మోస్ట్ పాపులర్ ఐ20 కారులో కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఇక బడ్జెట్ కారు కావాలనుకునే వారికి ఎలాంటి ఢోకా లేదు

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన హ్యాచ్‌బ్యాక్ లైనప్‌‌ను మరింత విస్తరించడానికి సరికొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రసిద్ధ మోడల్ హ్యుందాయ్ i20కి కొనసాగింపుగా మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఇది చాలా అధునాతనమైనది, బడ్జెట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో విక్రయానికి సిద్ధంగా ఉంది. దీని ధర వచ్చేసి ఎక్స్-షోరూమ్ రూ. 7.51 లక్షలకు న్యూఢిల్లీలో లభిస్తోంది. టాప్-ఎండ్ వేరియంట్ అయిన 'స్పోర్ట్జ్'తో పోల్చితే, ఈ మాగ్నా ఎగ్జిక్యూటివ్ కొన్ని అదనపు ఫీచర్లతో వస్తోంది, ప్రత్యేకంగా ధర పరంగా మరింత సౌకర్యవంతంగా ఉండడం దీని ప్రత్యేకత.

కొత్త మాగ్నా ఎగ్జిక్యూటివ్ మోడల్‌ ఆకర్షణీయమైన ఫీచర్లతో మెరుగుపరచబడింది. ఇందులో పుష్ బటన్ స్టార్ట్, స్మార్ట్ కీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి, ఇవి ఇంతకు ముందు ఎక్కువగా టాప్ వేరియంట్లకు మాత్రమే పరిమితంగా ఉండేవి. మ్యూజిక్ ప్రియుల కోసం 7-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ అందించబడింది, ఇంటీరియర్‌లో ఆడియో అనుభవాన్ని పెంచుతుంది. అదనంగా, రూ. 15,000 చెల్లిస్తే, వినియోగదారులు 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పొందుతారు.

I20 Magna Executive

ఇంకా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వెనుక కెమెరా వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇది మాగ్నా ఎగ్జిక్యూటివ్‌ను స్మార్ట్, కనెక్టెడ్ కార్ ఎక్స్‌పీరియన్స్‌ను కోరుకునే వినియోగదారులకు సరైన ఆప్షన్‌గా నిలుపుతుంది. హ్యుందాయ్ తన మాగ్నా ట్రిమ్‌ను మరింత అభివృద్ధి చేసి, ఇంతవరకూ ఉన్న మాన్యువల్ గేర్‌బాక్స్‌కు అదనంగా ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (iVT) ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల డ్రైవింగ్ అనుభవం మరింత మృదువుగా, ఇంధన సామర్థ్యంగా మారుతుంది.

అంతేకాక, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఈ ట్రిమ్‌లో కారు లుక్‌ను మరింత ప్రీమియంగా మారుస్తుంది. కొత్త హ్యుందాయ్ i20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది, ఇది 82 bhp శక్తిని, 114.7 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, వినియోగదారుల ఎంపికకు అనుగుణంగా స్మూత్ CVT (Continuously Variable Transmission) ఆప్షన్‌లో కూడా అందిస్తున్నారు.

I20 Magna Executive Variant Airbgas

ఇది రోజు ప్రయాణాలకు సరిపడే శక్తి, సామర్థ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా, మైలేజ్, డ్రైవింగ్ పరంగా కూడా మంచి అనుభూతిని ఇస్తుంది. పవర్‌ట్రెయిన్‌ పరంగా ఆకట్టుకుంటూనే, భద్రత విషయాల్లో కూడా ఈ వేరియంట్ పట్టు విడిచే ప్రసక్తే లేదు. ప్రయాణికుల రక్షణ కోసం హ్యుందాయ్, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందించింది. ఇది ఈ సెగ్మెంట్‌లో ఎంతో కీలకమైన భద్రతా అంశం.

అలాగే, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), వాహనం నిలకడను పటిష్టంగా నిర్వహించే ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), డ్రైవింగ్ సమయంలో సపోర్ట్ కోసం VSM (వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్) వంటి ఫీచర్లను ఇందులో అందించారు. హ్యుందా య్ i20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లోపల ఐదు మందికి సరిపడే సీటింగ్ ఉంది, దీని వల్ల ప్రయాణికులు నగర ప్రయాణాల్లో అయినా, దూర ప్రాంతాల టూర్‌లలో ప్రయాణించవచ్చు.

I20 Magna Executive Variant Launched

దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే సమయంలో ప్రయాణికులు తమకు కావాల్సిన లగేజీని ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లడానికి 311 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది. వారాంతపు టూర్స్, సెలవు పూట కుటుంబ విహారయాత్రలు వంటి సందర్భాల్లో అవసరమయ్యే ట్రావెల్ బ్యాగ్‌లు, పెద్ద సరుకులను సౌకర్యంగా భద్రపరచవచ్చు. మొత్తంమీద, కొత్త హ్యుందాయ్ i20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్ విడుదల దేశీయ వినియోగదారులకు ఒక మంచి కారును కొనుగోలు చేయడానికి అవకాశం లభించినట్లయింది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 20, 2025, 10:02 [IST]
English summary
Hyundai new i20 magna executive variant launched in india here price design and all top things
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+