ఊహించే రోజులు. మారుతీ సుజుకీ భారతదేశంలో అడుగుపెట్టిన వెంటనే, మధ్యతరగతి ప్రజలకూ కార్ల కలను సాకారం చేసే అవకాశాన్ని ఇచ్చింది. అంబాసిడర్, ప్రీమియర్ పద్మిని వంటి సెడాన్ కార్ల యుగం నుంచి ప్రజలు మారుతి 800 వంటి చిన్న, సరసమైన హ్యాచ్‌బ్యాక్‌లను తీసుకొచ్చింది. వీటికి బలమైన పోటీగా హ్యుందాయ్ శాంట్రోను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీంతో ఇండియాలో కొత్త శకాన్ని ప్రారంభించింది. చిన్న కారు అయినప్పటికి కూడా ఎక్కువ స్థలం, సౌకర్యవంతమైన సీటింగ్ కారణంగా ఇది విజయవంతమైన మోడల్‌గా నిలిచింది.

దీని తరవాత హ్యుందాయ్ మార్కెట్లోకి కొత్త కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను పరిచయం చేసింది, అదే హ్యుందాయ్ i10 (Hyundai i10). ఇది శాంట్రో కంటే మరింత ప్రీమియం అనుభూతిని కలిగిస్తూ, భారతీయ కస్టమర్లను ఆకట్టుకుంది. చిన్నదైన కూడా ఫీచర్ల పరంగా కూడా మెరుగుదల చూపిన ఈ కారుకు దేశీయగా ప్రజల నుంచి ఆదరణ బాగా పెరిగింది. i10 కూడా మార్కెట్లో హిట్ కావడంతో, హ్యుందాయ్ తన స్థానం మరింత బలోపేతం చేసుకుంది.

Hyundai Hatchback Model I10 3 million Sales

ఒకప్పుడు దేశంలో కొత్తదనంగా కనిపించిన ఈ దక్షిణ కొరియా సంస్థ, నేడు భారతదేశపు రెండవ అతిపెద్ద ఆటో తయారీదారుగా ఎదిగింది. మారుతున్న తరాలకు తగ్గట్టుగా, i10 మూడుసార్లు ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్ అవుతూనే ఉంది. అందుకే వినియోగదారులు కూడా ఈ కారును ప్రత్యేకతంగా అభిమానిస్తూనే ఉన్నారు. ఈ కారు ఇండియాలో మొదటిసారిగా 2007లో అడుగుపెట్టింది. అప్పటి నుంచి కస్టమర్లను పొందుతూనే ఉంది.

2007లో మొదటిసారి భారత మార్కెట్లో అడుగుపెట్టిన హ్యుందాయ్ i10, ఇప్పుడు 3.3 మిలియన్లకు పైగా గ్లోబల్ అమ్మకాల గుణాంకాన్ని అధిగమించింది. అందులో భారతదేశం కీలక పాత్ర పోషించింది. దాదాపు 2 మిలియన్లకు పైగా యూనిట్లు ఇక్కడే అమ్ముడయ్యాయి. మిగతా 1.3 మిలియన్ యూనిట్లను 140కు పైగా దేశాలకు విజయవంతంగా ఎగుమతి చేశారు. అంటే ఈ గణంకాలను చూసినట్లయితే ఇండియాలో ఈ కారు డిమాండ్ ఏ మేరకు ఉందో ఆశ్చర్యం కలిగిస్తుంది.

Hyundai I10

నివేదిక ప్రకారం, దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ వంటి మార్కెట్లు 'మేడ్ ఇన్ ఇండియా' హ్యుందాయ్ i10లకు ప్రధాన గమ్యస్థానాలుగా మారాయి. ఈ హ్యుందాయ్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం 18వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఇది మూడు తరలుగా అభివృద్ధి చెందింది. మొదటి i10, తర్వాత గ్రాండ్ i10, ఇప్పుడు గ్రాండ్ i10 నియోస్. ఈ చిన్న వాహనం భారతీయుల రోజువారి ప్రయాణంలో చాలా కీలకం అయింది.

