టాటాకు చెక్ పెట్టే ప్లాన్.. పేదోళ్ల కోసం మార్కెట్లోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు తీసుకొస్తున్న హ్యుందాయ్
భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల కంపెనీలలో హ్యుందాయ్ ఒకటి. ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఐయోనిక్ 5 వంటి రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. అయితే, ఈ కార్లు రెండూ కాస్త ఖరీదైనవిగా ఉన్నాయి. అందుకే, ఇప్పుడు హ్యుందాయ్ కంపెనీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
భారత మార్కెట్‌లో అత్యంత తక్కువ ధరలో సరికొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ కొత్త కారు నేరుగా టాటా పంచ్ ఈవీకి గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ చవకైన ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు, ధర వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ప్రస్తుతం టాటా మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ కూడా దూకుడు పెంచాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం హ్యుందాయ్ విక్రయిస్తున్న క్రెటా ఎలక్ట్రిక్ (ప్రారంభ ధర రూ. 18.02 లక్షలు), ఐయోనిక్ 5 (ధర రూ. 46.05 లక్షలు) వంటి కార్లు సామాన్యుడికి అందుబాటులో లేవు.
అందుకే, సామాన్యుడిని ఆకర్షించే విధంగా, తక్కువ ధరలో ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్‌లో విడుదల చేయాలని హ్యుందాయ్ ప్లాన్ చేస్తోంది. హ్యుందాయ్ విడుదల చేయబోయే ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు టాటా పంచ్ ఈవీకి (ప్రారంభ ధర రూ.9.99 లక్షలు) నేరుగా పోటీ ఇచ్చేలా ఉంటుంది. దీని ప్రారంభ ధర కూడా దాదాపు రూ.10 లక్షల లోపే ఉండే అవకాశం ఉందని అంచనా.

ఈ కొత్త కారు హ్యుందాయ్ అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచే అవకాశం ఉంది. ఈ కారులో 42 kWh, 49 kWh సామర్థ్యం గల రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు అందించవచ్చని తెలుస్తోంది. ఈ రెండు ఆప్షన్లు వరుసగా 300 కిలోమీటర్లు, 355 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందించవచ్చని సమాచారం.
చవకైన కారే అయినప్పటికీ, హ్యుందాయ్ ఇందులో అడ్వాన్సుడ్ ఫీచర్లను అందించాలని యోచిస్తోంది. ఇందులో లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360 డిగ్రీల కెమెరా, సన్‌రూఫ్, వెంటిలేషన్ సౌకర్యం ఉన్న సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సేఫ్టీ కోసం అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఐరోపా మార్కెట్‌లో విక్రయిస్తున్న హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ(Hyundai Inster EV) ఆధారంగా ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్‌కు అనుగుణంగా తయారు చేయనున్నట్లు సమాచారం. ఈ కారు పూర్తిగా భారత్‌లోనే ఉత్పత్తి చేయబడుతుంది.
హ్యుందాయ్ ఈ చవకైన ఎలక్ట్రిక్ కారు 2027వ సంవత్సరంలో భారత మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భవిష్యత్తులో హ్యుందాయ్ ప్రస్తుతం ఉన్న వెన్యూ, గ్రాండ్ ఐ10 నియోస్ కార్ల ఎలక్ట్రిక్ వెర్షన్‌లను కూడా విడుదల చేయవచ్చు. మొత్తానికి హ్యందాయ్ త్వరలో అమ్మకాలు పెంచుకునేందుకు బాగానే ప్లాన్ చేసింది.


Click it and Unblock the Notifications








