మారుతీకి సరైన బ్రహ్మాస్త్రం దింపుతున్న హ్యుందాయ్.. నెక్స్ట్ లెవల్ టెక్నాలజీతో మధ్యతరగతి వారికి సూపర్ కారు!
దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ (Hyundai) భారత ఆటోమొబైల్ రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.ఒకప్పుడు మారుతీ సుజుకీ తర్వాత రెండవ అతిపెద్ద కార్ల తయారీదారుగా నిలిచిన ఈ కంపెనీ ఇటీవల మహీంద్రా చేతి నుండి ఆ స్థానాన్ని కోల్పోయినప్పటికీ, దాన్ని తిరిగి సాధించాలన్న దృఢ సంకల్పంతో ముందుకెళుతోంది. మార్కెట్లో తన స్ధానాన్ని బలోపేతం చేసేందుకు, హ్యుందాయ్ భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మోడళ్లను విస్తరిస్తోంది. ఈ ప్రణాళికలలో భాగంగా, పెద్ద SUV మోడళ్లను, ముఖ్యంగా పాలిసేడ్ వంటి ప్రీమియం వేరియంట్లను భారత్‌కి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో సంస్థ పనిచేస్తోంది. పాలిసేడ్ ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన మోడల్. దీని లగ్జరీ, ఫీచర్లు, డ్రైవింగ్ కంఫర్ట్ అన్నీ భారత మార్కెట్‌లో ఉన్న SUV లకు గట్టి పోటీగా నిలవగలవు.
దీన్ని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తుంది. అంతేకాదు, మారుతీ ఫ్రాంక్స్ వంటివి ఆక్రమిస్తున్న కాంపాక్ట్ SUV విభాగాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకుంది హ్యుందాయ్. ఇందులో భాగంగా, బయోన్ (bayon) అనే కొత్త SUV ని తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఈ మోడల్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్స్‌లో బాగా ప్రసిద్ది చెందింది. వాస్తవానికి, బయోన్ అనేది హ్యుందాయ్ i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించబడిన మోడల్.

ఇది భారతీయ మార్కెట్‌లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV మోడల్‌కి మారిన మారుతీ బాలెనో-ఫ్రాంక్స్ తరం వ్యూహాన్ని తలపిస్తుంది. హ్యుందాయ్ బయోన్ మోడల్‌తో, SUV విభాగంలో మరింత పోటీని ఇవ్వనుంది. నెక్స్ట్ జనరేషన్ డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్లను కలిగి ఉండే బయోన్, వచ్చే ఏడాది భారత్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది విజయవంతమైతే, హ్యుందాయ్ మళ్లీ రెండవ స్థానాన్ని తిరిగి పొందే అవకాశాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి.
ఈ కొత్త కారుకి శక్తినివ్వడం కోసం హ్యుందాయ్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌పై పని చేస్తోంది. ఇంజిన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న 1.0 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్‌కు మించేదిగా ఉండనుంది. ముఖ్యంగా, పెరిగిన టార్క్ ఉత్పత్తి , మెరుగైన డ్రైవింగ్ అనుభవం వంటి అంశాలలో ఇది ఎంతో శక్తివంతంగా ఉండబోతోంది. కొత్త ఇంజిన్‌కి హైఎండ్ ఫీచర్లు, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ కూడా తోడు కానుంది.

దీనిని భారత మార్కెట్లో మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే విధంగా హైబ్రిడ్, కాంపాక్ట్ మోడళ్లకు, బలమైన పోటీ ఇచ్చేలా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. హ్యుందాయ్ భారత్‌కి తీసుకురానున్న కాంపాక్ట్ SUV బయోన్ టెక్నాలజీ పరంగా కూడా ఒక కొత్త ప్రమాణాన్ని స్థాపించబోతోంది. ముఖ్యంగా, ఇది భారతదేశంలో రాబోయే CAFÉ 3, BS7 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి చేయబడుతోంది.
బయోన్ డిజైన్‌లో హ్యుందాయ్ వెర్నా ప్రభావం కనిపిస్తుంది. ముందుభాగంలో బోనెట్‌పై నిలువగా అమర్చిన LED డేలైట్ రన్నింగ్ లైట్స్ (DRLs), అలాగే వాటి కింద కోణీయంగా అమర్చిన ప్రధాన హెడ్‌లైట్ యూనిట్లు గల స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉన్నాయి. ఇది కారుకి లేటెస్ట్ లుక్, గంభీరతను పెంచుతుంది. 17-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, బాడీపై కట్స్, క్రీజ్‌ల రూపంలో డైనమిక్ లైన్లు, స్పోర్టీ, యంగ్ లుక్‌ను అందిస్తాయి.

ఈ కారులో HVAC కంట్రోల్ ప్యానెల్ స్మార్ట్‌గా, టచ్ లేదా హఫ్టిక్స్ ఆధారంగా పని చేసేలా ఉండొచ్చు. ఇది వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ ప్యాడ్ సహా, ఫాస్ట్ ఛార్జింగ్ USB టైప్-C పోర్ట్‌లు ప్రయాణంలో ఉన్న స్మార్ట్ డివైస్‌లకు నిరంతర ఛార్జింగ్ సౌలభ్యం కలిగిస్తాయి. కనెక్టెడ్ కార్ టెక్నాలజీలో భాగంగా, ఈ కారు Bluelink వంటి ప్లాట్‌ఫామ్ ఆధారంగా పనిచేసే ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లు అందుకోగలదు.
లోపల యాంబియంట్ లైటింగ్ ఒక ప్రీమియం టచ్‌తో వెలిగిస్తుంది. ఇది డ్రైవింగ్ అనుభూతిని మరింత సౌకర్యంగా, అర్బన్ క్లాస్ లాగా అనిపించేలా చేస్తుంది. ఈసారి హ్యుందాయ్ 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌ను అందించనుందని సమాచారం. భద్రత పరంగా, బయోన్‌లో ADAS (Advanced Driver Assistance Systems), ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








