ఫుల్ ట్యాంక్‌తో 1,015 కి.మీలు! ఒక్కసారి చూస్తే చూపు మళ్లదు.. కొత్త హైబ్రిడ్ SUV లుక్ చూసి లవ్‌లో పడిపోతారు
దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు అయినటువంటి హ్యుందాయ్ (Hyundai) భారత మార్కెట్లో తన వాటాను మరింత పెంచుకొవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా గత కొంత కాలంగా అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హ్యుందాయ్ పాలిసేడ్ (palisade) SUVని భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఇది ఒక హైబ్రిడ్ మోడల్. దీనిని స్టైల్, టెక్నాలజీ, పనితీరు అంశాల్లో ఫార్చ్యూనర్‌ను సూటిగా లక్ష్యంగా చేసుకొని రూపొందించబడినట్టే కనిపిస్తోంది. ఫోర్డ్ ఎండీవర్ భారత మార్కెట్ నుంచి తప్పుకున్నప్పటి నుంచి, ఫుల్-సైజ్ SUV విభాగంలో టయోటా ఫార్చ్యూనర్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఈ విభాగంలో జీప్ మెరిడియన్, MG గ్లోస్టర్, స్కోడా కోడియాక్ మోడళ్లు అమ్మకాలను పెంచుకోవాలని చూసినప్పటికి అవి ఫార్చ్యూనర్‌కి తగిన స్థాయిలో పోటీ ఇవ్వడంలో విఫలమయ్యాయి.
కానీ ఇప్పుడు, దీన్ని భర్తీ చేయడానికి దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ ముందుకొస్తోంది. పాలిసేడ్ గ్లోబల్ మార్కెట్లలో ఇప్పటికే మంచి పేరును సంపాదించుకుంది. దాంతో, దీన్ని భారత మార్కెట్లోకి లాంచ్ చేసి మరింత మంది కొత్త కస్టమర్లను సంపాదించడానికి వీలవుతుంది. టయోటా ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేయడమే కాకుండా, హ్యుందాయ్ తన బ్రాండ్‌కి కొత్త ఊపునిచ్చే ఉద్దేశంతో పాలిసేడ్ రాబోతుంది. ముఖ్యంగా, మహీంద్రా, టాటాకి బలమైన పోటీ ఇవ్వనుంది.

మహీంద్రా, టాటా వంటి స్వదేశీ ఆటోమేకర్లు మార్కెట్లో రెండు, మూడు స్థానాల్లో దూసుకుపోతున్న ఈ సమయంలో, హ్యుందాయ్ తిరిగి తన రెండవ స్థానాన్ని సాధించాలన్న తపనతో మంచి స్ట్రాటజీ అమలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. పాలిసేడ్ లాంటి ప్రీమియమ్ SUVని పరిచయం చేయడం ద్వారా, కంపెనీ తన ఉత్పత్తులను మరింతగా విస్తరించడమే కాకుండా, భారత వినియోగదారుల అభిరుచులకు తగిన అత్యాధునిక వాహనాలను అందించాలన్న దిశగా అడుగులు వేస్తోంది.
హ్యుందాయ్ భారత్‌లో తన మార్కెట్ వాటాను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. 2030 నాటికి దేశీయ మార్కెట్ కోసం మొత్తం 26 కొత్త మోడళ్లను పరిచయం చేయాలన్న ప్రయత్నంలో భాగంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించబడుతున్న పాలిసేడ్ SUV కూడా ఆ జాబితాలో భాగమవుతోంది. ఇది కేవలం మరో SUV కాదని, భారత మార్కెట్లో ప్రీమియం ఫుల్-సైజ్ SUV సెగ్మెంట్లో ఒక కొత్త ఒరవడి సృష్టించగలదని చెప్పొచ్చు.

గత సంవత్సరం అంతర్జాతీయంగా ప్రారంభమైన పాలిసేడ్ కొత్త తరం మన దేశ రోడ్లపైకి అడుగుపెట్టనుందని సమాచారం. ఇది నేరుగా రేంజ్ రోవర్ స్థాయి కార్లను కూడా ఢీకొట్టేలా రూపుదిద్దుకుంది. పాలిసేడ్ హైబ్రిడ్ వేరియంట్‌కు సంబంధించి టెక్నికల్ అంశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇది 2.5-లీటర్ 4-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో అందించబడుతుంది. ఫ్రంట్-వీల్ డ్రైవ్ మెకానిజంతో కూడిన కారు, దాదాపు 334 bhp పవర్‌తో పాటు 460 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పని చేస్తుంది. ఐచ్ఛికంగా ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ను కూడా అందించవచ్చని హ్యుందాయ్ సూచిస్తోంది. ఇంత శక్తివంతమైన పనితీరుతో కూడిన SUV అయినప్పటికీ, ఇది 14.1 kmpl మైలేజీని అందించగలదని మార్కెట్ వర్గాల సమాచారం. ఈ కారులో చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉండనున్నాయి. ఇది డ్యాష్‌బోర్డ్ 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో కూడిన డ్యూయల్-స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉంటుంది.

ఈ SUVలో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ స్లాట్, పెద్ద ఆర్మ్‌రెస్ట్, టూర్లకు వెళ్లడానికి అనుకూలంగా ఉండేలా మంచి బూట్ స్పెస్ కూడా ఉంది. అదనంగా సెంటర్ కన్సోల్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇది 360-డిగ్రీ కెమెరా, వెనుక పార్కింగ్ కెమెరా, 14-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, వెహికల్-టు-లోడ్ (V2L) వంటివి కూడా ఈ కారులో ఉంటాయి.
పాలిసేడ్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ తో 1,015 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఈ SUV కి మూడు డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. దీనిని స్థానికంగా తయారు చేయాలని ప్రణాళిక చేయబడినందున, పాలిసేడ్ ధర సుమారు రూ. 50 లక్షలు ఎక్స్-షోరూమ్ ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








