హై ఎండ్ ఫీచర్స్ ఉన్న కూడా ఒక నెలలో కేవలం 24 మంది మాత్రమే ఈ కారును కొన్నారు.. ఎందుకు సేల్స్ పెరగట్లేదు..?

భారతదేశపు ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ఇప్పటికే పెట్రోల్, డీజిల్ విభాగాల్లో తన కార్లను విక్రయిస్తుంది. అయితే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఆ దిశగా అడుగులు వేస్తూ ఈవీ విభాగంలో కూడా తన కార్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా గతంలో ఐయోనిక్ 5(Ioniq 5) ఈవీ కారును తీసుకొచ్చింది. ప్రస్తుతం దీన్నే విక్రయిస్తుంది. ప్రపంచంతో పాటు భారత మార్కెట్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనే వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీంతో ఈ పరిశ్రమలో పోటీ ఎక్కువ అయింది. ఈ నేపథ్యంలో ఈవీ తయారీదారులు పోటీ పడుతూ మరి సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నారు. ఈ కొత్త 2025 ఏడాదిలో కూడా అధునాతన ఈవీలు రాబోతున్నాయి.

హ్యుందాయ్ కూడా జనవరి 17న ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో క్రెటా ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని చూస్తుంది. అయితే ఈ లాంచ్‌కు ముందు కంపెనీ తన ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు సేల్స్ వివరాలు వెల్లడించింది. డిసెంబర్ 2024లో ఈ కారును కేవలం 24 మంది మాత్రమే కొనుగోలు చేశారు. గత ఏడాదిలో ఆరు నెలల తరువాత ఇది రెండో అత్యల్ప విక్రయాలను నమోదు చేయడం గమనార్హం.

Hyundai Ioniq 5 Ev Car

2024 దసరా, దీపావళి సమయంలో ఆశించిన మేరకు సేల్స్‌ను నమోదు చేయగా, ఆ తరువాత తగ్గిపోయాయి. ఈ ఎస్‌యూవీ మోడల్ ధర రూ.46.05 లక్షలు(ఎక్స్-షోరూమ్). వినియోగదారులు ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించకపోవడానికి ప్రధాన కారణం దీని ధర ఎక్కువగా ఉండటం. ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి దీన్ని కొనడం కంటే, తక్కువ ధరలో మార్కెట్లో లభించే ఇతర మోడళ్లను కొనడం బెస్ట్ అని చాలా మంది అనుకుంటున్నారు.

ధర ఎక్కువగా ఉండటం వలన ఎవరు కొనుగోలు చేయడానికి ముందుకు రావటం లేదని గుర్తించిన కంపెనీ సేల్స్‌ను పెంచడానికి డిసెంబర్ నెలలో రూ. 2 లక్షల రాయితీ ఇచ్చారు. కనీసం ఈ తగ్గింపు ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని ఎవరైనా కొనడాటాకి వస్తారని అనుకున్నప్పటికీ అది అంతగా సక్సెస్ కాలేదు. 2024 డిసెంబర్ నెలలో కేవలం 24 మంది మాత్రమే ఈ కారును కొన్నారు.

Hyundai Ioniq 5 Sales Recorded 24 Units

ఐయోనిక్ 5 ధరను మరింత తగ్గించినట్లయితే కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. ఈ కారు గురించిన పూర్తి వివరాలు ఒక సారి చూద్దాం. ఇది ఎలక్ట్రిక్ suv. దీనిలో 5 మంది కలిసి ప్రయాణించవచ్చు. . ఇది 72.6kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. వెనుక చక్రాల ఎలక్ట్రిక్ మోటారు డ్రైవ్ సిస్టమ్‌‌తో రన్ అవుతుంది. ఈ మోటార్ 217hp పవర్‌ను, 350Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బ్యాటరీ పూర్తి ఛార్జ్‌తో ఏకంగా 631 కిమీల వరకు ప్రయాణిస్తుంది. ఇది 800W ఫాస్ట్ ఛార్జింగ్ అనుకూలంగా ఉంటుంది. దీంతో కేవలం 18 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్‌ అవుతుంది. కారు లోపల అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. 12.3-అంగుళాల స్క్రీన్‌లు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-అప్ డిస్‌ప్లే, ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ-కొలిజన్ యాంటీ-బ్రేక్‌, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉన్నాయి.

Hyundai Ioniq 5 December 2024 Sales

అదనపు రక్షణ కోసం నాలుగు డిస్క్ బ్రేక్‌లు, చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా, అధునాతన డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS),లేన్ కీప్ అసిస్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇది టైటాన్ గ్రే, ఆప్టిక్ వైట్, గ్రావిటీ గోల్డ్ మ్యాట్, మిడ్‌నైట్ బ్లాక్ పెర్ల్ వంటి పలు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 8, 2025, 14:00 [IST]
English summary
Hyundai ioniq 5 electric car december 2024 sales recorded at 24 units
Read more on: #hyundai #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+