ఏకంగా ఆ కారుపై రూ.1.73 లక్షల తగ్గింపు.. డిమాండ్ పెరగకముందే షోరూమ్‌కు పరిగెత్తండి
పండుగల సీజన్ అంటే మన దేశంలో కొత్త వాహనాల కొనుగోళ్లకు అద్భుతమైన సమయం. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు కొత్త కార్ లేదా బైక్ తీసుకురావాలని ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా నవరాత్రి, దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో ఆటోమొబైల్ షోరూమ్‌లు కస్టమర్లతో కిక్కిరిసిపోతాయి. GST మినహాయింపులు, బ్యాంకుల తక్కువ వడ్డీ రేట్లు, కంపెనీల ప్రత్యేక పండుగ ఆఫర్లతో ఈ కాలం వాహన మార్కెట్‌కి బంగారు కాలం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యూందాయ్ మోటార్స్ ఇండియా వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీకి అత్యధికంగా అమ్ముడైన సబ్‌కాంపాక్ట్ SUV మోడల్ అయిన హ్యూందాయ్ వెన్యూ (Hyundai Venue)పై ఇప్పుడు రూ.1.73 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
కానీ చాలా మంది వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు, ఇంతటి ప్రసిద్ధ మోడల్‌పై ఇంత భారీ ఆఫర్ ఎందుకు? అసలు కారణం సులభమే. హ్యూందాయ్ త్వరలో వెన్యూ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త వెర్షన్ మార్కెట్లోకి రాకముందు పాత స్టాక్‌ను వేగంగా క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో కంపెనీ ఈ డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీని ద్వారా షోరూమ్‌లలో ఉన్న ప్రస్తుత వెన్యూ వాహనాలు త్వరగా అమ్ముడవుతాయి.

అలాగే వినియోగదారులు కూడా తమకు ఇష్టమైన SUVని తక్కువ ధరకు సొంతం చేసుకునే అవకాశం పొందుతారు. ఇక పండుగ వాతావరణం మధ్య ఇంత భారీ ఆఫర్ రావడంతో వినియోగదారులు షోరూమ్‌లకు పరుగులు తీయడం ఖాయం. వెన్యూ మోడల్ ఇప్పటికే తన స్టైలిష్ లుక్‌తో ప్రజాదరణ పొందిన SUV. ఈ ఆఫర్‌తో అది మరింత ఆకర్షణీయంగా మారింది. ఇప్పుడు హ్యూందాయ్ వెన్యూ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఓ గోల్డెన్ ఛాన్స్.
తగ్గింపు వివరాలను చూసినట్లయితే, హ్యూందాయ్ వెన్యూపై ప్రకటించిన ఈ భారీ ఆఫర్ వివరాల్లోకి వెళ్తే కంపెనీ దాదాపు ప్రతి వేరియంట్‌పై కూడా గణనీయమైన తగ్గింపును అందిస్తోంది. సాధారణంగా SUV మార్కెట్‌లో వెన్యూ బేస్ వేరియంట్‌నే ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. ఈ బేస్ మోడల్ పెట్రోల్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.7.94 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కానీ ఆఫర్ కింద ఈ ధరను హ్యూందాయ్ రూ.7.26 లక్షలకు తగ్గించింది.

అంటే కస్టమర్లు దాదాపు రూ.68 వేల వరకు నేరుగా ఆదా చేసుకోవచ్చు. ఇక లగ్జరీ ఫీచర్లతో కూడిన టాప్-ఎండ్ SX(O) డ్యూయల్-టోన్ వేరియంట్ విషయానికి వస్తే, ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. దీని పాత ధర రూ.13.62 లక్షలు కాగా, ఆఫర్ ధర రూ.12.46 లక్షలుగా ఉంది. అంటే ఇక్కడ కూడా దాదాపు రూ.1.16 లక్షల భారీ తగ్గింపు లభిస్తోంది.
అంతేకాదు, స్పోర్టీ డిజైన్,ప్రత్యేక లుక్స్‌తో యువతను ఎక్కువగా ఆకట్టుకున్న N లైన్ వెన్యూ మోడల్ కూడా ఈ సారి ఆఫర్‌లో భాగమైంది. N లైన్ డ్యూయల్-టోన్ వేరియంట్ ధర రూ.13.18 లక్షల నుండి రూ.12.09 లక్షలకు తగ్గించబడింది. అంటే ఇక్కడ కూడా దాదాపు రూ.1.09 లక్షల తగ్గింపు వినియోగదారులకు లభిస్తోంది. ఇక డీజిల్ వేరియంట్లను పరిశీలిస్తే, హ్యూందాయ్ వీటిపై కూడా ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది.

డీజిల్ వెన్యూ మోడళ్లపై గరిష్ఠంగా రూ.1.34 లక్షల వరకు ఆఫర్ అందిస్తోంది. ఇది డీజిల్ వాహనాలను ప్రాధాన్యంగా తీసుకునే వినియోగదారులకు మరింత లాభదాయకం. దాదాపుగా 24 కి.మీ మైలేజ్‌తో, డజన్ల కొద్ది ఫీచర్స్‌తో ఇది ఆకట్టుకుంటుంది. కంపెనీ ఇస్తున్న తగ్గింపు ఆఫర్ ద్వారా వినియోగదారులకు తక్కువ ధరలోనే మంచి కారును తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు.


Click it and Unblock the Notifications








