విదేశాల్లో మన కార్లకు డిమండ్ మామూలుగా లేదు.. ఎంత మంది మేడ్ ఇన్ ఇండియా కార్లను కొన్నారో తెలుసా?
ఇండియా ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం చాలా దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ భారత్ మాత్రం ఎలాంటి ఢోకా లేకుండా ఇతర దేశాలకు అందనంత వేగంతో జీడీపీ వృద్ధిని సాధిస్తుంది. మన దేశీయ వాహన పరిశ్రమ అభివృద్ధికి చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. పెరుగుతున్న దేశ జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య పెరుగుతుంది. దీంతో దేశీయ కంపెనీలే కాకుండా అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన తయారీదారులు ఇండియాలో పెట్టుబడులపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు. కొత్తగా తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడే కార్లను ఉత్పత్తి చేసి వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇదే క్రమంలో రెండు దశాబ్దాల క్రితం ఇండియాలో అడుగుపెట్టిన విజయవంతమైన కార్ల తయారీదారుగా గుర్తింపు పొందిన హ్యుందాయ్ (Hyundai) భారత్ నుంచి ఇతర దేశాలకు ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల పరంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.
దక్షిణ కొరియా కంపెనీ దేశీయ మార్కెట్లో కార్లను హ్యుందాయ్ మోటార్ ఇండియా(HMIL) పేరిట విక్రయిస్తుంది. దేశీయంగా ఇక్కడి ప్రజలకు తన కార్లను విక్రయిస్తూనే, తనకు మంచి మార్కెట్ కలిగిన దేశాలకు రవాణా చేసి అక్కడి ప్రజలకు సైతం వాటిని కొనుగోలుకు అందుబాటులో ఉంచుతూ, తన వ్యాపారాన్ని భారీగా పెంచుకుంది. ప్రస్తుతం చాలా కార్ల తయారీదారులకు భారత్ అతిపెద్ద గమ్యస్థానంగా మారింది. లోకల్‌గా ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉంటుంది.

పైగా ఇక్కడి నుంచి సముద్రం లేదా వాయు మార్గాల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయడం అత్యంత సులభం కావడంతో చాలా వాహన తయారీదారులు భారత్‌లో ప్లాంట్‌లను ఓపెన్ చేస్తున్నారు. హ్యుందాయ్ విషయానికి వస్తే, 1999 నుంచి తనకు మంచి మార్కెట్ కలిగిన ప్రపంచ మార్కెట్తకు దాదాపు 3.7 మిలియన్ వాహనాలను ఎగుమతి చేసింది. ఈ స్థాయిలో రవాణా చేయడంతో కంపెనీ భారత్‌లో అతిపెద్ద ఎగుమతిదారుగా స్థానాన్ని సంపాదించుకుంది.
కంపెనీ ఇప్పటికే అంతర్జాతీయంగా 150కి పైగా దేశాలకు తన ఎగుమతులు జరిపింది. ప్రస్తుతం వచ్చిన డేటా ప్రకారం, తన కార్లను 60కి పైగా దేశాలకు సరఫరా చేస్తుంది. వీటిలో ముఖ్యంగా ఐ10 సిరీస్‌ను ఇండియా నుంచి ఎక్కువగా ఎగుమతి అయిన మోడల్‌గా నిలిచింది. దీని ఎగుమతులు దాదాపు 15 లక్షలు దాటడం గమనార్హం. అలాగే సెడాన్‌లో బాగా ప్రసిద్ధి చెందిన వెర్నా కారు ఎగుమతులు 5,00,000 యూనిట్లగా ఉన్నాయి.

అసల భారత్ నుంచి ఎగుమతులు ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించిన మోడల్ పేరు Hyundai Santro (హ్యుందాయ్ శాంత్రో). ఎగుమతులకు ఈ హ్యాచ్‌బ్యాక్‌తోనే పునాదాలు పడ్డాయి. మొత్తంగా కంపెనీ తన వాహనాలను భారతీయ వినియోగదారులకు అనుగుణంగా ఉండే విధంగా తయారు చేయడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్ కలిగిన దేశాల కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రూపొందిస్తుంది. హ్యుందాయ్ 2024లో దాదాపు 1,58,686 వాహనాలను ఎగుమతి చేసింది.
ప్రధానంగా దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, చిలీ, మెక్సికో, పెరూ వంటి దేశాల్లో హ్యుందాయ్ కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. మొత్తం ఆఫ్రికా దేశాలకు దాదాపు 10 లక్షల వాహనాలను రవాణ చేయడం జరిగింది. దీంతో ఎగుమతుల సంఖ్య భారీగా పెరిగింది. 25 ఏళ్లలో 3.7 మిలియన్లకు పైగా కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసిన హ్యుందాయ్ దేశీయ ఆర్థిక రంగం వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది.

భారత్‌లో తన తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కూడా అందిస్తుంది. ప్రస్తుతం కంపెనీ ఇక్కడి నుంచి దేశం వెలుపలకి ఎక్స్‌టర్, అల్కాజార్, i10, తన ప్రసిద్ధ మోడల్ క్రెటా వంటి వాటిని ఎగుమతి చేస్తుంది.


Click it and Unblock the Notifications








