ఇంటిల్లిపాది కలిసి ప్రయాణించే పెద్ద ఎలక్ట్రిక్ కారు.. ఆటో ఎక్స్‌పోలో ఇంధ్రభవనంలా మెరిసిపోతుంది
దక్షిణ కొరియాకు చెందినటువంటి ప్రముఖ కార్ల తయారి కంపెనీ హ్యుందాయ్(Hyundai) భారత్‌లో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి వాహన తయారీ కంపెనీలకు గట్టి పోటీగా నిలుస్తుంది. దేశరాజధాని ఢిల్లీలో జనవరి 17 నుంచి ప్రారంభమైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 కార్యక్రమంలో హ్యుందాయ్ తన ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. తన ఫేవరెట్ మోడల్ క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన కంపెనీ దీంతో పాటు ఐయోనిక్ 9 (Ioniq 9) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా ఆవిష్కరించింది. ప్రస్తుతానికి మాత్రం ఈ కారు ఇండియా మార్కెట్లో తీసుకురావడానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దీనిని అంతర్జాతీయంగా ఉత్తర అమెరికా, దక్షిణ కొరియా మార్కెట్లో మాత్రం మొదట అమ్మకానికి అందుబాటులో ఉంచుతారు. ఆ తరువాత ఇండియాలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. హ్యుందాయ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంచి మార్కెట్ ఉంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో వాహన తయారీదారులు సాంప్రదాయ ఇంధన మోడళ్లను విడుదల చేస్తూనే, అదే సమయంలో ఈవీలపై కూడా దృష్టి పెట్టారు. ఈవీ మార్కెట్లో చాలా కాలంగా తన వాటాను పెంచుకోవడానికి హ్యుందాయ్ తీవ్రంగా కృషి చేస్తుంది. అందులో భాగంగా ఐయోనిక్ 9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తిసుకొచ్చింది. ఈ మోడల్ రాకతో ఈవీ వాటా మరింత విస్తరిస్తుందని కంపెనీ భారీ ఆశలు పెట్టుకుంది.

హ్యుందాయ్ ఐయోనిక్ 9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 110.3kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనిలో లాంగ్ రేంజ్ AWD వేరియంట్ ప్రధానంగా 95 bhp పవర్, 255 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6.7 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని చేరుకుంటుంది. ఇది టెర్రైన్ ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ టార్క్ వెక్టరింగ్, లాటరల్ విండ్ స్టెబిలిటీ పలు ఫీచర్లను పొందుతుంది.
లాంగ్ రేంజ్ RWD మోడల్ 218 bhp పవర్, 350 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది కేవలం 9.4 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. దీనిలో రియర్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. ఐయోనిక్ 9 లో 110.3kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, WLTP సైకిల్‌లో 620 కి.మీల రేంజ్ అందిస్తుంది.

మొదటగా అంతర్జాతీయ మార్కెట్లో విడుదల అవుతున్న ఐయోనిక్ 9 ఎలక్ట్రిక్ కారు 6, 7 సీట్ల ఆప్షన్లతో కొనుగోలుకు ఉంటుంది. ముందు ఉన్న సీట్లు మసాజ్ ఫంక్షన్‌తో వస్తాయి. మధ్యలో ఉన్న సీట్లు స్థిరంగా ఉండనున్నాయి. తరువాత మూడో వరుసలో ఉన్న సీట్లు తిప్పుకునే విధంగా కంఫర్ట్‌గా ఉంటాయి. కారు పొడుగ్గా రెండు కుటుంబాలకు సరిపోయే విధంగా ఉంటుంది. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.
కారు లోపల డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. లోపల క్యాబిన్‌లో 12-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రూఫ్ మౌంటెడ్ AC, పనోరమిక్ సన్‌రూఫ్, సేఫ్టీ కోసం ADAS సూట్, చుట్టు ప్రక్కల చూడటానికి కెమెరా, 10 ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్‌లు వంటివి ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం మా డ్రైవ్‌స్పార్క్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








