5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కారుకు గుడ్‌బై! ఇండియాలో ఇది ఇక కనిపించదు!

హ్యుందాయ్ (Hyundai) భారత మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్రాండ్. చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి అత్యాధునిక ఎలక్ట్రిక్ SUVల వరకు ప్రతీ సెగ్మెంట్‌లో తన ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వచ్చింది. సాంట్రో, ఐ20, క్రెటా, వెర్నా, ఐఓనీక్వ్ 5 వంటి హిట్ మోడళ్లను వరుసగా అందిస్తూ, కొత్త ట్రెండ్స్‌కి అనుగుణంగా ప్రతి ఏడాది తన లైనప్‌ను అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ విజయవంతమైన ప్రస్థానంలో ఒక మోడల్ మాత్రం ఇండియన్ మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది, అదే హ్యుందాయ్ టక్సన్ (Hyundai Tucson). తాజాగా హ్యుందాయ్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్ నుండి టక్సన్ మోడల్‌ను నిశ్శబ్దంగా తొలగించడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా ఒక మోడల్ వెబ్‌సైట్‌లో కనిపించకపోతే, అది నిలిపివేయబడిందని అర్థం. ఇదే లాజిక్ ఇప్పుడు టక్సన్ విషయంలో వర్తిస్తోంది. 2022లో లాంచ్ చేసిన నాల్గవ తరం టక్సన్ గ్లోబల్ మార్కెట్లో మంచి గుర్తింపును పొందినా, భారతీయ వినియోగదారులలో మాత్రం అంతగా ప్రజాదరణ పొందలేదు. ఇది అత్యుత్తమ డిజైన్‌, ప్రీమియం క్వాలిటీ ఇంటీరియర్స్‌, బలమైన రోడ్ ప్రెజెన్స్, ఆధునిక టెక్నాలజీలతో వచ్చినా మార్కెట్లో ఆదరణ పొందలేదు.

Hyundai India Discontinues Tucson Suv Its Removed From Official Website

క్రెటా, సెల్టోస్ వంటి మోడళ్ల పోటీలో నిలబడటం టక్సన్‌కు కష్టంగా మారింది. ధర, తక్కువ ప్రమోషనల్ క్యాంపైన్‌లు, విపరీతమైన పోటీ కారణంగా దీని అమ్మకాలు చాలా పరిమిత స్థాయిలోనే నిలిచిపోయాయి. బహుశా ఇదే అంశం హ్యుందాయ్‌ను ఈ మోడల్ అమ్మకాలను నిలిపివేయడానికి దారి తీసినట్లుగా పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం హ్యుందాయ్ తన ఫోకస్‌ను ఎలక్ట్రిక్ వాహనాలు, కొత్త తరం SUVలు, పెరుగుతున్న డిమాండ్ ఉన్న మోడళ్ల వైపు మార్చుకుంటోంది.

ఈ నేపథ్యంలో టక్సన్‌ను తొలగించడం వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో పూర్తిగా కొత్త టక్సన్ తరం లేదా హైబ్రిడ్ వెర్షన్‌ను హ్యుందాయ్ మళ్లీ మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. టక్సన్ అమ్మకాల ప్రయాణం సంఖ్యల పరంగా చూస్తే పరిస్థితి మరింత స్పష్టంగా తెలుస్తుంది. 2022లో రూ.27.7 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ ప్రీమియం SUV, జీప్ కంపాస్ వంటి ప్రతిష్టాత్మక ప్రత్యర్థులతో పోటీ పడుతూ మార్కెట్లో అడుగుపెట్టింది.

Hyundai India Discontinues Tucson Suv Its Removed From Official Website

డిజైన్, స్పెసిఫికేషన్స్, ఫీచర్‌ల పరంగా మంచి రెస్పాన్స్ వచ్చినా, అమ్మకాల పనితీరు మాత్రం ఆశించిన స్థాయికి చేరలేదు. 2023లో 3,692 యూనిట్ల అమ్మకాలు నమోదు అయినప్పుడూ హ్యుందాయ్ కొంత ఊపిరి పీల్చుకుంది. కానీ ఈ ఊపు 2024లో గణనీయంగా తగ్గిపోయింది. అమ్మకాలు నేరుగా 58 శాతం పడిపోయి కేవలం 1,543 యూనిట్లకు చేరడం హ్యుందాయ్‌కు పెద్ద హెచ్చరికగా మారింది. ఇంకా 2025లో పరిస్థితి మరింత సంక్లిష్టతను సంతరించుకుంది.

ఈ ఏడాది ఇప్పటివరకు కంపెనీ కేవలం 650 టక్సన్ యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. లాంచ్ చేసిన నాటి నుండి ఇప్పటి వరకు టక్సన్ భారత మార్కెట్లో 4,000 యూనిట్ల వార్షిక అమ్మకాల మార్క్‌ను ఒక్కసారి కూడా దాటలేకపోవడం ముఖ్యాంశం. 2016 నుంచి 2024 వరకూ తొమ్మిది సంవత్సరాల కాలంలో టక్సన్‌కు వచ్చిన ఈ పరిమిత రెస్పాన్స్, ఈ కారును నిలిసివేయడానికి ఒక కారణం.

Hyundai India Discontinues Tucson Suv Its Removed From Official Website

టక్సన్ ధరలు చివరగా రూ. 27.70 లక్షల నుండి రూ. 32.87 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండేవి. వెర్నా తర్వాత 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన రెండవ మోడల్ కావడం దీని ప్రత్యేకతను మరింత పెంచింది. వేరియంట్ల విషయంలో కూడా టక్సన్ మంచి ఎంపికలను అందించింది. అయినప్పటికి మార్కెట్‌లోని ప్రత్యర్థులతో సమానంగా పోటీ పడటంలో ఇబ్బంది పడింది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 11, 2025, 16:36 [IST]
English summary
Hyundai india discontinues tucson suv its removed from official website
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+