ప్రస్తుతం హ్యుందాయ్ i10 మూడు రకాల ఇంజిన్‌లతో అందుబాటులో ఉంది, శక్తివంతమైన 1.2 లీటర్ కప్పా పెట్రోల్ మాన్యువల్, 1.2 లీటర్ కప్పా పెట్రోల్ AMT, 1.2 లీటర్ బై-ఫ్యూయల్ కప్పా CNG వెర్షన్. ఒకప్పుడు డీజిల్ వేరియంట్లో కూడా లభ్యమయ్యే ఈ వాహనం, BS-VI ఉద్గార నిబంధనలు వచ్చిన తర్వాత, పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్‌లపై దృష్టి సారించింది. హ్యుందాయ్ భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షకు పైగా యూనిట్లను విక్రయిస్తుంది.

Hyundai Hatchback Model I10

2007లో, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), కీలెస్ ఎంట్రీ వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్‌తో మొదలైన i10, కాలక్రమేణా భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మరింత అప్‌డేట్ అవుతూ అమ్మకాల్లో సరికొత్త మైలు రాయికి చేరుకుంది. మారుతున్న ట్రెండ్‌లకు అనుగుణంగా ప్రతి ఒక్క మోడల్‌లో కూడా ఆకట్టుకునే ఫీచర్స్‌ను అందించారు. దీని తరువాత కంపెనీ గ్రాండ్ i10 నియోస్‌ను తీసుకొచ్చింది.

2019లో దక్షిణ కొరియా దిగ్గజం తన ప్రస్తుత కొత్త రూపంతో భారత రోడ్లపైకి ప్రవేశించిన ఈ హ్యుందాయ్ మోడల్, చిన్న హ్యాచ్‌బ్యాక్ ప్రపంచంలో మరో మైలురాయిని సాధించింది. తాజాగా, గ్రాండ్ i10 నియోస్ తన మూడవ తరం అమ్మకాల్లో 4 లక్షల యూనిట్ల మార్క్‌ను అధిగమించి మరో ఘనతను సాధించింది. ఇది దేశీయంగా ఎరా, మాగ్నా, కార్పొరేట్, స్పోర్ట్స్, ఆస్టా అనే ఐదే వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Grand i10 Nios

ధర పరంగా చూస్తే, ఈ కాంపాక్ట్ రూ. 5.92 లక్షల ప్రారంభ ధర నుండి రూ. 8.56 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. గ్రాండ్ i10 నియోస్ 1.2 లీటర్ కప్పా 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 83 bhp పవర్, 113.8 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు స్మార్ట్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) ఆప్షన్‌ను జోడించారు.

CNG వేరియంట్ విషయానికి వస్తే, గ్రాండ్ i10 నియోస్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ మోడ్‌లో కేవలం 69 bhp పవర్, 95.2 Nm టార్క్‌ను అందిస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కొత్త లుక్‌లో, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగులను ప్రామాణికంగా అందిస్తూ, తన స్థాయిని మరో మెట్టు పెంచుకుంది. కారు లోపల డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి.

గ్రాండ్ i10 నియోస్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటివి ఉన్నాయి. మ్యూజిక్, మాప్‌లను టచ్ కంట్రలో ద్వారా ఆపరేటింగ్ చేయవచ్చు. వెనుక కూర్చున్న ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా Rear AC వెంట్స్ ఏర్పాటు చేశారు. దీంతో చల్లదనం వస్తుంది. దీనిలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది, వాతావరణానికి అనుగుణంగా ఆటోమేటిక్‌గా గాలి ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. వైర్‌లెస్ ఛార్జర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 29, 2025, 7:30 [IST]
English summary
Hyundai hatchback model i10 crossed 3 million sales milestone more details inside
Read more on: #hyundai #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+