హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపు.. ఇలాంటి ఛాన్స్ మిస్ కాకండి.. డిమాండ్ పెరగకముందే షోరూమ్‌కు పరిగెత్తండి
ఆటోమొబైల్ పరిశ్రమలో వాహన తయారీదారుల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. కొత్త కస్టమర్లను సాధించడమే లక్ష్యంగా పోటా పోటీగా లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. కంపెనీలు తమ సేల్స్‌ను పెంచుకుని వ్యాపారాన్ని విస్తరించడం కోసం అప్పడప్పుడు ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ను కూడా అందిస్తుంటాయి. తాజాగా ఇప్పుడు దక్షిణ కొరియా బ్రాండ్ హ్యుందాయ్ మోటార్స్(Hyundai Motors) ఇండియాలో కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి 'సూపర్ డిలైట్ మార్చ్(Super Delight Mmarch)' పేరిట ప్రత్యేక తగ్గింపు ప్రయోజనాలను అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా కొత్త కస్టమర్లు భారీగా పెరుగుతారని కంపెనీ భావిస్తోంది. దీనిలో భాగంగా భారీ ఎత్తున తగ్గింపులు, ప్రత్యేక బహుమతులు పొందుతారు. హ్యుందాయ్ అందిస్తున్న ప్రత్యేక తగ్గింపు ప్రయోజనాలు ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి.
హ్యుందాయ్ మోటార్స్ 'సూపర్ డిలైట్ మార్చ్' పేరుతో ఇస్తున్న తగ్గింపులు ఎంపిక చేసిన మోడళ్లపై ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్ వెన్యూ, i20, గ్రాండ్ i10 NIOS, ఎక్స్‌టర్‌లపై మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంది. కొత్తగా కారును కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నవారు హ్యుందాయ్ ఇస్తున్న ఈ తగ్గింపు ప్రయోజనాలను వినియోగించుకుని తక్కువ ధరలో కొత్త అధునాత కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు.

ముఖ్యంగా సూపర్ డిలైట్ మార్చ్ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే ఉంటుంది. అందుకే ఆలస్యం చేయకుండా కస్టమర్లు వెంటనే దగ్గరలోని హ్యుందాయ్ షోరూమ్‌ను సంప్రదించడం ఉత్తమం. పరిమిత కాలం ఆపర్ కాబట్టి తక్కువ ధరలో కారును సొంతం చేసుకోడానికి కస్టమర్లు భారీగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగతా వారి కంటే ముందుగా కంపెనీ డీలర్లను సంప్రదించి కొనుగోలు చేయడం బెస్ట్.
ఇక హ్యుందాయ్ అందిస్తున్న ఈ తగ్గింపు ప్రయోజనాలను ఒకసారి చూసినట్లయితే, కంపెనీ తన ప్రసిద్ధ మోడల్ వెన్యూ కారుపై గరిష్టంగా రూ.55,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు ఇస్తోంది. i20 హ్యాచ్‌బ్యాక్‌పై ఈ ఆఫర్‌లో భాగంగా రూ. 50,000 వరకు విలువైన ప్రయోజనాలు లభిస్తున్నాయి. గ్రాండ్ i10 NIOS విషయానికి వస్తే, దాదాపు రూ. 53,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎక్స్‌టర్‌పై రూ. 35,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు.
'సూపర్ డిలైట్ మార్చ్' పేరిట ప్రత్యేక తగ్గింపు ప్రయోజనాలను అందిస్తున్న హ్యుందాయ్ తన ఆఫర్‌ను అన్ని డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. మరో విషయం ఏమిటంటే, డీలర్లు కూడా ప్రత్యేకంగా నెలవారీ తగ్గింపులు ఇస్తున్నారు. అయితే దీని గురించి ముందుగా మీ దగ్గరలోని హ్యుందాయ్ డీలర్స్‌ను తెలుసుకోండి. ఎందుకంటే కొంతమంది నెలవారీ డీలర్ తగ్గింపులు ఇవ్వరు. అందుకే ముందస్తుగా తెలుసుకోవాలి.
హ్యుందాయ్ తన ప్రత్యేక తగ్గింపును కేవలం ఈ నాలుగు మోడళ్లకు మాత్రమే పరిమితం చేసింది. ప్రస్తుతం కంపెనీ భారతీయ మార్కెట్లో చాలా కార్లను విక్రయిస్తుంది. ఆరా, క్రెటా, వెర్నా, అల్కాజార్, టక్సన్ వంటి పలు మోడళ్లను అమ్ముతుంది. ఎలక్ట్రిక్ కార్లు ఐయోనిక్ 5, క్రెటా ఈవీ వంటి ఎలక్ట్రిక్ కార్లను కూడా విక్రయిస్తుంది. కానీ ఈ ఆఫర్ వీటికి అందించకుండా ఓన్లీ నాలుగు మోడళ్లకే అందిస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








