ఒకప్పుడు ఈ కారు కోసం షోరూమ్‌ల ముందు క్యూలైన్.. ఇప్పుడు మార్కెట్లో చోటు కోసం పోరాటం.. ఇంతకి ఆ మోడల్ ఏదంటే?
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ ఇండియాలో కూడా తన హవాను చూపిస్తుంది. పెరుగుతున్న పోటీ మార్కెట్లో కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడానికి గతంలో ఎక్స్‌టర్ కారును తీసుకొచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన అమ్మకాల వివరాలను వెల్లడించింది. కంపెనీ నుంచి వచ్చిన డేటా ప్రకారం, హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఏప్రిల్ 2025లో కేవలం 5,416 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే నెలలో (ఏప్రిల్ 2024) నమోదైన 7,756 యూనిట్లతో పోల్చితే దాదాపు 30 శాతం తగ్గుదల అంటే ఏడాది వ్యవధిలోనే ఈ మోడల్ భారీగా నష్టాన్ని చవిచూసింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ మార్కెట్లోకి వచ్చినప్పుడు, అది తక్కువ బడ్జెట్‌లో సరైన SUV అనిపించి వినియోగదారులను ఆకర్షించింది. ముఖ్యంగా టాటా పంచ్‌ను దీటుగా ఎదుర్కొంటుందనే అంచనాలు కూడా మొదట్లో చాలానే కనిపించాయి.
కానీ గత కొంతకాలంగా అమ్మకాల గణాంకాలు చూస్తే, ఎక్స్‌టర్ కాస్త వెనక్కి వెళ్లినట్లే స్పష్టంగా కనిపిస్తోంది. అది మాత్రమే కాదు, ఏడాది తేడా కాకుండా నెలవారీ గణాంకాలు చూసినా పరిస్థితి ఆశాజనకంగా లేదు. మార్చి 2025లో 5,901 యూనిట్లు అమ్ముడవగా, ఏప్రిల్‌లో ఆ సంఖ్య 5,416 యూనిట్లకు పడిపోయింది. అంటే కేవలం ఒక నెలలోనే 8.22 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి.

పోటీ, మారుతున్న కస్టమర్ అభిరుచులు, లేదా ఇతర మోడళ్లకు మెరుగైన ఫీచర్లు ఇవ్వడం కారణంగా ఈ కారుకు డిమాండ్ తగ్గింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్, తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లు అందించాలనే లక్ష్యంతో మార్కెట్లోకి వచ్చింది. చిన్న SUV సెగ్మెంట్‌లో ఇది వినియోగదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలవాలని ఉద్దేశించినా, అమ్మకాల పరంగా అనుకున్న స్థాయికి చేరలేకపోవడం హ్యుందాయ్ బ్రాండ్‌కు గట్టినే తిరుగుదెబ్బగా భావించవచ్చు.
ఎక్స్‌టర్ ప్రస్తుతం ఎనిమిది వేరియంట్లలో EX, EX (O), S, S (O), SX, SX (O), SX (O) Connect, Knight Editionలలో లభిస్తోంది. ధర విషయానికి వస్తే, రూ. 6.21 లక్షల నుంచి రూ. 10.51 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు అంటే, బడ్జెట్‌కు అనుకూలమైన ధరలోనే కొనుగోలు చేయడానికి లభిస్తుంది. టాప్-ఎండ్ ఫీచర్లు కోరుకునే వారు గానీ తమ అవసరానికి తగిన వేరియంట్ ఎంచుకునే అవకాశం ఉంది.

ఇంజిన్ పరంగా చూస్తే, ఈ కారు హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్‌తో ఒకే ప్లాట్‌ఫారమ్‌పై రూపుదిద్దుకుంది. ఇది 3,815 mm పొడవు, 1,710 mm వెడల్పు, 1,631 mm ఎత్తు, 2,450 mm వీల్‌బేస్ కలిగి ఉంది. అంతేగాక, 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉండటంతో, భారత రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా డ్రైవింగ్‌ను అందిస్తుంది. ఇది 1.2-లీటర్ కప్పా, నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.
ఇది స్మూత్ పెర్ఫార్మెన్స్‌తో పాటు మంచి మైలేజ్‌ను అందించగలదు. ఇందులో ఉన్న ఇంజిన్, రోజు ప్రయాణాలకు అవసరమైన శక్తిని అందించగలదు. ఇది 83 bhp పవర్, 114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది నగర ప్రయాణాల్లోనూ, హైవే డ్రైవింగ్‌లోనూ మంచి సామర్థ్యం కలిగినదిగా హ్యుందాయ్ పేర్కొంటుంది. ఈ పెట్రోల్ ఇంజిన్‌కు వినియోగదారుల అవసరాన్ని బట్టి రెండు గేర్‌బాక్స్ ఎంపికలతో జతచేశారు.

ఒకటి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, మరొకటి AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్). డ్రైవింగ్‌కి మరింత సౌలభ్యం కోరుకునే వారికి AMT అనుకూలంగా ఉంటే, కంట్రోల్ పట్ల ఆసక్తి ఉన్న వారికి మాన్యువల్ గేర్‌బాక్స్ మరింత సరిపోతుంది. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లకు 19.4 కి.మీ/లీటర్, AMT వేరియంట్లకు 19.2 కి.మీ/లీటర్ అందించగలదని హ్యుందాయ్ తెలిపింది. CNG వేరియంట్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications








