నెలకు రూ.25 వేలతో ఈ మంచి ఫ్యామిలీ కారును సొంతం చేసుకోండి.. ఫుల్ ట్యాంక్‌తో 900 కి.మీలు వెళ్తుంది
దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) ప్రతి ఏడాది కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ మెరుగైన సేల్స్‌ను సాధిస్తుంది. ఇతర కార్ల తయారీ దారులతో పోటీ పడుతూ, మార్కెట్లోకి అధునాతన ఫీచర్లతో కూడిన కార్లను లాంచ్ చేస్తుంది. హ్యుందాయ్ కార్లకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. ప్రధానంగా క్రెటా (Creta) కారు మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న మోడల్. లాంచ్ అయిన అనతి కాలంలోనే ఇది చాలా మంది కొత్త కస్టమర్లకు చేరుకుంది. దీని పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా పలు డీలర్‌షిప్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లో కూడా నగరంలోని పలు షోరూమ్‌లలో లభిస్తుంది. ప్రస్తుతం చాలా మంది కస్టమర్లు లోన్ సౌకర్యాన్ని ఎంచుకుంటున్నారు. వాయిదా పద్దతిలో చెల్లించడం ద్వారా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. క్రింది కథనంలో క్రెటా Onraod ధర, EMI వివరాలు అందించాము.
హైదరాబాద్ నగరంలో హ్యుందాయ్ క్రెటాపై ఉన్న ఈఎంఐల వివరాలను ఒకసారి తెలుసుకుందాం. హ్యుందాయ్ క్రెటా బేస్ వేరియంట్ E(పెట్రోల్) ఆన్‌రోడ్ ధర రూ.13.98 లక్షల వరకు ఉంది. దీనికి మొదటగా డౌన్‌పేమెంట్ రూ.2 లక్షల వరకు చెల్లించినట్లయితే దీనిపై రుణం రూ.11.98 లక్షల వరకు అందుతుంది.

ఈ అమౌంట్‌కు 5 ఏళ్ల కాలపరిమితికి 9.5 శాతం వడ్డీ చొప్పున నెలకు రూ.25 వేల వరకు EMI చెల్లించాల్సి ఉంటుంది. అదే క్రెటా EX(పెట్రోల్) వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.15.10 లక్షల పైనే ఉంటుంది. దీనికి మొదటగా రూ. 2 లక్షల వరకు డౌన్ పేమెంట్ చెల్లించినట్లయితే మిగిలిన అమౌంట్‌పై 5 ఏళ్ల కాలానికి 9.5 శాతం వడ్డీ చొప్పున నెలకు రూ.27 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
హ్యుందాయ్ క్రెటా S(పెట్రోల్) వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.16.60 లక్షల వరకు ఉంది. దీనికి రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించినట్లయితే మిగిలిన అమౌంట్‌పై 9.5 శాతం వడ్డీ చోప్పున 60 నెలలకు గాను ప్రతి నెలా రూ.30 వేల వరకు EMI చెల్లించాలి. ఈ కారుపై మొత్తంగా వడ్డీ రూ.3.79 లక్షల వరకు పడుతుంది. క్రెటా S(O) (పెట్రోల్) వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.17.85 లక్షల వరకు ఉంది.

దీనికి మొదటగా రూ.3 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించినట్లయితే మిగిలిన అమౌంట్‌పై 9.5 శాతం వడ్డీ చోప్పున 5 ఏళ్ల కాలానికి ప్రతి నెలా కూడా రూ.31 వేల EMI కట్టాల్సి ఉంటుంది. దీంతో అసలు ధర కంటే వడ్డీ మొత్త రూ.3.86 లక్షల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా అధునాతన ఫీచర్లతో నిండి ఉంటుంది.
హ్యుందాయ్ క్రెటా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రయాణికుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కుడా ఉన్నాయి. లోపల డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, చుట్టు ప్రక్కల చూడటానికి 360 డిగ్రీల కెమెరా ఉంది. ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ ఉంది.

అదనంగా EBDతో కూడిన ABS సిస్టం, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ (ADAS), ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ, మేము అందించిన ఆన్-రోడ్ ధర, ఆప్షన్ గురించిన వివరాలను అవగాహన కోసం అందించాం. కచ్చితమైన మరిన్ని వివరాల కోసం సమీపంలోని షోరూమ్‌ని సందర్శించండి.


Click it and Unblock the Notifications








