ఈ కంపెనీ కార్లంటే పిచ్చెక్కి పోతున్న జనాలు..కొత్తగా వచ్చిన కారుకైతే ఏకంగా రోజుకు 1000 బుక్సింగ్ వస్తున్నయ్
ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) దేశీయ మార్కెట్‌లో మరోసారి తన సత్తా చాటింది. నవంబర్ 2025లో కంపెనీ మొత్తం 66,840 యూనిట్ల(దేశీయ + ఎగుమతులు)ను కొనుగోలుదారులకు విక్రయించింది. 2024 నవంబర్‌లో విక్రయించిన 61,252 యూనిట్లతో పోలిస్తే, ఇది 9.12% వృద్ధిని నమోదు చేసింది.
దేశీయ మార్కెట్‌లో 50,340 యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా, ఎగుమతుల్లో ఏకంగా 26.9% పెరుగుదల కనిపించింది. ఈ గణాంకాలు మార్కెట్‌లో హ్యుందాయ్ కార్లకు ఉన్న డిమాండ్‌ను స్పష్టం చేస్తున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చిన GST 2.0 సంస్కరణల కారణంగా కార్ల ధరలు తగ్గడం, అలాగే క్రెటా, వెన్యూ SUV లకు భారీ డిమాండ్ ఉండటమే ఈ అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలని కంపెనీ తెలిపింది.

హ్యుందాయ్ నవంబర్ అమ్మకాలలో అతిపెద్ద హైలైట్ ఏమిటంటే, నవంబర్ 4న విడుదలైన న్యూ జనరేషన్ హ్యుందాయ్ వెన్యూ SUVకి లభించిన అపూర్వ స్పందన. ఈ కొత్త మోడల్ మార్కెట్‌లోకి వచ్చిన నెల రోజులు కాకుండానే, ఏకంగా 32,000కు పైగా బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది. హ్యుందాయ్ నుంచి వచ్చిన మొదటి సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) గా దీన్ని పరిచయం చేశారు.
ఈ వెన్యూ కంపెనీ SUV పోర్ట్‌ఫోలియోకు మరింత బలాన్ని చేకూర్చిందని హ్యుందాయ్ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. బుకింగ్స్ భారీగా ఉండటంతో, త్వరలోనే కస్టమర్‌లకు ఈ వాహనాల డెలివరీలను ప్రారంభించనున్నారు. కొత్త హ్యుందాయ్ వెన్యూ SUV పోటీ ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.89 లక్షల నుంచి రూ.15.48 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)ధర ఉంది. ఈ వాహనం HX 2, HX 4, HX 5, HX 6 వంటి వివిధ వేరియంట్ల ఎంపికలో లభిస్తుంది.

కొలతల విషయానికి వస్తే.. ఈ SUV 3,995 మి.మీ. పొడవు, 1,800 మి.మీ. వెడల్పు, 1,665 మి.మీ. ఎత్తును కలిగి ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 170 మి.మీ. మరియు వీల్‌బేస్ 2,520 మి.మీ. ఇది డ్రాగన్ రెడ్, అబిస్ బ్లాక్, టైటాన్ గ్రే, మిస్టిక్ సఫైర్, అట్లాస్ వైట్, హాజెల్ బ్లూ వంటి ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది.
వెన్యూ మూడు పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లను కలిగి ఉంది. 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు. వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ మ్యాన్యువల్, 7-స్పీడ్ DCT (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్) గేర్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది లీటరుకు 17.9 నుంచి 20.99 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది.

కొత్త హ్యుందాయ్ వెన్యూ కేవలం డిజైన్ పరంగానే కాక, టెక్నాలజీ, సేఫ్టీలో కూడా అగ్రస్థానంలో ఉంది. లోపలి భాగంలో కాఫీ టేబుల్ సెంటర్ కన్సోల్, డుయల్-టోన్ ఇంటీరియర్ థీమ్ (డార్క్ నేవీ, డోవ్ గ్రే) ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే 12.3 అంగుళాల డ్యూయల్ స్క్రీన్లు కలిగిన కర్వ్డ్ పనోరమిక్ డిస్‌ప్లే (టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ డిస్‌ప్లే).
8-స్పీకర్ల బోస్ మ్యూజిక్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లను జోడించారు.

5-సీటర్ కారుగా, ప్రయాణాలకు అనువుగా 375 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది, ఇది ఎక్కువ సామాను తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.


Click it and Unblock the Notifications








