భారత రోడ్లపై తళుక్కుమన్న హ్యుందాయ్ స్టారియా.. ఇది కారు కాదు రోడ్డుపై తిరిగే పడవ!
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్.. తన వాహనాలతో కొన్నేళ్లుగా భారత ఆటోమోబైల్ ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ 2025 లోనూ కొత్త వాహనాలతో మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తమ బ్రాండ్ నుంచి క్రెటా ఈవీని 2025 ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేయనుంది. అయితే.. ఈ సంస్థ నుంచి మరో కొత్త మోడల్ స్టారియా ఎంపీవీ కారు భారత రోడ్లపై రయ్యిన దూసుకెళ్తూ కనిపిస్తోంది. ఇంకా రిలీజ్ కాకముందే ఈ కారు కనిపించడం అందరినీ ఆశ్చర్యపరించింది. ఈ ఎంపీవీ ఇంతకుముందు ఎప్పుడూ కనిపించలేదు. ముంబయి నగర రోడ్లపై వైట్ నంబర్ ప్లేటుతో తిరుగుతున్న ఈ కారు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ కారు గురించి ఆటోమోబైల్ ప్రేమికులు ఆరా తీయడం మొదలుపెట్టారు. మనం కూడా ఇప్పుడు ఈ కారు గురించి తెలుసుకుందాం.
దేశంలో ప్రస్తుతం మల్టీ పర్పస్ వెహికిల్స్‌కు డిమాండ్ అధికంగా ఉంది. మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి మోడటల్ కారు ఈ సెగ్మెంట్లో ఇప్పటికే వినియోగదారులను బాగా ఆకట్టుకున్నాయి. అదే సమయంలో కియా సంస్థ న్యూ జనరేషన్ మోడల్ అయిన కార్నివాల్ ఎంపీవీ కూడా.. గతేడాది హాట్ కేకుల్లా అమ్ముడైంది. ఈ కారు ధర... కాస్త అధికంగా ఉన్నప్పటికీ.. వినియోగాదారులు దీన్ని కొనేందుకు బాగానే ఆసక్తి చూపించారు.

ఇప్పుడు హ్యుందాయ్ సంస్థ స్టారియా పేరుతో ఓ కొత్త ఎంపీవీ భారతీయ రోడ్లపై చక్కర్లు కొడతోంది. ఈ స్టారియా కారు ఇప్పటికే కొన్ని విదేశాల్లో బాగా పాపులర్ అయింది. భారత సందర్శనకు వచ్చిన కొరియా దౌత్యవేత్తలు బ్లూ నంబర్ ప్లేటుతో ఉండే ఈ కార్లలో తిరుగుతూ అంతకుముందు కనిపించారు. కానీ, ఇప్పుడు స్టారియా మోడల్ కారు వైట్ నంబర్ ప్లేటుతో కనిపించింది.
వ్యక్తిగత వినియోగం కోసం ఈ వైట్ నంబర్ ప్లేటును భారత్‌లో వినియోగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. లగ్జరీ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులను సంతృప్తి పరిచే విధంగా హ్యుందాయ్ సంస్థ ఈ స్టారియా కారు మోడల్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. హ్యుందాయ్ సంస్థ నుంచి ఇదివరకే ఉన్న స్టార్గేజర్ ఎంపీవీ కంటే స్టారియా కారు సైజులో కాస్త పెద్దదిగా ఉంటుంది.

ఈ కారు 5.3 మీటర్ల పొడవుతో ఉంది. ఇందులో ఏడుగురు ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు. దక్షిణ కొరియాలో స్టారియా కారు.. కియా కార్నివాల్‌కు గట్టి పోటీగా ఉంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, స్పేషియస్ ఇంటీరియర్, ఆధునాతన ఫీచర్ల కారణంగా విదేశాల్లో ఈ కారు బాగానే పాపులారిటీ సొంతం చేసుకుంది. ఓవర్సీస్ మార్కెట్లో ఈ కారు పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
గతేడాది ఈ కారును హ్యుందాయ్ సంస్థ అప్‌డేట్ చేసింది. 3.5 లీటర్ V6 పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, 1.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, హైబ్రిడ్ పవర్‌ట్రైన్ ఆప్షన్లతో గతేడాది ఈ కారును తీసుకువచ్చింది. 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానించి ఉండి, 242 bhp, 367 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

దీని సైజు, వెయిట్ అధికంగా ఉన్నప్పటికీ.. ఈ కారు ఫ్యూయల్ ఎఫీషియన్సీ కూడా బాగానే ఉంటుంది. ఇది 13 kmpl మైలేజీ అందిస్తుంది. ముంబయిలో కనిపించిన స్టారియా మోడల్ కారు.. పెద్ద సైడ్ మిర్రర్స్ తో, స్లైడింగ్ రియర్ డోర్స్ తో ఉంది. కియా కార్నివాల్ కారును తలదన్నేలా ఇది కనిపిస్తోంది. ఈ కారును భారత్‌లో త్వరలోనే లాంచ్ చేసే అవకాశం ఉంది.
ముంబయిలో కనిపించిన హ్యాుందాయ్ స్టారియా కారు ఎవరో ఇంపోర్ట్ చేసుకున్నదిగా తెలుస్తోంది. దీని గురించి నెటిజన్లు ఆరా తీయడాన్ని బట్టి.. భారత్ లో ప్రీమియం ఎంపీవీలకు డిమాండ్ అధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారును ఎప్పుడు తీసుకురానున్నారనే విషయాన్ని హ్యూందాయ్ సంస్థ ఇంకా ఏమీ వెల్లడించలేదు. ఈ కారు ప్రస్తుతం కావాలనుకునన్నవారు ఎవరైనా ఇంపోర్ట్స్ మీదనే ఆధారపడాలి.


Click it and Unblock the Notifications








