హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపు! ఆఫర్లు మిస్ అవకండి.. బాగా డిమాండ్ ఉన్న కార్లను తక్కువ ధరలో సొంతం చేసుకోండి
దక్షిణ కొరియా బ్రాండ్ హ్యుందాయ్ ఇండియాలో మంచి మార్కెట్ కలిగి ఉంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి వాహన తయారీదారులకు పోటీగా అమ్మకాలతో దూసుకుపోతుంది. హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ ఎస్‌యూవీ వంటి విభాగాల్లో తన మెడళ్ల విక్రయాలతో మెరుగైన గణంకాలను సాధిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి హ్యుందాయ్ మోటార్ ఇండియా మే నెలలో తన ప్రముఖ కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఇటీవలి ధర పెంపు తర్వాత, ఇప్పుడు కస్టమర్లకు మరింత సంతృప్తిని కలిగించడానికి హ్యుందాయ్ భారీ ప్రయోజనాలతో ముందుకొచ్చింది. కంపెనీ తన హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ SUVలైన గ్రాండ్ i10 NIOS, వెన్యూ, ఎక్స్‌టర్ మోడళ్లపై దాదాపు రూ.75,000 వరకు ఆఫర్లు అందిస్తోంది. తక్కువ ధరలో కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. తగ్గింపు వివరాలను ఒకసారి చూద్దాం.
Hyundai Exter: హ్యుందాయ్ ఎక్స్‌టర్ ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్‌ను పొందుతున్న మైక్రో SUVగా ఉంది. ఈ కారును తక్కువ ధరలో కొనుగోలు చేయాలని అనుకునే వారు భారీ మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. ఎక్స్‌టర్‌పై కంపెనీ కనీసం రూ.55,000 వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది, ఇది SUVను కొనుగోలు చేయాలనుకునే వారికి గొప్ప అవకాశం. ఇది మార్కెట్లో టాటా పంచ్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది.

ధర పరంగా చూస్తే, ఎక్స్‌టర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుండి రూ.10.43 లక్షల మధ్య ఉంటుంది. ఇది సరసమైన రేంజ్‌లో మంచి ఫీచర్లు, స్టైల్, పనితీరు కోరుకునే వినియోగదారులకు అనువైన ఆప్షన్‌గా మారింది. దీని ఇంజిన్ విషయానికి వస్తే, 1.2-లీటర్ కప్పా 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఇది 82 bhp పవర్, 113.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
డ్రైవింగ్‌కు అనుగుణంగా ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ఈ SUV CNG వేరియంట్‌లోనూ వస్తోంది. ఈ వెర్షన్ 68 bhp పవర్, 95.2 Nm టార్క్‌ను అందిస్తుంది. ఎక్కువ బూట్ స్పేస్ అవసరమయ్యే వినియోగదారుల కోసం హ్యుందాయ్ డ్యూయల్-సిలిండర్ CNG టెక్నాలజీని అందించింది, ఇది ప్రయాణాల్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతుంది.

Hyundai Grand i10 nios: హ్యుందాయ్ తన ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ మోడల్ అయిన గ్రాండ్ i10 NIOSపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రస్తుతం ఈ మోడల్‌పై తగ్గింపు ప్రయోజనాలు రూ.65,000 వరకు ఉన్నాయి, ఇది చిన్న కారును కొనాలనుకునే వారికి చక్కటి అవకాశంగా మారింది. ధర పరంగా ఈ హ్యాచ్‌బ్యాక్ రూ.5.98 లక్షల నుంచి రూ.8.38 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో లభిస్తోంది.
ఇది సిటీ డ్రైవింగ్‌కు చాలా అనువైన ఎంపికగా మారింది. పనితీరు విషయానికి వస్తే, గ్రాండ్ i10 NIOSలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 6,000 rpm వద్ద 81 bhp పవర్, 4,000 rpm వద్ద 113.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి, వినియోగదారులు ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను లేదా స్మార్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (AMT)ను ఎంచుకోవచ్చు.

Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కాంపాక్ట్ SUVగా, ఇప్పుడు తక్కువ ధరకు కొనుగోలుకు లభిస్తుంది. హ్యుందాయ్ వెన్యూ కొనుగోలుపై రూ.75,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. వెన్యూ ధరలు ఎక్స్-షోరూమ్‌గా చూస్తే రూ.7.94 లక్షల నుంచి రూ.13.62 లక్షల వరకు ఉన్నాయి. ఇది వివిధ బడ్జెట్లకు తగ్గట్లుగా ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
కారులో మూడు భిన్నమైన ఇంజిన్ ఆప్షన్లు లభిస్తున్నాయి. ఇది 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌ను కలిగి ఉంది. ఇది 82 bhp పవర్, 114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మరోటి 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్, 118 bhp పవర్, 172 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ వేరియంట్‌కి ఆరు-స్పీడ్ మాన్యువల్, ఏడు-స్పీడ్ DCT ఉన్నాయి.


Click it and Unblock the Notifications








