కొత్త కారు కొనేవారు కాస్త ఆగండి! నెక్స్ట్ లెవల్ సైలెంట్ బీస్ట్ వచ్చేస్తుంది.. ప్రత్యర్థులకు పోటీ తప్పదు!

దక్షిణ కొరియా కంపెనీ హ్యుందాయ్ ఐసీఈ ఇంజిన్ ఆధారిత వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో Ioniq 5 (ఐయోనిక్ 5)ని తీసుకొచ్చింది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒకటిగా ఇప్పటికే భారత మార్కెట్‌లో తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కొత్త ఫీచర్స్‌తో ఫేస్‌లిఫ్ట్ రూపంలో తీసుకురాబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన స్పై ఫోటోలు ఆన్‌లైన్‌లో బాగా వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇప్పటికే అమ్మకానికి అందుబాటులో ఉండగా, భారత మార్కెట్‌లో ఇది ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో లభించే అవకాశం ఉంది. ఈ కొత్త కారును చూసినట్లయితే మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాత దానితో పోలిస్తే అదనంగా మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ ఇచ్చారు.

ముందుభాగంలో గాలి ఎంట్రీ కోసం గ్రీల్‌ను మరింత వెడల్పుగా రూపకల్పన చేయడం ద్వారా ఏరోడైనమిక్స్‌ను మెరుగుపరిచారు. ఇదే విధంగా, వెనుక భాగంలో బంపర్‌కు సరికొత్త డిజైన్ ఇచ్చారు. కొత్త అల్లాయ్ వీల్స్ మెరుగైన స్టైల్‌కి తోడుగా, డ్రైవింగ్ పనితీరులో మరింత స్థిరత్వాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి. ప్రత్యేకంగా గమనించాల్సింది, వెనుక భాగంలో పార్కింగ్ సెన్సార్లు ఇప్పటి మోడల్‌తో పోలిస్తే మరింత హైడెఫినిషన్‌గా మారినట్టు స్పష్టమవుతోంది.

Hyundai Ioniq 5 New

హ్యుందాయ్ Ioniq 5 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ టెక్నాలజీ పరంగా కొత్తగా ఉంటుంది. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అధునాతన ఆప్షన్లు దీనిలో ఉండబోతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో కంపెనీ అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాటిలో ప్రధానంగా మెరుగైన నావిగేషన్ సిస్టమ్, అత్యాధునిక గ్రాఫిక్స్‌తో కూడిన డిజిటల్ డిస్‌ప్లేలు, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌ల సౌకర్యాలు వంటివి ఉన్నాయి. లాగే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కూడా దీనిలో పొందవచ్చు.

ఈ ఫీచర్ల ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరింత సౌకర్యవంతంగా అనిపిస్తుంది. డ్రైవింగ్ అనుభూతిని కొత్తగా మార్చే మరో ముఖ్య అంశం, 3-స్పోక్ స్టీరింగ్ వీల్. ఇందులో చేర్చిన రెస్పాన్సివ్ పిక్సెల్ లైటింగ్, డ్రైవర్‌కు సౌకర్యంగా అనిపిస్తుంది. ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న Ioniq 5 కేవలం ఒకే ఒక్క వేరియంట్‌లో అందుబాటులో ఉంది, అది కూడా పూర్తిగా లోడ్ చేయబడిన ట్రిమ్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 46.05 లక్షలు.

Hyundai Ioniq 5 New Updated Model Spied On Testing Launch

ఇది E-GMP (Electric Global Modular Platform) పై రూపొందించబడిన హ్యుందాయ్ మొదటి మోడల్. ఈ ప్లాట్‌ఫామ్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల అవసరాల కోణంలో అభివృద్ధి చేయబడినది. Ioniq 5 ఫేస్‌లిఫ్ట్ పారామెట్రిక్ పిక్సెల్ LED హెడ్‌ల్యాంప్స్‌తో ఆకట్టుకుంటుంది. అలాగే, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, ముఖ్యమైన అంశం యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్ (AAF)గా కూడా ఉంది. ఇది గాలి ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తుంది.

ఇంటీరియర్‌ ఒక స్మార్ట్ లివింగ్ స్పేస్‌లా అనిపిస్తుంది. ఇందులో రెండు పెద్ద 12.3-అంగుళాల డిస్‌ప్లేలు అమర్చబడి ఉన్నాయి. ఒకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌కి, మరొకటి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 8-స్పీకర్ బోస్ ప్రీమియం ఆడియో సిస్టం, సేఫ్టీ కోసం లెవల్ 2 ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ను అందించారు.

Hyundai Ioniq 5 New Updated Model Spied On Testing

Ioniq 5 ఎలక్ట్రిక్ కారులో 72.6 kWh బ్యాటరీ ప్యాక్‌ అమర్చారు. ఇది 216 bhp పవర్, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వెనుక చక్రానికి పవర్ డెలివరీ చేయడానికి సింగిల్-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ సపోర్ట్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ARAI సైకిల్ ప్రకారం దాదాపు 631 కి.మీ దూరం ప్రయాణించగలదు. 350kW DC ఛార్జర్‌ని ఉపయోగించి బ్యాటరీని 18 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, May 8, 2025, 14:50 [IST]
English summary
Hyundai ioniq 5 new updated model spied on testing launch details are here
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+