ఇండియాలో నంబర్ 1.. ఈ కారు కోసం జనాలు ఎగబడ్డారు.. దేశంలో భారీ డిమాండ్ ఉన్న మోడల్

దక్షిణ కొరియా బ్రాండ్ హ్యుందాయ్ ఇండియాలో కూడా చాలా కార్లను విక్రయిస్తూ టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయారీదారులు బలమైన పోటీదారుగా నిలుస్తుంది. అమ్మకాల పరంగా ఈ కంపెనీ మెరుగైన గణంకాలను సాధిస్తూ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుంది. తాజాగా ఏప్రిల్ 2025లో, హ్యుందాయ్‌కి చెందిన క్రెటా (Hyundai Creta) భారత ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. వరుసగా రెండవ నెలలోనూ ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. అమ్మకాల నివేదిక ప్రకారం, ఏప్రిల్ 2025లో క్రెటా 17,016 యూనిట్లు అమ్ముడుపోయింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 10.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది భారత వినియోగదారుల్లో క్రెటా కోసం ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.

కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఇది బాగా సక్సెస్ అయింది. దీనికి ప్రధాన నిదర్శనం ఇటీవల కాలంలో జరిగిన అమ్మకాలే. జనవరి నుండి ఏప్రిల్ 2025 మధ్య క్రెటా 69,914 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. SUV సెగ్మెంట్లో హ్యుందాయ్ అగ్రస్థానాన్ని ఈ అమ్మకాలు మరింత బలోపేతం చేశాయి. ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా హ్యుందాయ్ విక్రయించిన వాహనాల్లో SUVలు 70.9 శాతం వాటా కలిగి ఉండడం విశేషం.

Hyundai India Creta Suv

దీని ద్వారా ఈ విభాగంలో హ్యుందాయ్ కు స్థానం స్పష్టంగా వెల్లడైంది. క్రెటా కారుకు ఉన్నటువంటి ఆకట్టుకునే డిజైన్, అధునాతన ఫీచర్స్, మంచి మైలేజ్, అందుబాటులో ధరలో లభించడం వలన కస్టమర్లు ఈ కారును అధికంగా కొనుగోలు చేశారు. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ విడుదల, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సంస్థకు మరో మైలురాయి. క్రెటా బ్రాండ్ బలమైన ఉనికిని మరింత శక్తివంతంగా నిలబెట్టింది.

ఈ కొత్త వేరియంట్ SUV విభాగంపై హ్యుందాయ్ దృష్టిని మరింత బలపరచడమే కాక, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి సంస్థ ఎంట్రీ బలాన్ని ఇచ్చింది. పెరుగుతున్న ఇంధన ధరలతో మెయింటనన్స్ ఎక్కువ అవుతందని భావిస్తున్న వారికి క్రెటా ఈవీ బెస్ట్ ఆప్షన్. అంతేకాక, వెన్యూ, ఎక్స్‌టర్, అల్కాజార్ వంటి మోడళ్ల అమ్మకాలు కూడా హ్యుందాయ్ బ్రాండ్ విజయాన్ని తెలియజేస్తున్నాయి.

Hyundai India Creta Suv Sales Tops In April 2025

భారతీయ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ SUVలు విభిన్న ఫీచర్స్ కోరుకునే కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ముఖ్యంగా క్రెటా కంపెనీ ఎస్‌యూవీ విభాగం అమ్మకాల్లో కీలకంగా నిలవబోతుంది. హ్యుందాయ్ క్రెటా, 10 సంవత్సరాల క్రితం మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి కూడా ఇది భారతీయ SUV విభాగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసింది. ఇది మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుు ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌డేట్ అవుతూ వస్తుంది.

అందుకే ఇన్నేళ్లు అయినప్పటికి కూడా ఈ క్రెటా కారుకు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. క్రెటా మూడు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ వేరియంట్, పెర్ఫార్మెన్స్‌ను కోరుకునే డ్రైవింగ్ కోసం 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్లకు అనుగుణంగా మ్యాన్యువల్, IVT, డ్యుయల్-క్లచ్ ఆటోమేటిక్ (DCT), టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వంటి వివిధ ట్రాన్స్‌మిషన్‌లను అందించారు.

Hyundai India Creta Suv Sales Tops

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, May 4, 2025, 7:30 [IST]
English summary
Hyundai india creta suv sales tops in april 2025 more details inside
Read more on: #hyundai #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+