ఎగిరి గంతేసే ఆఫర్.. హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపు.. డిమాండ్ పెరగకముందే షోరూమ్‌కు పరిగెత్తండి
ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) భారత్‌లో కార్ల అమ్మకాల్లో దూసుకుపోతుంది. గత ఏడాది 2024లో కంపెనీ మెరుగైన సేల్స్ సాధించింది. అన్ని విభాగాల్లో కూడా అమ్మకాల పరంగా అదరగొట్టింది. చాలా కొత్త మోడళ్లను విడుదల చేసి ఎక్కువ మంది కొత్త కస్టమర్లకు చేరువ అయింది. ముఖ్యంగా పండుగల సమయంలో అయితే అంచనాల కంటే అత్యధిక సేల్స్‌ను నమోదు చేసి పాత ఏడాదికి ఘనంగా ముగింపు పలకగా, ఇప్పుడు కొత్త ఏడాదిలో కూడా సేల్స్ సంఖ్యలను మరింత పెంచడానికి కస్టమర్లను ఆకర్షించడానికి హ్యుందాయ్ అదిరిపోయే డిస్కౌంట్స్, ఆఫర్స్‌ను ప్రకటించింది. ప్రస్తుత జనవరిలో నెలలో పొంగల్, రిపబ్లిక్ డే వంటి పండుగలు ఉన్న నేపథ్యంలో ఇదే అవకాశంగా కంపెనీ తన కార్లపై భారీ తగ్గింపులు ఇస్తున్నట్లు పేర్కొంది. ఒక్కో మోడల్‌కు ఒక్కో విధమైన డిస్కౌంట్స్‌ను కంపెనీ ఇస్తుంది. ఆ వివరాలను క్రింది కథనంలో చూద్దాం.
కొత్త ఏడాది జనవరి 1 నుంచి కార్ల ధరలను పెంచినప్పటికీ, ధరలు పెరిగాయనే భావనతో కొత్త కస్టమర్లు తగ్గిపోతారని డిస్కౌంట్స్ పేరిట వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా హ్యూందాయ్ తన ఫేవరెట్ కారు ఐ20 (i20)పై దాదాపు రూ.65,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను ప్రకటించింది. ఇంత భారీ డిస్కౌంట్ 2024 మోడల్‌పై మాత్రమే వర్తిస్తుంది. దీనిలో రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, అదనంగా రూ.50,000 తగ్గింపు ఉంది.

అదే 2025 మోడల్‌పై మాత్రం 23,000 వరకు తగ్గింపు ఉంది. హ్యుందాయ్ 2024 మోడల్ ఎక్స్‌టర్ (exter)పై రూ.60,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. దీనిలో రూ.35,000 గరిష్ట తగ్గింపుతో పాటు రూ.15,000 వరకు కార్పొరేట్ బోనస్, రూ.15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ( grand i10 nios) మోడల్‌పై దాదాపు రూ.68,000 తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి.
అలాగే, ఆరా (aura) కారుపై రూ.43,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను కంపెనీ ఈ జనవరిలో నెలలో అందిస్తుంది. వీటిలో రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. 2024 మోడళ్లపై ఈ బోనస్ ప్రయోజనాలు ఉన్నాయి. అదే 2025 మోడల్‌పై మాత్రం రూ.10,000 క్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది. 2024 హ్యుందాయ్ వెన్యూ (Venue) కారుపై రూ.40,000 వరకు డిస్కౌంట్ ఉంది.

దీనికి అదనంగా పాత కారును మర్చుకుని ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో రూ.15,000 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. మొత్తంగా ఈ కారుపై రూ.55,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. అదే 2025 మోడల్‌పై మాత్రం రూ.25,000 వరకు డిస్కౌంట్‌ను హ్యుందాయ్ ఆఫర్ చేస్తుంది. ఇండియా పాపులర్ మోడల్ హ్యుందాయ్ వెర్నా (Verna)పై మాత్రం భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. 2024 మోడల్‌పై ఏకంగా రూ.75,000 ప్రయోజనాలు ఉన్నాయి.
దీనిలో రూ.35,000 గరిష్ట తగ్గింపు ఉండగా, రూ.20,000 కార్పొరేట్ బోనస్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి. అదే, 2025 మోడల్ విషయానికి వస్తే, తక్కువగా రూ.15,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అదనంగా రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ బోనస్ వంటివి ఉన్నాయి. మొత్తంగా కలిపి ఈ కారుపై దాదాపు రూ.30,000 తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. వెర్నా కారు మంచి డిమాండ్ ఉన్న మోడల్.

హ్యుందాయ్ టక్సన్ (Tucson) మోడల్‌పై రూ.45,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇది డీజిల్ వేరియంట్లపై మాత్రమే. దీనిలో రూ.ఎక్స్ఛేంజ్ బోనస్ 25,000, అదనంగా రూ.20,000 తగ్గింపు ఉంది. 2024 మోడల్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. 2025 కారుపై తగ్గింపు గురించి సమాచారం లేదు


Click it and Unblock the Notifications








