MG-మహీంద్రాకు షాక్! పండుగ సీజన్‌కి ముందు పుంజుకున్న హ్యుందాయ్.. రెండో స్థానానికి దూసుకొచ్చింది
దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్, మహీంద్రా మధ్య సాగుతున్న ఆటో ఇండస్ట్రీలో రెండవ స్థానం పోటీ ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. భారతదేశపు టాప్ కార్ మేకర్‌గా మారే పోరులో, గత కొన్ని నెలలుగా మహీంద్రా తన సుస్థిర SUV అమ్మకాలతో రెండవ స్థానాన్ని బలంగా దక్కించుకుంది. ముఖ్యంగా XUV700, స్కార్పియో-ఎన్, థార్ వంటివి మార్కెట్‌లో భారీ క్రేజ్‌ను సృష్టించాయి. అయితే, జూలై 2025 అమ్మకాల గణాంకాలు వెలుగులోకి వచ్చిన తర్వాత పరిస్థితి కాస్త షాకింగ్‌గా మారింది. ఎప్పుడో ముందు ఉన్న హ్యుందాయ్ తిరిగి తన పాత బలాన్ని చూపించింది. జూలైలో హ్యుందాయ్ కంపెనీ భారతదేశవ్యాప్తంగా 43,972 యూనిట్ల రిటైల్ అమ్మకాలను నమోదు చేసింది. ఇది మహీంద్రాపై స్పష్టమైన ఆధిక్యం చూపించింది.
ఈ విజయంతో దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మళ్లీ రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది. వరుసగా SUVల మీద ఫోకస్ పెంచినా, మహీంద్రా ఈసారి హ్యుందాయ్ స్పీడును అందుకోలేకపోయింది. ఇది ఒక రకంగా ఆటో మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్‌ను గుర్తు చేస్తుంది. జూన్ నెలతో పోల్చితే, హ్యుందాయ్ జూలైలో మరోసారి తన మార్కెట్ ఫోకస్‌ను స్పష్టంగా చూపించింది. ఈ సారి మంచి వృద్ధిని నమోదు చేసింది.

హ్యుందాయ్ జూలై 2025లో 8 శాతం నెలవారీ వృద్ధిని సాధించింది. గమనించదగిన విషయం ఏమిటంటే, 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం మొత్తం (ఏప్రిల్-జూన్)లో మాత్రం మహీంద్రానే హ్యుందాయ్‌ను మించిపోయింది. మొదటి మూడు నెలల్లో మహీంద్రా స్పీడ్‌తో కార్లను విక్రయించగలిగింది. కానీ జూలై మాత్రం హ్యుందాయ్ ఆధిపత్యాన్ని చూపించేసింది. ఇకపై వరుసగా వచ్చే నెలలు హ్యుందాయ్ పెర్ఫార్మెన్స్‌ను ఎలా నిలబెట్టుకుంటుందో, తిరిగి మహీంద్రా తన పట్టును సాధిస్తుందా అనేది చూడాలి.
భారతదేశపు ప్యాసింజర్ వాహన రంగంలో ఇప్పుడు గట్టి పోటీ వాతావరణం నెలకొంది. రెండవ స్థానానికి ఎవరు అర్హులు అన్న దానిపై స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తోంది. హ్యుందాయ్ జూలై 2025లో మహీంద్రాను మించి రెండవ స్థానాన్ని ఆక్రమించగలిగినా, వార్షిక అమ్మకాలలో నమోదైన స్పష్టమైన పడిపోయే ధోరణి మాత్రం కంపెనీని కాస్త ఇబ్బంది పెడుతుంది. గత ఏడాది ఇదే జూలైతో పోలిస్తే హ్యూందాయ్ అమ్మకాలు 10.28 శాతం తగ్గింది.

2024 జూలైలో 49,013 కార్ల అమ్మకాలు నమోదుచేసింది హ్యుందాయ్. ఇది సాధారణంగా గమనించని తగ్గుదల కాదు. కంపెనీకి ఇది ఒక హెచ్చరికగానే చెప్పాలి. దేశీయంగా అలాగే అంతర్జాతీయంగా చేసిన మొత్తం ఎగుమతులు అన్ని కలిపి చూసినట్లయితే కంపెనీ జూలై 2025 అమ్మకాల పరంగా 60,073 యూనిట్లను విక్రయించింది. హ్యుందాయ్ జూలై 2025లో దేశీయ మార్కెట్‌ను మాత్రమే కాకుండా, ప్రపంచ మార్కెట్లను కూడా తమ దూకుడుతో ఆకర్షించింది.
భారతదేశం నుంచి మొత్తం 16,100 కార్లను అంతర్జాతీయంగా ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే నెలలో 15,550 కార్లు ఎగుమతయ్యాయి. అంటే ఈసారి 3.54 శాతం వృద్ధి నమోదైంది. ఇది చిన్న సంఖ్యలా అనిపించినా, ప్రపంచ వేదికపై కొరియన్ దిగ్గజం తన స్థిరత్వాన్ని చాటే సంకేతం. ప్రధానంగా మహీంద్రాతో గట్టి పోటీ తలెత్తుతున్న సందర్భంలో, ఈ ఎగుమతి వృద్ధి హ్యుందాయ్‌కు ఒక విజయంగా నిలిచింది.

హ్యుందాయ్ ప్రస్తుత మార్కెట్ దూకుడును నిలుపుకోవడంలో మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. వెన్యూ కాంపాక్ట్ SUV బ్రాండ్‌కు విజయాన్ని తీసుకువచ్చిన మోడల్ త్వరలోనే కొత్త తరం రూపంలో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ కొత్త వెర్షన్ విడుదల పండుగ సీజన్‌కు సరిపడేలా ప్లాన్ చేయబడినట్టు సమాచారం. వినాయక చవితి నుంచి దసరా, దీపావళి వరకు వచ్చే బిజీ షాపింగ్ సీజన్‌ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేయాలన్నదే కంపెనీ వ్యూహం.


Click it and Unblock the Notifications








