ఆ కార్ల కంపెనీకి కష్టకాలం! ఊహించని విధంగా ఎదురుదెబ్బ.. అసలు ఏం జరిగిందో తెలుసా?

భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించిన హ్యుందాయ్ (Hyundai) చాలా కాలంగా వినియోగదారుల మనసు గెలుచుకుంటూ వస్తోంది. సాధారణంగా, ఈ దక్షిణ కొరియా కార్ల బ్రాండ్ భారత మార్కెట్లో నెలకు కనీసం 50,000 కార్లను విక్రయిస్తూ స్థిరమైన స్థానం ఏర్పరచుకుంది. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి తయారీదారులకు బలమైన పోటీగా అధునాతన ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్‌తో కార్లను దేశీయ మార్కెట్లో విడుదల చేస్తుంది. తాజాగా ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2025 నెలలో హ్యుందాయ్ అమ్మకాలపై తీవ్రమైన ప్రభావం పడింది. ఏప్రిల్‌లో హ్యుందాయ్ భారతదేశంలో కేవలం 44,374 కార్లను మాత్రమే విక్రయించింది. ఇది సాధారణ అమ్మకాలతో పోలిస్తే గణనీయంగా తక్కువ.

గత సంవత్సరం ఇదే నెలలో, అంటే ఏప్రిల్ 2024లో 50,201 కార్లను విక్రయించి మెరుగైన గణంకాలను సాధించింది. దాంతో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌లో 5,827 కార్ల విక్రయాల్లో తగ్గుదల కనిపించింది. మార్కెట్లో మారుతున్న పోటీ, వినియోగదారుల అభిరుచుల మార్పులు, ఇతర కారణాలు ఈ విక్రయాల పడిపోయేందుకు కారణాలు కావచ్చు. సాధారణంగా నెలకు 50,000 కార్ల మార్క్‌ను అధిగమించే హ్యుందాయ్, ఈసారి దానికి చాలా తక్కువగా సేల్స్ నమోదు చేసింది.

Hyundai Motor April 2025 Car Sales In India

ఈ పరిస్థితి నేపథ్యంలో హ్యుందాయ్ తదుపరి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మార్కెట్లో తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకోవడానికి కంపెనీ కొత్త మోడళ్ల విడుదల, ఆఫర్ల ప్రకటనలు, లేదా వినియోగదారుల ఇష్టాలకు అనుగుణంగా మార్పులు చేయాల్సి ఉండొచ్చు. హ్యుందాయ్ మార్చి 2025లో దాదాపు 51,820 కార్లను విక్రయించింది. అంటే నెలవారీగా చూస్తే ఇది తగ్గుదల.

మార్చి 2025తో పోలిస్తే, ఏప్రిల్ 2025లో దేశీయంగా హ్యుందాయ్ విక్రయించిన కార్ల సంఖ్య 7,446 యూనిట్లు తగ్గింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ మార్కెట్లో కొంత తగ్గుదల ఎదుర్కొంటున్నా, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం తన అమ్మకాలతో మరింత ఎదుగుదలతో ఆకర్షణీయంగా నిలుస్తోంది. ఏప్రిల్ 2025 నెలలో హ్యుందాయ్ భారతదేశం నుండి మొత్తం 16,400 కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇది గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల.

car sales report

ఏప్రిల్ 2024లో కంపెనీ 13,500 కార్లను మాత్రమే ఎగుమతి చేయగా, ఈ ఏడాది అదే కాలంలో 2,900 కార్ల అధిక ఎగుమతులు జరిగాయి. ఇది శాతాల్లో చూస్తే దాదాపు 21.48 శాతం వృద్ధి. ఇంతకుముందు జనవరి నుంచి ఏప్రిల్ వరకు మొత్తం నాలుగు నెలల్లో హ్యుందాయ్ ఎగుమతులు కూడా మెరుగైన దిశగా ఉన్నాయని చెప్పవచ్చు. 2025లో ఆ నాలుగు నెలల్లో హ్యుందాయ్ ఎగుమతుల పరంగా 16.2 శాతం వృద్ధిని సాధించింది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) 2025 ఏప్రిల్ నెలలో తన మొత్తం కార్ల విక్రయాల్లో స్వల్ప తగ్గుదలను ఎదుర్కొంది. ఈ నెలలో కంపెనీ మొత్తం 60,774 కార్లను విక్రయించింది. అందులో 44,374 కార్లు భారతీయ మార్కెట్లో అమ్ముడవ్వగా, మిగిలిన 16,400 కార్లు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. ఏప్రిల్ 2024లో మొత్తంగా హ్యుందాయ్ 63,701 కార్లను విక్రయించింది.

Hyundai Motor April 2025 Car Sales

హ్యుందాయ్ దక్షిణ కొరియాలో స్థాపితమై, 1996లో భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించి, మూడు (30 ఏళ్లు) దశాబ్దాల పాటు విశ్వసనీయత, నాణ్యత, వినూత్నతతో భారత వినియోగదారుల మనసు గెలుచుకుంది. ఈ కాలంలో ఇప్పటివరకు భారతదేశంలో 9 మిలియన్లకుపైగా కార్లను విక్రయించింది. ఇది దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా హ్యుందాయ్ స్థిరమైన విజయాన్ని చాటుతుంది. దీని ప్రకారం, హ్యుందాయ్ ప్రతి సంవత్సరం భారత మార్కెట్లో సగటున 3 లక్షలకు పైగా కార్లను విక్రయిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, May 2, 2025, 7:30 [IST]
English summary
Hyundai motor april 2025 car sales report in india more details check here
Read more on: #hyundai #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+